A Conversation Between A Youngster & An Oldman About Men & Their Emotional Side

 

Contributed by: Raviteja Ayyagari

బాబు! నిన్ను చాలా సేపటి నుంచి గమనిస్తున్నాను. కళ్ళల్లోంచి నీళ్లు రావాలా, వద్దా అనే చిన్న అయోమయంలో ఉన్నట్టు అక్కడే ఆగిపోయాయి. ఫోన్ 20 సార్లు మోగింది. ఎత్తలేదు. నీ బాధ పెంచడానికి అడిగాను అని అనుకోకపోతే, ఎం జరిగింది? ప్రేమలో సమస్య!?” బాధపడుతున్న నిపుణ్ ని అడిగాడు, అక్కడ కూర్చున్న పెద్దాయన.

ఆ మాట విని చాలా కోపంగా ఆ పెద్దాయన ను చూస్తూ, “ఈ మధ్య మా లాంటి అబ్బాయిలని చూస్తే మీకు బాగా చులకన అయిపోయినట్టు ఉంది సార్. “ఒంటరిగా కూర్చుని ఏడిస్తే అమ్మాయి కోసమే అని తేల్చి చెప్పేస్తారు.

 

ఓహ్! ప్రేమ సమస్య కాదా? మరి ఏంటి నీ బాధ?” కొంచం నెమ్మదిగా అడిగాడు పెద్దాయన.

నిపుణ్: “బాధ కాదు సార్! ఆవేదన! నాకు 25 సంవత్సరాలు! మంచి ఉద్యోగం నచ్చక వదిలేసాను. అమ్మ నాన్న ఒక్క మాట కూడా అనలేదు. కనీసం ఎందుకు రా అని కూడా ప్రశ్నించలేదు. కేవలం నీకు నచ్చింది చెయ్యరా అని చెప్పి ఆ విషయం గురించి మర్చిపోయారు. నాకేమో సొంతంగా ఒక కంపెనీ పెట్టాలి అని కోరిక. కానీ ఎక్కడ ఫండింగ్ ఇవ్వట్లేదు. ఈ లోపులో మా అక్క పెళ్లి కుదిరింది. ఆ ఉద్యోగం చేస్తూ ఉండి ఉంటె ఈ పాటికి నాన్నకి అక్క పెళ్లి పనులలో అండగా ఉండగలిగేవాడిని. పోనీ నా గురించి తర్వాత అలోచించి ప్రస్తుతానికి ఉద్యోగం చేసి కొంచం నాన్నకి డబ్బు సహాయం చేద్దాం అనుకుంటే గ్యాప్ వచ్చినదని ఎవరు ఉద్యోగం ఇవ్వట్లేదు. నిన్న నాన్న ఎవరి దగ్గరకో వెళ్లి 3 లక్షలు అప్పు తీసుకున్నారు. ఏంటిరా ఇలా ఉంటున్నావ్ అని అనడానికి, నువ్వు ఇది చేస్తే నీకు మంచిది అని సలహాలు ఇవ్వడానికి తప్పిస్తే, “నువ్వు ఎం చేసిన అందులో విజయం సాధిస్తావ్ అని స్ఫూర్తినివ్వని మనుషులు”. ఇవన్నీ ఆలోచిస్తూ అసలు నేను బాద్యత లేని కొడుకుని అని నా మీద నాకే అసహ్యం వేస్తుంది. I am not a good son sir. I am not a good son.

 

పెద్దాయన ఆ మాట విని, “నిన్ను చూస్తుంటే జాలేస్తోందయ్యా! మనం బాగున్నపుడు బంధం గుర్తున్చునుకుని బాగాలేనప్పుడు బాధ్యత గుర్తు చేసేవాళ్లు మధ్యలో ఉంటున్నాం. అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోకూడదు. మీ అమ్మ, నాన్న నిన్నే నమ్ముతున్నారు. పెళ్లి అనేది తల్లిదండ్రుల బాధ్యత. నువ్వు సహాయం చెయ్యట్లేదు అని నీకు నువ్వే ఎలా అనుకుంటున్నావు. నువ్వు పక్కన ఉన్నావ్ అనే ధైర్యం తోనే కదా నీ తండ్రి పెళ్లి పనులు చూసుకుంటుంది. ఇంక మీ నాన్న చేసిన అప్పు అంటావా, రేపు నువ్వు గెలిస్తే అప్పుని యిట్టె తీర్చేస్తావ్. నన్ను అడిగితే, మంచి ఉద్యోగం మానేస్తే ఏ తండ్రి ఊరుకోడు. మీ నాన్న ఊరుకున్నాడు అంటే, మీ నాన్నకి నీ మీద ఎంత నమ్మకం ఉండాలి? అయినా, రేపు అక్క పెళ్లి పెట్టుకుని ఏంటి ఇది? వెళ్లి మీ నాన్నకి తోడుగా ఉండు. ఎన్ని పనులు ఉంటాయి. అసలే ఎన్ని సార్లు కాల్ చేసారో ఏంటో. ఇదిగో నీ ఫైల్, ఫోన్. ముందు వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడు. మరి, నన్ను మీ అక్క ఇంటికి పిలుస్తావా?

అలా ఆ పెద్దాయన మాట విని, పెళ్లి కార్డు ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు నిపుణ్. మరుసటి రోజు నిపుణ్ వాళ్ళ అక్క పెళ్లి.

ఆయన్ని చూసి నిపుణ్, “రండి సార్! మీరు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది! రండి ఫోటో దిగుదురుగాని!

మీ అక్క, బావగారి జంట బాగుందయ్యా! అన్నట్టు ఈ హడావిడి అంత అయిపోయాక ఒకసారి కలువు!” అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఆ పెద్దాయన.

ఇంకొక వారం తర్వాత పెద్దాయన చెప్పిన అడ్రస్ కి వెళ్ళాడు నిపుణ్. “సార్! బాగున్నారా?

 

ఆ! రావయ్యా! అంత కులాసాయేనా? నీ ప్రాజెక్ట్ ని నేను స్పాన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. మరి నీకు ఒకే నా? ఆ కాన్సెప్ట్ ఏ నా? ఏదైనా మార్చావా?” అని నిపుణ్ కి షాక్ ఇచ్చాడు పెద్దాయన.

నిపుణ్ ఆ మాట విని షాక్ అయ్యాడు. “సార్! మీకు ఎలా?

మొన్న బీచ్ దగ్గర చూసానయ్యా నీ ఫైల్. తర్వాత నీ క్యారెక్టర్ నచ్చి నీ గురించి ఇంకొంచం తెలుసుకుందాం అని నీ linkedin ప్రొఫైల్ చూసా. నీ ప్రొఫైల్, నీ ఫిలాసఫీ రెండు నచ్చి నీకు గెలవడానికి ఒక అవకాశం ఇద్దాం అని అనుకున్న. నాతో పని చెయ్యడం నీకు ఓకే నా?

అది విని నిపుణ్ కి ఆనంద భాష్పవాలు ఆగకుండా వస్తూనే ఉన్నాయ్. తన మీదే నమ్మకం పెట్టుకున్న అమ్మ, నాన్న కి ఆనందం ఇవ్వగలుగుతున్నాను అనే సంతృప్తి కలిగింది. అతనికి ఆ అవకాశం ఇచ్చిన ఆ పెద్దాయన కాళ్ళ మీద పడి అతని కృతజ్ఞత ని తెలిపాడు.

సమాజం దృష్టిలో ఒక అబ్బాయి మీద చాల చులకన భావం ఉంటుంది. ఎక్కడో ఎవరో ఒకరు చేసిన తప్పుకి మిగిలిన అబ్బాయిలందరు ఒకేలా ఉంటారు అని కంక్లూషన్ కి వచ్చేస్తాం. కానీ అది తప్పు, మగాళ్లు అందరికి ఎదో ఒకటి సాధించాలి అనే పట్టుదల ఉంటుంది. అలాంటి వాళ్ళని ప్రోత్సహించాల్సింది ముందుగా తల్లిదండ్రులే. అలాంటి మంచి ఆశయం ఉన్న అబ్బాయిలకి, వాళ్ళని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకి ఈ కథ అంకితం. జై హింద్!

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , , , , , , , ,