The True Essence of Made In India Products: This Small Conversation Between 2 Friends Is Spot On

 

Contributed By Jayanth Deepala

 

ఇద్దరు స్నేహితుల మధ్య రాజకీయాల గురించి ఏదో మాట మాట వచ్చి అది వాగ్వాదానికి మారుతున్న సమయంలో

” ఏరా , నువ్వు ఏదో పెద్ద దేశాన్ని ఉద్ధరించావన్నట్టు మాట్లాడుతున్నావ్ ? నువ్వు ఏమైన పోలీసా , డాక్టరా , సైంటిస్ట్ ఆహ్ , ఐ.ఏ.ఎస్ ఆఫీసర్వా లేదా దేశానికి ప్రాణత్యాగం చేసే సైనికుడివా ? దేశభక్తి గురించి మాట్లాడుతున్నాడు పెద్ద !? ”

” ఒప్పుకుంటారా , నేను అవేమీ కాదు , వారి త్యాగాలకు , అత్యున్నత సేవలకు నా సెల్యూట్ , కానీ నా దేశభక్తి వేరే తరీఖా మామ !! ”

” అంటే ? ”

 

” నేనొక బాధ్యత గల వినియోగదారుడిని ”

” కాస్త తెలుగులో చెప్పరా !! ”

” సరే , నీకొక స్టోరీ చెప్తా వింటావా ? అందులో ఒక దేశ భక్తుడి గురించి చెప్తా ”

” సరే , కానీ ! ”

” అనగనగా , ఒక ఇరవై ఏళ్ల ముందు , ఒక డ్రైవర్ , లారీలు నడుపుకుంటూ , కష్టపడి డబ్బులు కూడపెట్టాడు , ఒక వైపు ఇద్దరు పిల్లల్ని చదివిస్తూ , ఇల్లు గడుపుతూ , ఒక ఐదు ఏళ్లలో కొంత దాచాడు “.

 

” ఓకే ”

” ఐదు ఏళ్ల తరవాత , ఒక రెండు లారీలు కొనేంత డౌన్ పేమెంట్ కుదుర్చుకొని బ్యాంక్ లోన్ కి అప్లై చేశాడు ”

” చేశాక ? ”

” ఆ బ్యాంక్ మేనేజర్ , ఒక వేరే దేశం లారీ కంపెనీతో కలిసి , ఆయన దగ్గరకి వెళ్లి , ఆయనకి ఒక డీల్ ఇచ్చారు ”

” ఏంటది ? ”

 

” మన దేశంలో ఆ లారీ కంపెనీ కొత్తగా లాంచ్ అయిందంట అప్పుడు , సో వారి లారీలు కొంటే తక్కువ వడ్డీకి లోన్ , రెండు ఏళ్లు మైంటేనన్స్ ఫ్రీ అన్నారంట ”

” ఓహ్ ”

” సరే రా మామ !! , నువ్వు ఆయన ప్లేస్లో ఉంటే ఏం చేసేవాడివి రా ? ”

” ఏముంది హాయిగా ఆ డీల్ కి ఒప్పుకొని ఆ కంపెనీ లారీలే కొనేవాడిని , డబ్బులూ సేవ్ , ఫారెన్ కంపెనీ అని గొప్పలు కూడా చెప్పుకోవచ్చు కదా ”

” కదా !!!!!!! , నీ లాంటి వాళ్ళ వల్లేరా మన దేశం ఇలా ఉంది ”

” అదేంది రా , బాగానే చెప్పాగా ఆయన కూడా అదే చేసి ఉంటాడు , టెక్నాలజీ కూడా చూడాలిగా మామ ”

” నేను నీకు ముందే చెప్పా , ఇదొక దేశ భక్తుడి కథ అని , ఆయన అలా చేయలేదు , ఆ కంపెనీ లారీలు కొనలేదు ”

” అదేంట్రా , ఆయనకు ఏమైన లూస్ ఆహ్ , అంత మంచి ఆఫర్ ఒడులుకున్నాడా ? ”

 

” పదిహేను ఏళ్ల కింద ఆయనకి ఉన్న తెలివి తేటలు త్వేంటీ త్వేంటి లో కూడా నీకు లేవురా ”

” సరే రా బాబు , ముందు ఏమైందో చెప్పు ”

” ఆయన ఒక్క పూట ఆలోచించి చెప్తా అన్నాడు. ఆ రాత్రి ఆలోచించాడు , ఆ సంస్థకి తన డబ్బులు ఇచ్చి మన ఎకొనమిని వారి దేశం ఆక్రమించకుండా , ఓ దేశీయ కంపెనీకి ఇస్తే మన దగ్గరే ఉద్యోగాలు పెరుగుతాయి , కంపెనీలు పెరుగుతాయి , ఎకొనమి పెరుగుతుంది , దేశం బాగుపడ్తడి అని ఆలోచించి , ఆ ఆఫర్ వదులుకున్నాడు ”

” తరవాత ఏం చేశాడు మామ ఆయన ? ”

” అప్పట్లో అదే టెక్నాలజీ తో ఇండియా లో ఉన్న ఒక లారీ కంపెనీ కి వెళ్లి ” మేడ్ ఇన్ ఇండియా ” లారీలు కొన్నాడంట , అది కూడా ఎక్కువ వడ్డీకే , మైంటనేన్స్ భారం కూడా తన మీదనే ”

 

” అబ్బ , గ్రేట్ కదరా ! ”

” అవును రా , మన దేశంలో మన దేశపు వస్తువు కొనడం కూడా గ్రేట్ అయిపోయింది , అందుకే ఈ ఎకొనామికల్ స్లేవరీ మొదలైంది ”

” రేయ్ , అలా కాదురా ”

” అలానే అయిపోయింది రా , కార్లు , టి.వీలు , ఏ.సిలు , ఫ్రిడ్జ్ లు , ఫోన్లు , కంపెనీలు , అన్ని అన్నీ వాళ్ళవే ”

” రేయ్ , ఆవేశపడకురా ! ”

” దేనికి పనికి వస్తదిరా నా ఆవేశం , ఆల్రెడీ ఆఫర్ల పేరిట మన ఇళ్లనీ , ఎకొనమినీ ఆక్రమించేసారు వాళ్ళు . ఉఫ్.. వాళ్ళు గెలిచారు మామ , వాళ్ళు గెలిచారు ”

” నిజమే రా ! ”

 

” ఇంతా జరిగాక , ఇది తెలిసి కూడా , బిజినెస్ ఛానెల్స్ లో కొట్టుకుంటారు మామ , మన రూపాయి వాల్యూ ఎందుకు తగ్గుతుంది అని. మనమే దేశాన్ని రోజూ చంపుతూ , మళ్లీ డిస్కషన్స్ ఎంటిరా ”

” ఏం చేద్దాం మామ మరీ ? ”

” ఏం చేయడానికి లేదురా , ఎవరి వంతు వాళ్ళు ” మేడ్ ఇన్ ఇండియా ” ప్రొడక్ట్స్ కొనడమే , దానికి మించి ఏమీ లేదు , ఉండదు కూడా .ఇప్పుడు అర్థమైందా ? , బాధ్యత గల వినియోగదారుడు అంటే ? ”

” మన దేశ అభివృద్ధికి తోడ్పడే ప్రతి రూపాయి ఖర్చు పెట్టేవాడురా , అసలైన బాధ్యత గల వినియోగదారుడు ”

” అదీ , ట్రాక్ లోకి వచ్చావ్ , నీ లాగా మన దేశం కూడా మారితే బాగుండు రా , ఎకొనామిక్ స్లేవరీ లేని దేశంగా మన దేశాన్ని ఎప్పుడు నేను చూస్తానో , ఆ రోజు రా మామ అసలైన స్వాతంత్ర దినోత్సవం ”

” అవును మామ , అదీ అసలైన ఫ్రీడమ్ ”

” ఇప్పుడు చెప్పు దీంట్లో కనిపించిందా దేశ భక్తి ”

 

” హా మామ , అణువు అణువునా ”

” మన లాంటి సామాన్య ప్రజలు తమ దేశ భక్తి ని చాటుకోవడం ఇలాగే రా , ఇంతకన్నా ఇంకేం అవసరం లేదు కూడా ”

” అవును మామ !! ”

అలా , ఆ మాటలు అయిపోయాక , సినిమాకి బయలుదేరారు ఆ స్నేహితులు.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , , ,