Meet The Incredible Woman Who Is Raising Awareness About Organ Donation

 

అవయవదానం విషయంలో కొన్ని దిక్కుమాలిన మూఢనమ్మకాలున్నాయి.. “శరీరంలోని అవయవాలను ముందుగానే తీసివేసి దహనం చేస్తే గనుక వచ్చే జన్మలో అవిటివారిగా పుడతారని, ఆర్గాన్ డొనేషన్ లో మెంబర్షిప్ తీసుకుంటే ఖచ్చితంగా యాక్సిడెంట్ అయ్యి ఏదో జరుగుతుందని” కొన్ని పనికిరాని సెంటిమెంట్స్ ఉండడం వల్ల ఇప్పటికి ఎంతోమంది మనుషులున్నా క్షతగాత్రులుగా బ్రతుకుతున్నారు చాలామంది. చెయ్యగలిగే పరిస్థితులు ఉండి చెయ్యలేకపోవడం వల్లనే నేటికి మన ప్రపంచం మార్పు కోసం ఎదురుచూస్తూ ఉంది. శరీరం ఉన్న ప్రాణిని ఇతను ఒక మనిషి అని రుజువు చేసే ఏకైక లక్షణం మానవత్వం.. నిద్రావస్థలో ఒరిగిపోయిన ఆ మానవత్వాన్ని తట్టి లేపుతూ ఆర్గాన్ డొనేషన్ పై ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సీతామహాలక్ష్మీ గారు(8008840506).

 

చూస్తుండగానే ప్రాణం పోయింది:

ప్రస్తుతం సీతామహాలక్ష్మీ గారు టీచర్ గా పనిచేస్తుంటారు. చిన్నప్పుడు తనకు డాక్టరవ్వాలని కల, కానీ ఆర్ధిక ఇబ్బందుల వల్ల కల నెరవేర్చుకోలేకపోయారు. ఐన గాని ఇష్టం మూలంగా మానవ శరీరం నిర్మాణానికి సంబంధించిన పుస్తకాలు ఎక్కువగా చదివేవారు. ఒక్కొక్క అవయవం పనితీరు, అవయవాలన్నీ సమిష్టంగా కలిసి పనిచెయ్యకపోతే జరిగే పరిణామాలేమిటి.? మొదలైన విషయాలను పుస్తకాల ద్వారా తెలుసుకునేవారు. ఈ ప్రయానంలోనే మంచి ఆరోగ్య అలవాట్లు పాటించినా కానీ 2005 లో తనకు కిడ్నీ సమస్య వచ్చింది. కోయంబత్తూర్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. అదే హాస్పిటల్ లో ఏడేళ్ల బాబుకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ కోసం మరో కిడ్నీ దొరకక కళ్ళముందే చనిపోయాడు. ఇంతమంది మనుషులున్నా, రోజుకు దురదృష్టవశాత్తు ఎంతోమంది బ్రెయిన్ డెడ్ (లేదా) మరణానికి చేరువవుతున్న నిండు జీవితం ఉన్న బాబును కాపాడుకోలేకపోయానని తీవ్రంగా బాధపడ్డారు.

 

15 రాష్ట్రాలకు 50 వేల మంది వలంటీర్లు:

ఒక మాములు వ్యక్తులకు కష్టాలు, బాధలు ఎదురైతే కృంగిపోతారు, అదే శక్తివంతులకు ఎదురైతే మరింత రాటుదేలడంతో పాటు వేరొకరికి ఈ సంఘటన ఎదురుకాకుండా చేస్తారు. ఏడేళ్ల బాబు మరణం తర్వాత ఆర్గాన్ డొనేషన్ కు నా అవసరం ఉంది అని మొదట తను ఆర్గాన్ డొనేట్ చేసి బాడీ డోనర్స్ అసోసియేషన్ ను మొదలుపెట్టారు. ఇప్పుడు అవగాహన వస్తుంది కానీ ఒక దశాబ్ధం మునుపు “మీ శరీరాన్ని దానం చేస్తారా” అని అడిగితే భయపడ్డమో, తిట్టడమో, శవాలతో వ్యాపారం చేస్తున్నారని అనుమాన పడి పంపించడమో చేస్తుండేవారు. కానీ పరిస్థితులు మారిపోతున్నాయి. అలా మార్పునకు కారణం ఐన వాళ్లలో సీతామహాలక్ష్మీ గారు ఒకరు. హాస్పిటల్స్ లో కాలేజీలలో, వివిధ సభలు సమావేశాలు పెట్టి ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారామే. ప్రస్తుతం ఈ సంస్థ 15 రాష్ట్రాలకు విస్తరించి సుమారు 50వేల మంది సభ్యులను చేర్పించగలిగారు.

 

బ్లడ్ డొనేషన్ విరివిగా చేస్తుంటారు కానీ ఆర్గాన్ డొనేషన్ కు మాత్రం ప్రజలు జంకుతారు. కారణం వారి దేహం మీద ప్రేమ కావచ్చు మరే ఇతర భయం కావచ్చు. సీతామహాలక్ష్మీ గారు చిన్నతనం నుండి లాజికల్ గా ఆలోచిస్తుంటారు. దీనికి ప్రధాన కారణం అమ్మ నాన్న తాతయ్యల జీవన ప్రయాణం. సమాజం మరింత అభివృద్ధి చెందాలంటే హేతుబద్ధంగా ఆలోచించాలని నిత్యం చెబుతుంటారు. ఆచరిస్తుంటారు కూడా.. అలా ఇప్పటివరకు ఆర్గాన్ డొనేషన్ ద్వారా ఎంతోమంది కొత్తజీవితం జీవించడానికి వారదయ్యారు. 33 మెడికల్ కాలేజీలకు వందల సంఖ్యలో పరిశోధనల కోసం శవాలను అందించడంతో పాటు, 120 శవాలతో కేడావర్ ల్యాబ్ ప్రారంభించారు. సీతామహాలక్ష్మీ గారి కృషికి గాను సేవరత్న, బెంగళూరు యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్‌ ఇంకా మరెన్నో అవార్డులు అందుకున్నారు.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: , , , , , , , , , , ,