Here Is Why Chalam’s Maidaanam Is Still Relevant And Controversial Even After Almost 100 Years

Contributed by Madhu Thatikonda

“Woman too has a body; it should be given exercise. 

Woman too has a mind; it should be given knowledge. 

Woman too has a heart; it should be given experience.” 

  ఒకసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని నువ్వు నాకు నచ్చావ్ మూవీ గురించి అడిగినప్పుడు “చలంగారి లాగా పెళ్లి అయిన అమ్మాయి ప్రేమకథ రాసే ధైర్యం లేక, ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి ప్రేమకథ రాసా” అని చెప్పారు. అక్కడ మొదలయింది నా అన్వేషణ ఎందుకు చలం గారు అంత కాంట్రవర్సియల్ రచయిత. తన సొంత కుటుంబం, తన సొంత ఊరు వాళ్ళే తనని దూరం చేసే అంతగా, తెలుగు సాహిత్య వాదుల్ని రెండుగా చీల్చేసా అంతగా  ఏం ఉంది చలం గారి నవలల్లో అని. 

మైదానం కథలోకి వెళ్తే లాయర్ భార్య అయిన రాజేశ్వరి అనే బ్రాహ్మణ అమ్మాయి, తన భర్త క్లయింట్ అయిన అమీర్ అనే ముస్లిం వ్యక్తి ని ప్రేమించి లేచిపోద్ది. వాళ్లిద్దరూ నిజాం స్టేట్(స్వాతంత్రం రాక ముందు) లోని ఒక మారు మూల ప్రాంతం లో మైదానం అనే ప్రదేశం లో జీవిస్తారు. అక్కడ నుంచి రాజేశ్వరి జీవితం ఎలా మారింది అనేది ఈ నవల. ఈ ఆర్టికల్ లో నేను ఎక్కువ స్టోరీ/స్పాయిలర్స్ ఇవ్వ దలుచుకోలేదు. మీరే స్వయంగా చదవాలని కోరుతున్నా

చలం గారు ఈ నవలని 1920 ల్లో రాసారు. కొంతమంది 1925 అని కొంతమంది 1927 అని అన్నారు. అరుణా పబ్లిషింగ్ హౌస్ వాళ్ళు 1927 అని బుక్ లో ప్రచురించారు. “లేచిపోవటం” అనే పదం తో మొదలవుతుంది ఈ నవల. వాడుక భాష  లో ఉండేది ఏమో కానీ సాహిత్యం లో ఈ పదం వాడడం ఇదే మొదటిసారి అయి ఉండొచ్చు.  మొదటి లైన్ నుంచే పాఠకులని uncomfortable చేసి వాళ్ళ నమ్మకాలని ప్రశ్నిస్తుంది.

ఈ నవల ముఖ్యంగా స్త్రీ sexual ఆండ్ emotional ఫ్రీడమ్ గురించి చర్చిస్తుంది. తప్పు ఒప్పు లు పక్కన పెట్టి ఆలోచిస్తే, రాజేశ్వరి తీసుకునే నిర్ణయాలు తీసుకోడానికి నిజంగా సమాజం లో మహిళలకి ఆ స్వాతంత్రం ఉందా అని ఆలోచించాలి. ఈ నవల ఎక్కడా సమానత్వం గురించి మాట్లాడదు, ఎక్కడా సమాజం అలా ఉండాలి ఇలా ఉండాలి అని ఉపన్యాసాలు ఇవ్వదు. తనకి దక్కిన స్త్రీ ని ముఖ్యంగా భార్యలని తమ సొంత ఆస్తి గా భావించే మొగాళ్ళ గురించి చెబుతది. ఒక సందర్భం లో  “ లాయరు హంగులో మనము ఒక భేషజం- ఆ పుస్తకాల బీరువాలు, గుర్రపు బండి లాగే, ఎవరన్నా వస్తే ఒంటినిండా నగలు వేసి మనని చూపించవచ్చు.దేహం లో కలిగే ఆ కామరోగాన్ని మన ద్వారా కళ్ళు మూసుకుని నయం చేసుకోవచ్చు.” అని రాజేశ్వరి తన భర్త లాంటి మొగాళ్ళ గురించి చెప్తుంది.

ఈ రోజుకీ ఇలాంటి కాన్సెప్ట్ మీద ఎవరైనా నవల రాసినా లేదా సినిమా తీసినా చాలా మంది చాలా విధాలుగా స్పందిస్తారు. తప్పు చేయడం స్వాతంత్రమా అని చాలా మంది అడుగుతారు. అయినా తప్పు ఒప్పులు  ఎవరు నిర్ణయించేది ? మొగాడు తప్పు చేస్తే  ఒక రకంగా స్త్రీ తప్పు చేస్తే ఒక రకంగా చూసే ఈ సమాజమా? Goodreads అనే వెబ్ సైట్  లో ఈ నవల రివ్యూ  లు చదివితేనే  అర్ధం  అయితది. చలం గారు ఏం చెప్పతలుచుకున్నారో ఇప్పటికీ కొంతమందికి అర్ధం కాలేదు అని. 

ఎందుకు ఈ నవల అంత కాంట్రవర్సియల్ ఆండ్ తెలుగు సాహిత్యం లో ఎందుకు అంత ముఖ్యమయినది? ఈ నవల చదివిన ఇప్పటి కాలం వాళ్ళు కూడా అర్ధం చేసుకోలేని, జీర్ణించుకోలేని విషయాలు వందేళ్ల క్రితమే చలం గారు రాసారు అంటే గొప్పే కదా. అంటరానితనం, కులాల గురించి రచయితలు వాదిస్తున్న సమయాల్లో సమాజంలో స్త్రీ పాత్ర గురించి తన అవసరాల గురించి ఇంత బోల్డ్ గా రాశారు అంటే ఎంత పెద్ద సాహసమో మీరే ఆలోచించండి. 

2018 వరకు భర్త తన  భార్యని ఆస్తి లాగ భావింపచేసే  “adultery law” ని decriminalize చేయలేకపోయాం అలాంటిది ఇలాంటి ప్రశ్నలు వందేళ్ల క్రితమే  చలం గారు సమాజాన్ని అడిగారు. ఈ adultery మీద రాయడానికి వెస్ట్ లోనే ఎంతో మంది రచయితలు భయపడుతున్న సమయం లో మన భారతదేశం లో, మన తెలుగు లో ఇలాంటి ఒక నవల వచ్చింది అంటే మనం గర్వపడాల్సిన విషయం. 

 చలం గారి చివరి రోజుల్లో 1972 లో ఆకాశవాణి కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన రచనల గురించి అడిగినప్పుడు ఇలా చెప్తారు. “నా పుస్తకాల్లో తిట్టింది బయట ఉన్న మనుషుల్ని కాదు , నన్ను. నాలో యే యే  మచ్చలు ఉన్నాయో వాటిని నేను గట్టిగా తిట్టుకోవడం తో , వాటిని గట్టిగా గోక్కోవడంతో, వాటిని తన్నబోగొట్టుకోవాలని చూసుకోవడంతో ఆ పుస్తకాలన్నీ బయల్దేరాయి అవి మిమ్మల్ని అనుకోని మీరు కోప్పడ్డారు, మిమ్మల్ని కాదు నన్ను తిట్టుకుంది”

ఆ ఇంటర్వ్యూ లింక్ ఇక్కడ పెడుతున్న టైం ఉంటె వినండి. 

చలం గారి రచనలు చదివాక మీకు అవి నచ్చకపోవచ్చు నచ్చొచ్చు, కానీ తెలుగు సాహిత్యం లో ఆయన రచనలు ఒక మైలు రాయి. ఎంతో మంది రచయితలని inspire చేసిన ఒక రెబెల్ రచయిత మనకి ఉండడం మన అదృష్టం. ఇంకో వంద ఏళ్ళు అయినా కూడా చలం గారిని గుర్తుపెట్టుకోని మనం celebrate చేసుకోవాలి. 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , , ,