Here’s A Small Note About The Struggle Of Migrants & Daily Wage Workers In This Lockdown

Contributed by Sri Charan
సమస్యో సంక్షోభమో ఇది
ప్రమాదమో ప్రళయమో మరి
విశాల జగతిని విషాద జగతిగా మారుస్తుంది…
చావుల సంఖ్యలు లెక్కెడుతూ రోజులు గడిపే గతి పట్టించింది
మనవ తప్పిదమో,ప్రకృతి ప్రకోపమో యావద్ మానవ జాతిని కబలిస్తుంది కరుణ లేకుండా కాటేస్తుంది.
ఎన్నో కథలున్నాయి..మరెన్నో వ్యధలున్నాయి మరి..
ఇంట్లోనే కొందరు , ఎక్కడో ఇరుక్కుపోయి ఇంకొందరు
రేపేలా ఉంటుందో అనే బెంగ కొందరిది – రేపటికి ఉంటామో లేదో అని భయం ఇంకొందరిది
బోసిపోయిన ఇల్లులు నవ్వులతో కళకళలాడుతుంటే – మూగబోయిన గొంతుకల పేగులు నకనకలాడుతున్నాయి ఓ పక్క
కాలం ఎలా గడపాలో తెలియక కొందరం – పూట ఎలా గడపాలో తెలియక ఇంకెందరో
కాలు బయట పెట్టలేకపోతున్నామని భాద పడేది కొందరు – కాలిబాటనే మైళ్ళకి మైళ్ళు నడుస్తున్న బాటసారులు ఎందరో
కూటి కోసం,కూలి కోసం బతుకుదామని వలసపోతే…చావు రోగం దాపురించి బయటికెల్లె వీలు లేదంటే,
బతుకు లేక,బతక లేక మాయ రోగం దేవుడెరుగు ఆకలికి తాళలేక తాడుకి ఉరేసుకు చస్తున్న దీనులేందరో.


పట్టెడన్నం పెట్టలేక అడిగే దిక్కులేక పురిటినొప్పుల కంటే బిడ్డల ఆకలి కేకలు భరించలేక కన్నపేగులని వదులుకుంటున్న తల్లులు కొందరు
బతుకేలేనప్పుడు,బతకలేమన్నప్పుడు ఆ చావైనా కన్న నేలపై రావాలని,సొంత ఊరికి పోవాలని రోజులకి రోజులు నడుస్తూ అలుస్తున్న అభాగ్యులెందరో
జనాలని బతికించే పనిలోపడి చావుతో రోజూ సావాసం చేసే సాహసికులు ఎందరో
మన బాగోగుల కోసం తమ జీవితాలను బలి పీఠం మీద పెడుతున్న భద్రతా సిబ్బంది ఎందరో.
గాయాలనిస్తుంది…మనమెప్పుడూ వినని గాధలెన్నో వినిపిస్తుంది…గుండెలవిసేలా విలపించేలా చేస్తుంది..
ఈ విపత్తు వీడాలని కోరుకుందాం…
ఓ జీవితకాలానికి సరిపడా జ్ఞాపకమిది…మనం మన జీవితాలని ఎలా సరిచేసుకోవాలో చెప్పే గుణ పాఠం ఇది.
If you wish to contribute, mail us at admin@chaibisket.com