This Short Poem Explains How The Great Lord Shiva Is An Inspiration

 

Contributed by Girish Raman

శవాలన్ని కుప్పులకుప్పలు మట్టి కింద కప్పిపెట్టిన చోట
తిరుగుతుంటావూ,
పాములను మెడకు చుట్టుకుంటావు
నీకంత ధైర్యం ఏమి రా శివ !!

బుడిద ను వొంటికి రాసుకు-పూసుకు తిరుగుతావ్
రుద్రాక్ష మాలానే బంగారం కంటే ఎక్కువగా భావిస్తావ్
అంత నిష్కపటి వాడివేం రా శివ !!

నెలవంకను నెత్తిన పెట్టుకున్నావ్
పులి తోలు వొంటికి చుట్టుకున్నావ్
నీకన్ని సోకులు ఏమి రా శివ !!

తెల్లటి మంచులో మంచి ఎత్తు లో ఉంటావ్
నల్లటి చీకట్లో విహరిస్తావ్
అంత బైరాగివేం రా శివ !!

గంగను నీ జఠాజూటాలలో కట్టిపెట్టావ్
విషమును మింగి నీ గొంతులో దాచి పెట్టావ్
అమృతమూ విషమూ ఒకటారా శివ !!

నీ తాండవము ఒక ప్రళయం
లాస్యం ఒక అందం ,ఆనందం
నీకన్ని కళలు ఎందుకు రా శివ !!

ఇది బంతి కాదు భూమి రా
ఆట కాదు జీవిన మరణములు రా
నీకూ చెట్లకి మనుషులకి తేడా లేదా రా శివ !!

త్రికాల జ్ఞానం , త్రినేత్రం , త్రిసూలం
నిష్కపటం , ధైర్యం ,గొప్పతనం
అస్సలేం అర్ధం కావేమి రా గిరీశా !!

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: , , ,