This Short Poem About How A Common Man Living With A False Image Is Spot On

 

Contributed By Vasudeva Sri Vamsi
పురుగులం పేడపురుగులం
పేడని తెలిసీ కంపుని మరిచీ , బ్రతుకుని లాగే పురుగులం..

 

సత్యం తెలియక పురుగులమనుకొను మిణుగురులం …
సత్యసాధనకు విచక్షణున్నా అసత్యమే ఇక మన గమ్యం..
 

చదువబద్దం , సంపాదనబద్దం , పైకి కనబడే బ్రతుకు అబద్దం..
నువ్వు అబద్దం , నేను అబద్దం , నిజమనుమాటే నేడు అబద్దం..

 

బయటకు క్షేమం , లోపల క్షామం
ఎక్కడికక్కడ మాయప్రపంచం….
ఇస్తాచూడు , సాక్ష్యం నేడు , ఐనాకూడా నమ్మడు ఎవడు ..

 

పుస్తకముంటే మస్తకముండదు
మస్తకముంటే బ్రతుకికసాగదు..
పుస్తకాలలో ఉంటాయన్నీ , వాస్తవానికవి సూన్యం అన్నీ…

 

నిత్యం జరిగే చుట్టూ తిరిగే అవస్తవాల, అభూతకల్పన అసత్య అనిత్య జీవన పయనం…
చదువు సంధ్య , గాలి నీరు నిప్పు ఐపోయే వ్యాపారం..
చుట్టుపక్కలా నక్కల ఊళల మధ్య బ్రతకడం ఒక విన్యాసం..
ఎంత చదివిన ఎన్ని చూసిన మంచిచెడులకిక లే వ్యత్యాసం….

 

నిత్యం స్వార్ధం లోక వినాశం , నేను నాదని కొట్టుకు చస్తాం…
చుట్టూ జరిగే దాష్టికి ఘోరం , కనపడకుండా ముసుగులు వేస్తాం

 

కోరలుజాచిన పాముల మధ్యన , నమ్మించే ఈ నక్కల మధ్యన ,
మానవరూపపు మాయజాలపు మర్మపు చేష్టల చదువరుల మధ్యన .
ముసుగుల మధ్యన , మోసం మధ్యన
ఏమి తోచని మిధ్యకు మధ్యన.

 

ఇన్నిటినింకెదిరించి బ్రతకగల
ఓర్పు నేర్పు ఎక్కడిది…
అబద్దాల మధ్య ఒక అబద్దంగా
మిగిలే బ్రతుకే ఇక్కడిది

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: , , , , ,