This Conversation Between Two Friends Regarding Life During 20’s Will Definitely Inspire You!

 

బావ-1 : ఏంది బా.. అప్పుడే వచ్చేసావ్? ఈరోజు వీకెండ్ కూడా కాదు కదా !

బావ-2 : ఈరోజు అస్సలు mood బాలేదు బా ! చాలా చిరాకుగా ఉంది.

బావ-1 : ఏమైంది బా , మీ boss గాడు ఏమైనా అన్నాడా ? లేదంటే గొడవ పెట్టుకుని వచ్చావా ఎవరితోనైనా ?

బావ-2 : జీవితం లో satisfaction లేదు బావ ! రొటీన్ జీవితం . 1% కొత్తదనం కూడా లేదు బావా !

బావ-1 : ఏందీ బావ , నీది నాది ఒకే job , ఇంచుమించు ఒకే salary కూడా ! నేను బానే ఉన్నా కదా.

బావ-2 : 22 ఏళ్ళు కష్టపడి ఇంకో రెండేళ్లు ఏవో కోర్సులు నేర్చుకుని , ఇలా ఒకడికింద, పెళ్లి సంభందాలు తీసుకొచ్చే బ్రోకర్ లాంటివాళ్లు అద్భుతహః అని అనుకునే software జాబ్ చేస్తున్నాం . ఎందుకు బావ ఇంత చదువులు చదివింది ?

బావ-1 : నువ్వూ Independent short film చూసావా ఏంది అలాగే మాట్లాడుతున్నావ్ .

బావ-2 : జీవితం లో satisfaction లేని ప్రతీవాడూ ఇలాగే మాట్లాడతాడు బావ ! మొన్న Women Cricket చూశాం ., అందులో స్మృతి మంధనా age ఎంత ?

బావ-1: 20 years !

బావ-2 : Justin Bieber గాడి age ?

బావ-1 : దాదాపు అంతే .

బావ-2: P.V. Sindhu age ?

బావ-1: ఏమో బా ఒక 21 ఏస్కో ! ఐతే ఏంటి ? ఇప్పుడేమైంది ?

బావ-2: నువ్వు గమనిస్తున్నావా ? Education కాకుండా వాళ్లకి నచ్చిన routes లో వెళ్లి world wide famous అయ్యారు . మనం వీళ్ళకంటే రెండుమూడేళ్లు పెద్ద ., పైగా చేసే గొప్ప ఉద్యోగానికి పాతికవేలు salary . ఎందుకు బావా మనకి ఈ బతుకు ! ఛీ !

బావ-1: ఓహో ఇదా నీ బాధ ! ఒకటి అడుగుతా చెప్పు రా . నీ ఫేవరెట్ హీరో ఎవరు ?

బావ-2: చిరంజీవి , రజినీకాంత్ కూడా !

బావ-1: నీ ఫేవరెట్ క్రికెటర్ ?

బావ-2: ధోని !

బావ-1: నీ ఫేవరెట్ మూవీ … తెలుగు లో

బావ-2: స్వయంకృషి, భాషా !

బావ-1: మరి వీటిని బట్టి నువ్వు ఎం నేర్చుకున్నావు రా ?

బావ-2: అరేయ్ వాళ్ళు సినిమావాళ్లు , క్రికెటర్స్ రా , నేను చెప్పేది మనలాంటి ఇంజనీర్లు గురించి .

బావ-1: అరేయ్ ., అక్కడ వాళ్ళు ఎవరు అన్నది ముఖ్యం కాదు ., వాళ్ళు ఎలా success అయ్యారనేది ముఖ్యం . అంతెందుకు , India లో Metro Man గా పిలిచే Sri Dharan గారు కూడా ఇంజినీర్ ఏ గా .

బావ-2: అది పక్కన పెట్టు బావా ., ఆయన అంత సక్సెస్ అయినప్పుడు బయట పరిస్థితులు ఎలా ఉండేవో మనకి తెలీదు . So ఆయన విషయం పక్కన పెడితే , మన society లో మనకంటూ గుర్తింపు ఉండాలి బావా . అలా ఉండాలి అంటే ఏదైనా Startup ఐనా మనం పెట్టాలి లేదా మాంచి కత్తి లాంటి job ఐనా ఉండాలి . ఇంక మిగిలిన ఏ జాబ్ ఐనా waste ఏ రా . ఇది నా feeling .

బావ-1: బావా నువ్వు మరీ ఎక్కువ ఆలోచించేస్తున్నావ్ . మన society లో ఏ job కి ఐనా దాని own value ఉంది .

బావ-2 : అంటే , నువ్వు చెప్పులు కుట్టడానికీ ready ఏనా ?

బావ-1: హా ! కచ్చితం గా ! బావా ఏ జాబ్ కి ఐనా దాని own ethical values ఉంటాయి .

బావ-2: ఎందుకు రా మళ్ళీ మన B.Tech లో Ethics subject కి వెళ్తున్నావ్ !

బావ-1: ఇంకేం చదివావ్ ర నువ్వు ethics మరి ? మొత్తమంతా అందులోనే ఉంది . నిన్న కాక మొన్న మన దేశం లో సచిన్ కి భారతరత్న ఇచ్చినప్పుడు మనమందరం ఆనందపడ్డాం తప్ప , ఎవడైనా suicide చేస్కున్నాడ్రా , నాకు భారతరత్న రాలేదు , సచిన్ కి వచ్చేసింది అని ? నువ్వు చెప్పేది అంతే కామెడీ గా ఉంది .

బావ-2: నువ్వు చెప్పేది ఎదో క్లారిటీ లో ఏడవరా !

బావ-1: నీకు సులువు గా అర్థంకావాలంటే , పొద్దున్న నుంచి నువ్వు చేసిన పనులు గురించి చెప్పు .

బావ-2: ఏముంది ? పొద్దున్నే మన రాము గాడి hotel లో టిఫిన్ తెచ్చుకుంటాం , మధ్యాహ్నం శివాని లో కర్రీస్ తెచ్చుకుంటాం . సాయంత్రం రమణ బాబాయ్ దగ్గర tea తాగుతాం . అంతే కదా .

బావ-1: హా ., అదే … నువ్వు, నేను , ఈ area లో అందరూ రాము గాడి hotel కే టిఫిన్ కి ఎందుకొస్తారు ? అక్కడే టిఫిన్ super గా ఉంటది కాబట్టి ., శివాని లో కర్రీస్ కి అందరూ ఎగబడికొంటారు ఎందుకు ? అక్కడ వచ్చే taste ఇంకెక్కడా రాదు అని ., రమణ బాబాయ్ కన్నా టీ చవకగా చిక్కగా super గా ఇంకెక్కడా మన చుట్టుప్రక్కల area లో దొరకదు . ఎవడికి నచ్చిన job లో వాడే తోపు బావా . ముందు మనం అది నేర్చుకోవాలి . అంతే కానీ సింధు badminton player అని నువ్వు బాధపడకూడదు . నీ ఫీల్డ్ లో నువ్వూ తోపు వి అవుతావు ….. అదెప్పుడు అంటే నీ వర్క్ ని నువ్వు ప్రేమించినప్పుడే !

బావ-2: ……… (మాటల్లేవ్ ) . . . . . . . .

బావ-1: ఎవడి లైఫ్ వాడికి సినిమా నే బావా . Simple గా చెప్పాలంటే …….
ఎవడి సినిమా కి వాడే హీరో !!!

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , ,