Things Every Telugu Speaking Person Must Know About The Wonder Of A Film That Is ‘Mayabazar’!

 

క్షమించాలి కొద్దిగా అసభ్యత తో కూడిన పదాలు వాడినందుకు.. కాని మాయా బజార్ గురించిన విషయాలు చదివితే నేను రాసినది వంద శాతం సమంజసమే అని మీరూ ఒప్పుకుంటారు.

 

ముందుగా దృష్టిలో ఉంచుకోవలసిన ముఖ్యమైన విషయం:
*** ఈ చిత్రం 1957 లో నిర్మించబడినది : అంటే మనషులు మాట్లాడుకోవటానికి అడ్డంగా చరవాణి(మొబైల్స్)లు, దూర వాణిలు(ఫోన్స్), అంతర్జాలాలు మరీ ముఖ్యంగా “విషయ గణన విశ్లేషణ యంత్రాలు (కంప్యూటర్స్)” లేని కాలం అన్నమాట.

మాయా బజార్ అద్భుతాలలోకి మీకు స్వాగతం..

 

థిస్ ఇస్ నాట్ జస్ట్ ఎ రికార్డ్… ఇట్స్ అన్ ఆల్ టైం రికార్ద్ :

* దేశం లోనే మొదటి సారిగా రెండు లక్షల రూపాయల వ్యయం తో నిర్మించబడిన చిత్రం.
* ఒకే సారి రెండు భాషలలో నిర్మించబడిన మొదటి చిత్రం; తెలుగు తమిళ్ లో నిర్మించారు.

Mayabazar1 copy

 

విజయ ప్రొడక్షన్స్…అంటే పేరు కాదు ఒక బ్రాండ్ :

* విజయ ప్రొడక్షన్స్ లో వచ్చిన ఆరవ చిత్రం, అంతకు ముందు పాతాల భైరవి, మిస్సమ్మ వంటి సినిమాలు నిర్మించారు.
* ఆలూరి చక్రపాణి, బొమ్మిరెడ్డి నాగి రెడ్డి (B.N రెడ్డి) గారు ఈ చిత్రానికి సాంకేతిక వర్గాన్ని ఎంపిక చేసారు.
* ఎన్టీఆర్ మరియు యస్ వి ఆర్ గారు అప్పటివరకూ వచ్చిన విజయ ప్రొడక్షన్ అన్ని చిత్రాల్లో దాదాపు నటించారు.

maya2

 

ఏదైనా ఆయన దిగనంత వరకే :

* కదిరి వెంకట రెడ్డి గారు ఈ చిత్ర దర్శకులు, కథకుడు(స్క్రీన్ ప్లే రైటర్) కూడా.
* అంతకు ముందు పాతాళ భైరవి చిత్రానికి దర్శకత్వం వహించారు.
* శశి రేఖ పాత్ర ని చిన్న పిల్ల నుండి పెద్ద దానిగా మారేలా చూపించిన విధానం ఆయనలోని స్పష్టత, ప్రతి అంశం మీద పట్టుకు నిదర్శనం. (మీరు వీడియో చూస్తె నీళ్ళ మీద ప్రతిబింబం కదలటం తో పాటు BGM లో కోకిల స్వరం వస్తుంటుంది.. అంటే పాప పెద్దది అయ్యిందనిచెప్పటానికి గా విజువల్ నే కాదు సౌండ్ ని కూడా వాడారు.)

maya3

 

మాయ చేసిన మార్కస్ బార్ట్లే :

* మార్కస్ బార్ట్లే ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్.
* లాహిరి లాహిరి లాహిరి లో పాట మిట్ట మధ్యాన్నం షూట్ చేసారట, కాని అది సినిమాలో వెన్నల్లో వచ్చే పాట. మిట్ట మధ్యానాన్ని వెన్నెల రాత్రిగా మార్చారు బార్ట్లే.

marcus1

 

* సావిత్రి గారి పరిచయ సన్నివేశం లో నీటి అలల లో నుండి తన ప్రతిబింబాన్ని చూపించటం ఆయన ప్రతిభ కు చిన్న ఉదాహరణ.


 

తెలుగు ప్రజల కృష్ణుడు గా ఎన్టీఆర్ అవతరించింది ఈ చిత్రం తోనే:

* ఎన్టీఆర్ ని పట్టు పట్టి కృష్ణుడు గా చూపించారట B.V రెడ్డి గారు.
* ఈ చిత్రం విడుదల తర్వాత 40,000 పైగా కృష్ణుడిగా ఉన్న ఎన్టీఆర్ క్యాలెండరు లు ప్రజలకు అందించారట.
* ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ దాదాపు 15 పైగా చిత్రాల్లో కృష్ణుడిగా నటించారు.

krshnudu

 

ఆయన స్థాయి వేరు.. ఆ స్థానం వేరు :

* యస్ వి రంగా రావు గారి పేరు మీదనే ఈ చిత్రం వ్యాపారం అంతా జరిగిందట. అప్పట్లో SVR ఒక పే..ద్ద స్టార్. స్టార్ అంటే ఇప్పుడు లా కాదు అదో రకం.
* అసలు సినిమా పేరు కూడా ఘటోత్కచుడు అని పెడదాం అనుకున్నారట, కాని SVR గారే చిత్ర కథని పట్టి పెట్టమని అడిగేసరికి మాయాబజార్ గా మారిపోయింది.
* అప్పట్లో పాటల ఆల్బం కవర్ మీద కూడా ఒక్క SVR గారి బొమ్మ మాత్రమె వేశారంటే అర్ధం చేసుకోవచ్చు.

maya7

 

కంటెంట్ ఉన్నోడికి కంప్యుటర్ తో పని లేదు :

* ఘటోత్కచుడు, అభిమన్యుడు యుద్ధం లో సన్నివేశాలు అప్పట్లో చేయగలరని ఊహించగలమా.


 

* ఘటోత్కచుడు వివాహ భోజనమ్ము పాట లో ఉన్న స్పెషల్ ఎఫెక్ట్స్ ఇప్పటికీ ఒక అద్భుతం. కంప్యూటర్ గ్రాఫిక్స్ కాదు కాదా అసలు కంప్యూటర్ లేని కాలంలో చేసారు.

vivahabhijanam

 

* ద్వారకా నగర విహంగ వీక్షనాన్ని 50 X 60 అడుగుల స్థలం లో 300 చిన్న చిన్న అట్ట పెట్టల ఇల్లు చేసి వాటి కిందుగా బల్బులు పెట్టి చేసారట. అప్పటికి మన దేశం లో విద్యుత్ ఉన్న ఇల్లులు మచ్చుకు కూడా ఉండేవి కావేమో.

dwaraka

 

కళ్ళున్నోడు ముందు మాత్రమె చూస్తాడు.. దిమాగ్ ఉన్నాడు భవిష్యత్తు ని కూడా చూస్తాడు :

* ఇప్పుడు మనకి లాప్టాప్, వీడియో కాలింగ్ అనేవి తెలుసు కాని విద్యుత్ కూడా సరిగా లేని ఆ రోజుల్లోనే “ప్రియ దర్శిని” అని పరిచయం చేసారు ఈ చిత్రం లో. అది అచ్చం ఇప్పటి లాప్టాప్ లానే ఉంటుంది, అందులో వీడియో కాలింగ్ ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.

video calling

 

* ఇప్పుడు లై డిటెక్టర్స్ అంటూ పుట్టుకొచ్చాయ్.. కాని అప్పట్లోనే ఈ చిత్రం లో “సత్య పీఠాన్ని”చూపించారు . దాని మీద నిల్చున్న ఎవ్వరైనా నిజం చెప్పేయటం దాని ప్రత్యేకత.

satyapeetham

 

* ఘటోత్కచుడు కోటలోనికి ఎవరైనా రాగానే సమాచారం అందించే వ్యవస్థ. ఇప్పుడు ఉన్నట్టు cc కెమెరా లు లేవండి అప్పట్లో.


 

టూకీగా…

* మార్చి 27 1957 న విడుదల అయిన ఈ చిత్రం 24 సెంటర్లలో 100 రోజులు ఆ తర్వాత సిల్వర్జూబ్లి జరుపుకుంది.
* 1957 లో ఉత్తమ తెలుగు చిత్రం గా ఫిలిం ఫేర్. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా, ఇండోనేషియా ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శన.
* యస్ రాజేశ్వరరావు గారు స్వరపరిచిన నాలుగు పాటలతో సహా మిగిలిన సంగీతాన్ని ఘంటసాల గారు అందించటం జరిగింది.
* సంవత్సరం ప్రీ ప్రొడక్షన్ పని తర్వాతా 400 మంది కార్మికులతో, నటీ నటుల తో చిత్రీకరణ మొదలెట్టారు.
* రంగుల చిత్రం గా మార్చబడిన మొదటి తెలుగు చిత్రం మాయ బజార్. గోల్డ్ స్టోన్ టెక్నాలజీ వారు 7.5 కోట్లు ఖర్చు చేసి ఆధునీకరించారు.
* జనవరి 30 2010 న రంగుల మయా బజార్ చిత్రాన్ని తిరిగి విడుదల చేసారు, మరొక్క సారి 100 రోజుల వేడుక జరుపుకుంది.
* 2013 లో CNN – IBN వారు నిర్వహించిన పోల్ లో భారత దేశం లోనే చూడదగ్గ అత్యద్భుత చలన చిత్రాల జాబితాలో మొదటిది గా నిలిచింది.
* 2014 లో CNN – IBN వారు ప్రకటించిన “12 గొప్ప పుస్తకాలుగా మార్చగల భారతీయ చలన చిత్రాలు” లో ఒకటిగా నిలిచింది.
* సింగీతం శ్రీనివాస రావు గారు ఈ చిత్రానికి సహాయ దర్శకులు గా పని చేసారు. ఆయన తీసిన ఒక బొమ్మల చిత్రానికి(ఘటోత్కచ) ఈ సినిమానే స్పూర్తి.
* ఈ చిత్రం గురించి భావితరాలకు తెలియాలి అన్న ఉద్దేశంతో 2014 నుండి ఆంధ్ర ప్రదేశ్ 10వ తరగతి ఆంగ్ల పుస్తకం లో నాల్గవ పాఠం లా చేర్చటం జరిగింది.

maya

 

ఈ చిత్రంలోని కొన్ని గొప్ప సంభాషణలు: వీటిని ఇప్పటికి మన పెద్ద వాళ్ళు వాడటం విశేషం.

* వూరికే కనిపిస్తారా అన్నయ్య మహానుభావులు
* ముందుంది ముసళ్ళ పండుగా.
* తెలియని వానికి చెప్పినా తెలియదు లే.
* పాండిత్యం కంటే జ్ఞానమే ముఖ్యం
* ఆ.. ఈ కాలపు పిల్లలు అంతేలెండి. (ఇది సార్వ జనీనం అయిన మాట..ఏ తరానికైన వర్తిస్తుంది)
* ఎవరు పుట్టించకుండా మాటలెలా పుడతాయ్?!
* అస్మదీయులు – మనవాళ్ళు; తస్మదీయులు – పగ వాళ్ళు; దుష్ట చతుష్టయం;
* చిన్న చేప ను పెద్ద చేప.. చిన మాయను పెద్ద మాయా..అది స్వాహా.. ఇది స్వాహా!

mayabazar12

 

*** ఇక్కడ రాయబడిన ప్రతి పదం వికిపీడియా నుండి సేకరించటం జరిగింది.

 

Check out the trailer of our upcoming Web Series, Nenu Mee Kalyan.

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , ,