మనవడు అడిగిన ప్రశ్న కి, తాతయ్య అన్వేషణ – A Short Story

Contributed By Ruthvik Kilaru

రాత్రి పూట 9:30 అవుతుంది….మెల్లిగా నిద్రలోకి జారుకున్నారు మన మూర్తి గారు….body మాత్రమే పడుకుంది brain కాదుగా…కాబట్టి మూర్తి గారు తన కలలో అనుకుంటున్న మాటలు…..

  డెబ్బై ఐదు ఏళ్ళ వయసులో పలకరించడానికి నలుగురు మనుషులు, బాదని పంచుకోడానికి కొందరు స్నేహితులు, పండక్కి వచ్చి వెళ్ళే కూతుర్లు,కొడుకులు, మనవళ్ళు, మనవరాళ్లు వుంటే పెద్ద టెన్షన్లు ఏముంటాయి పడుకుంటే పొద్దున్నే బార్య కాఫీతో  నిద్ర లేపే దాకా ప్రశాంతంగా నిద్ర పట్టుద్ది….

కానీ ఆరోజు తన మనవడు మూర్తి గారిని అడిగిన ఒక ప్రశ్న మన మూర్తి గారిని బాగా ఆలోచించేలా చేసింది….మూర్తి గారు తన మనవడికి ఒక కథ చెప్తూ దేవుడు మనల్ని ఏదో ఒక పని complete చేయడానికే పుట్టిస్తారు ర అని చెప్పారు మరి ఆ చిన్న బుర్రలో ఎం అనుకున్నాడో ఏమో అసలు ఆలోచించకుండా…..

తాత!!! మరి నిన్ను ఒక పని కోసం పంపించాడు కదా దేవుడు అది నువ్వు complete చేసావని నీకెలా తెలుస్తుంది…..

డెబ్బై ఐదు ఏళ్ళ జీవితం పుస్తకంలో రాయాలంటే టైం పట్టుద్ది కానీ పడుకుంటే ఒక్క నైట్ లో కనపడిపొద్ది ఆ దైర్యం తోనే మూర్తి గారు తన మనవడు అడిగిన ప్రశ్న కి జవాబు కోసం ఈరోజు త్వరగానే పడుకున్నారు…..

ఎక్కడో గోదావరి జిల్లా లో ఒక చిన్న పల్లెటూరు లో మొదలైన తన ప్రయాణం చివరకి తిరుపతి లో ఆగింది…. అంటే గవర్నమెంట్ ఉద్యోగి కదా ప్రమోషన్స్ కంటే ట్రాన్స్ఫర్ లు ఎక్కువ అవుతాయి మరి….మొదటి నుంచి కష్టపడే తత్వం ఆ కష్టానికి ప్రతిఫలం అనుకుంటా తన కుటుంబం కష్టపడాల్సిన అవసరం లేకుండా పోయింది…మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు, తర్వాత అర్దం చేసుకునే భార్య , బాగా చదివి అంతకంటే బాగా settle అయిన పిల్లలు ఇంకేం కావాలి ప్రశాంతం గా ఉద్యోగం చేసుకుంటూ 60 సంవత్సరాలకి రిటైర్ అయ్యారు….అయిన సరే కాళిగా కూర్చోవడం ఎందుకని చిన్న పిల్లలకి చదువు చెప్పడం మొదలు పెట్టారు…మామూలుగా అయితే భార్య చెప్తుంది రిటైర్ అయ్యారు కదా life ని enjoy చేయండి ఇంకా ఎందుకు కష్టపడుతున్నారు అని….కానీ మన మూర్తి గారి భార్య మాత్రం అలా అస్సలు అనలేదు ఎందుకంటే కష్టపడే మనిషిని ఇంట్లో కాళిగా కుర్చోపెడితే తర్వాత నేనే బాధ పడల్సి వస్తుందని ఆమెకి బాగా తెలుసు…

ఇంత ప్రశాంతంగా వున్న జీవితానికి తన మనవడు అడిగిన ఒక చిన్న ప్రశ్నకి వెంటనే సమాధానం ఎందుకు దొరకలేదు????

అనుకుని మొదలుపెట్టిన ప్రయాణంలో అనుకోని మజిలీలు ఎదురవ్వడం జీవితం…ఆ మజిలీలు అన్ని చేరుకున్నాను కానీ ఒక్కటి మిగిలింది అదే “చావు” కాకపోతే మిగతా మజిలీలు మనం కష్టపడి చేరుకోవాలి అవి చేరుకున్నాం అని దేవుడు తెలుసుకుంటే ఆఖరి దానికి ఆయనే మనల్ని తీసుకెళ్తాడు and అప్పుడు మన జీవితం complete అయినట్టు….దేవుడు మనకి ఏదో చేయాలి అని గుడికి వెళ్తాం పూజలు చేస్తాం కానీ ఆయన మనకి పుట్టినప్పుడే ఒక వరం ఇచ్చాడు….మన చావు మన పక్కనే వున్న దాన్ని మర్చిపోయి బ్రతుకుతున్న మనకి అంతకంటే గొప్పది ఇంకేం ఇవ్వగలడు ఆయన….

మన మూర్తి గారికి మనవడు అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికేసింది ఇంకా మనవడికి చెప్పడమే ఆలస్యం…

ఉదయం 6:30 అవ్తుంది భార్య కాఫీతో తో నిద్ర లేపింది బహుశా ఆయనకి దేవుడు ఇచ్చిన పని పూర్తి చేశారు అనుకుంట…..ఆయన లేవలేదు…. డాక్టర్ ని పిలిచి చూపిస్తే ఆయన చనిపోయి తొమ్మిది గంటలు అయ్యిందని చెప్పారు అంటే ముందు రోజు 9:30 కే చనిపోయారు…

మన కథ మొదలు ఆయన ఊపిరి ఆఖరు అదే….

మూర్తి గారు నిజంగా ఇదంతా అనుకున్నారో లేదో తెలీదు కానీ ఆయన భార్య తెచ్చిన కాఫీ తాగడానికి లేచివుంటే మనవడికి ఒక గొప్ప విషయం తెలిసేదేమో….

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , ,