This Girl’s Letter To Her Ex Boyfriend Is Honest & Mature

Contributed by Vammsi Krishnna Adusumalli

హాయ్ మధు,ఎలా ఉన్నావ్ ?నువ్వు message చేస్తే reply కూడా ఇవ్వని నేను ఇంత పెద్ద message  చేసానేంటని ఆలోచిస్తున్నావా ? నీతో ఒక విషయం చెప్పాలని message చేసాను .అది చెప్పే ముందు నేను చెప్పేవి  జాగ్రత్త గా విను .నేను నా ఫామిలీ తో చాలా హ్యాపీ గా ఉన్నాను ,నువ్వు నన్ను ఎంత ప్రేమించావో ఇప్పుడు suddenగా అర్ధం అయిందని అనుకోకు ,లాస్ట్ గా ,ఈ మెసేజ్ తర్వాత నీకు మళ్ళీ  messages  చేస్తానని expect చేయకు .

ఇపుడు నేను చెప్పాలనుకుంటున్న విషయం నిన్ను కలిసి చెప్పొచ్చు లేదా కాల్ చేసి చెప్పొచ్చు కానీ అలా చేయడం వల్ల  నా మొహం చూసినా,నా గొంతు విన్నా  నీకు ఎలా ఉంటుందో నాకు తెలుసు .అది నిన్ను బాధపెట్టడమే అవుతుంది అందుకే ఈ మెసేజ్ .చదవాలనిపిస్తే చదువు ,లేకపోతేయ్ వదిలేయ్ .

ఇప్పటివరకు చెప్పింది నువ్వు ఎలా అర్ధం చేసుకున్నా  పర్లేదు కానీ ఇప్పుడు నేను చెప్పేది మాత్రం మనస్ఫూర్తిగా అర్ధం చేసుకోవాలని ఆశిస్తున్నాను .I AM REALLY SORRY మధు . మొదట్లో నువ్వు ప్రేమిస్తున్నాను అనగానే ఓకే చెప్పేసాను .అది ప్రేమో కాదో తెలియకుండానే నిన్ను నిజంగానే ప్రేమించాను అని అనుకున్నాను .నేను నీకు కరెక్ట్ అని నువ్వు అనుకున్నా,నాకు నువ్వు కరెక్టో కాదో ఆలోచించకుండా ,ముందు ఓకే చెప్పి తర్వాత బ్రేక్ అప్ చెప్పి ఇదంతా జరగకుండా ముందే ఆలోచించి నో అని చెప్పి ఉంటె నా వల్ల నువ్వు బాధపడే వాడివి కాదు .నిన్ను ఎంత బాధపెట్టానో తెల్సు అందుకే సారీ .

మన ఇద్దరికీ సెట్ అవ్వదని తెలిసిన రోజున నీతో ఆ మాట చెప్పడానికి చాలా భయమేసింది ,దానివల్ల ఇద్దరికీ చాలా గొడవలు ,నేనేదో నిన్ను మోసం చేస్తున్నానని అనుకునే వాడివి .ఇప్పుడు అనిపిస్తుంది నా పిరికితనం ప్రశాంతత ని తీసుకెళ్లి నీకు కన్నీళ్లు మిగిల్చింది .నన్ను క్షమించు మధు .

నేను చేసినవాటికి  సారీ తో పాటు  నువ్వు చేసినవాటికి నీకో థాంక్స్ కూడా చెప్పాలి మధు .నేను థాంక్స్ చెప్పేలా నువ్వేం చేసావని ఆలోచిస్తున్నావా?చెప్తావిను ,రోజు న్యూస్పేపర్ లో చూస్తున్నాను ,న్యూస్ లో వింటున్నాను ,ప్రేమించిన అమ్మాయిని మోసం చేసిన ప్రేమికుడు ,తనని ప్రేమించలేదని కోపంతో యువతిని  హత్యచేసిన యువకుడు ,మాజీ ప్రేయసి పై యాసిడ్ దాడి ,ఇలా ఒకటి కాదు ప్రేమ పేరుతో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి ఆడపిల్లలమీద .అలాంటి ఆడపిల్లలలో ఒక బాధితురాలిగా నేను లేనందుకు సంతోషంగా ఉంది .అలాంటి సంతోషానికి కారణం నువ్వే .ప్రేమిచి మోసం చేసానని నువ్వాలోచించి ,నామీద కోపం తో నన్నేమన్నా చేసుంటే నేనిలా ఉండేదాన్ని కాదు .నా నిర్ణయానికి గౌరవమిచ్చావ్ ,అర్ధం చేసుకున్నావ్.నువ్వు బాధపడ్డావ్ కానీ నన్ను బాధపెట్టలేదు .నాకోసం ఏడ్చావ్ కానీ ,నన్నేడిపించలేదు .నాతో మాట్లాడడానికి నన్ను కలవడానికి ట్రై చేస్తుంటే కోప్పడ్డాను ,నిన్నెంత కోప్పడినా ,నన్ను ప్రేమిస్తూ ఉన్నవేకాని ,నన్నేమన్నా చేయాలనీ అనుకోలేదు . నిన్ను కాదని నేను తీసుకున్న నిర్ణయం వల్ల మాత్రమే  నేను ఈరోజు సంతోషంగా లేను ,నాకు ఎలాంటి హాని తలపెట్టకూడదు అని నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల కూడా .అందుకే మధు ఈ థాంక్స్. .

నేనొక్కదాన్నే కాదు ,నాలా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు ,తను కాదన్న వాడు తన ఆలోచనకి విలువిచ్చి అర్ధం చేసుకొని తనని తనలా  బ్రతకడానికి అవకాశమిచ్చిన ప్రతి అమ్మాయి ఒక్కసారి థాంక్స్ చెప్తే ఆ అబ్బాయికి ఇంకేం కావలి చెప్పు .థాంక్స్ అనేది చాలా చిన్నదే కావొచ్చు కానీ కనీసం అది కూడా చెప్పలేకపోతే ఎలా చెప్పు .అందుకే మధు ఆఖరిసారి మళ్ళీ  చెప్తున్నా THANKS ALOT .

                                                                                                                                           ఇట్లు 

నీ మాజీ ప్రేయసి

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: ,