A Love Story Of A Writer Who Puts Himself In Suffering For Writing A Story

 

“చప్పట్ల కన్నా ఈ ప్రశాంతమైన సముద్ర అలల శబ్దం మనసుకు హాయిగా అనిపిస్తుంది.. మనషులు ఎవరైనా, వారి మనోభావాలు వేరైనా, కఠినులైన క్రూరులైన ఈ సముద్రం ఒకేలాగా ఉంటుంది అందరితో.. కానీ అక్కడ జనాలకు నచ్చితే చప్పట్లు కొడతారు, నచ్చకపోతే చెప్పులతో కొడతారు.. మారే పరిస్థుతలతో మారిపోయే అభిమానాన్నీ చూసి మురిసిపోయే రచయితని కాదు.. ప్రాణం పెట్టి పోసిన పదాన్ని ప్రేమించే పదాభిమానిని.. సరే అదంతా వదిలేయ్.. మనవాళ్ళు ఎలా చేసారు..??”

“చాలా బాగా అయింది. అందరు నీ గురించే అడుగుతున్నారు.”
“నాకు అక్కడ ఉండాలనే ఉంది. కానీ రాసింది ఎలా చేస్తారు అన్న చిన్న భయం.”

“ఇంత మంచి కథ రాసిన నువ్వు, నవ్వుతూ గెలుపును ఆనందించాలి కానీ భయపడటం ఎందుకు అర్జున్?”

ఆనందం లో కన్నా బాధ లో భయంలో మంచి కథలు పుడతాయి.

“అలా అని ఎపుడు ఇలానే ఉంటావా. కథ నిన్ను బాధ నుండి బయటకు తీసుకురావాలి కానీ కథ కోసం నువ్వు బాధలో బ్రతకకూడదు.”

“నా కథ లో ఆనందం ఇంకా రాలేదు అరవింద్.”

“ఏదో ఒక రోజు వస్తుంది అర్జున్. పున్నమి చంద్రుడి లా ఎంతో దూరం లో ఉన్న, తన కోసం ఎగసి పడే అలలా నిన్ను మార్చేస్తుంది.”

“ఎంత ఎగసిపడిన ఆ అల ఆ చంద్రుణ్ణి చేరలేదు కదా!! ఆ చంద్రుడు కూడా అన్ని రోజులు అలాగే ఉండదు కదా..”

“నీ పాదాలకి, నీ పదానికి ఒక పెద్ద నమస్కారం. రేపు కలుద్దాం.”

పదం, నన్ను నిరంతరం ముందుకు నడిపించే రథం. బాధని, కోపాన్ని, ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని జనానికి తెలియచేసే ఆయుధం. ఆ పదకౌగిలిలో, ఎగిసిపడే ఆ అలల సవ్వడిలో మునిగిపోయిన నాకు చుట్టూ ఎం జరుగుతుందో తెలియని లేదు. నా లోకం లో నేను తేలియాడుతున్న సమయం లో, పున్నమి చంద్రుని లా నా ఎదురుగా నిలపడింది తను. నవ్వుతూ, చిన్ని చిన్ని పాదాలతో ఆ అలల తో దోబూచులాడుతూ, చిన్న పిల్లలా గెంతుతూ, ప్రేమ అనే ప్రపంచానికి దూరంగా బ్రతుకుతున్న నన్ను తొలిచూపు లోనే ప్రేమలో ఎలా పడతారో నేర్పింది “మీరా”

తన చూపు, తన నవ్వు, తన మాటలు, ప్రతి ఒక్కటి కళ్ళ ముందు కదులుతున్నాయి. మళ్ళీ మళ్ళీ తన వైపే చూడాలనిపిస్తుంది. తన దగ్గరకు వెళ్లి మాట్లాడాలి అనిపిస్తుంది. కానీ దైర్యం రావట్లేదు. ఇన్ని రోజులు ఎన్నో కథలు రాసిన నేను ఇపుడు తనతో ఎలా మాట్లాడాలి అనే సమయానికి మాటలు వెతుక్కుంటున్నాను.

“అర్జున్?”

తనకి నేను తెలుసా? కానీ ఎలా? తడపడుతున్న మాటలతో తనతో మాటలు కలిపాను. క్షణాలు నిమిషాలు అయ్యాయి, నిమిషాలు గంటలు అయ్యాయి. అలా సముద్ర అలలతో కాళ్ళు తడుపుకుంటూ అలా ఒకరి గురించి ఒకరం తెలుసుకుంటూ సమయం కూడా తెలియకుండా గడుపుతున్నాం. జీవితం లో ఆనందం ఎప్పుడు ఉండదు కదా. ఎవరో తెలీదు, ఎపుడు వచ్చారో తెలీదు, చూస్తుండగానే ఏదో గట్టిగా నా తలను తాకింది. కళ్ళు మసకబారుతున్నాయి. ఎదురుగా మీరా ను ఈడ్చుకుంటూ తీసుకు వెళ్తున్నారు నలుగురు.

తను నాతో మాట్లాడిన మొదటి మాట, నేను తన నుండి వింటున్న చివరి మాట
“అర్జున్”
అపుడు తనతో మాట్లాడటానికి మాటలు తడబడ్డాయి ఇపుడు తనని చేరటానికి అడుగులు తడపడుతున్నాయి.

తనను చేరుకోవాలి, ఆ క్రూరుల నుండి రక్షించాలి.. కానీ ఎలా ? ఆ ఆలోచనలోనే అలా అలల ఒడి లో కూలబడ్డాను.

to be continued….


 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: ,