అసమాన్య దర్శకుడు క్రిష్ గారి సినిమాలలోని 11 గుర్తుండిపోయే వాఖ్యాలు!

రాధాకృష్ణ జాగర్లమూడి అలియాస్ క్రిష్ అంటే తెలీని తెలుగు సినిమా అభిమాని ఉండకపోవచ్చు.మొదటి సినిమా గమ్యంతోనే తన అభిరుచి విభిన్నం, తన కథలు అసామాన్యం, తన కథనం ప్రత్యేకం అని ప్రేక్షకుల మనసులో గుర్తుండిపోయేలా ముద్ర వేసారు. ఆ తర్వాత వచ్చిన వేదం, కృష్ణం వందే జగద్గురుం చిత్రాలు కూడా ఆ ప్రయాణంలో మనం మరిచిపోలేని మజిలీలే. ఇప్పటివరకు ఆయన చేసినవి, తెలుగులో వచ్చిన సినిమాలన్నీ ఒక వైపు రేపు రాబోతున్న కంచె మరోవైపు అనటంలో ఎటువంటి సందేహం లేదు, గట్టిగా మాట్లాడితే తెలుగు సినిమా చరిత్రలోనే ప్రపంచ యుద్ధానికి సంబంధించిన మొదటి చిత్రం నిర్మించిన ఘనత క్రిష్ గారికే దక్కుతుంది. దాదాపు డెబ్బై ఏళ్ళ క్రితం జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో పోరాడిన తెలుగు వీరులు, వారి మానసిక శారీరక సంఘర్షణ, ఆ సమయం లో మన తెలుగు నేలపైన నెలకొన్న సామాజిక స్థితిగతులు, సాంఘీక కట్టుబాట్లు, ఆర్ధిక పరిస్తితులు గురించి తెలుగు తెరపై ఆవిష్కరించబోతున్న మన క్రిష్ గారి సినిమాలలోని కొన్ని గుర్తుండిపోయే వాఖ్యాలు అందిస్తున్నాం.
 
1. మనిషిని మనిషిని విడదీసే సామర్ధ్యం గల మరో ఆయుధం డబ్బు. డబ్బు చుట్టూ తిరుగుతున్న ప్రస్తుత లోకం లో ఉన్న కులాలకు ఇంకో రెండు వచ్చి చేరాయి.
 
1 copy
 
2. సత్యాలంటే మన చుట్టూ జరిగే పరిస్తితులనుండే సృష్టించబడతాయి. దీనికి మించిన సత్యం ఇంకోటి లేదు.
 
2 copy
 
3. మతం మారణహోమం చేయమని ఎప్పుడూ చెప్పదు. అలా చెప్పేది మతం కాదు మారణాయుధం. మనిషి ఎలా బతకాలో చెప్పేదే మతం అనే సూక్ష్మాన్ని అర్ధం చేసుకోలేని మూర్ఖుల గురించి.
 
3 copy
 
4. తరతరాలుగా నిరంతరంగా జరుగుతున్న శ్రమ దోపిడీని ఒక్కవాఖ్యంలో ఇంతకన్నా సులువుగా చెప్పలేమేమో !
 
4 copy
 
5. పాటతో మనిషి బతుకు బాటని మార్చాలని ప్రయత్నించటం చాలా చాలా గొప్ప విషయం. ఈ పాట ని కేవలం విన్న వారికి ఆహ్లాదం మాత్రమే కలుగుతుంది, అర్ధం చేసుకోవాలని ప్రయత్నించినవారికి ఆలోచన పెరుగుతుంది.
 
5 copy
 
6. దుఃఖం లేకపోతె దేవుడు గుర్తురాడు, మనిషిని అన్న నిజం గుర్తురాదు, అంతా నివురుకప్పిన నిప్పులా ఉంటుంది. దుఃఖం తెలీనివాడు నిజమైన సుఖాన్ని సంతోషాన్ని పొందలేడు. దుఃఖంతోనే జీవించటం మొదలవుతుంది.
 
6 copy
 
7. మనిషంటే ?
 
7 copy
 
8. కన్నవాళ్ళని మరిచిపోయి బతకటానికి ప్రస్తుతం మనం సృష్టించుకున్న కొత్త విధానం ఇది. ఎవ్వరి జీవితం వారిది అనుకుని మన పెద్దవాళ్ళు ఆ రోజే అనుకోని మనల్ని పట్టించుకోకపోయుంటే ఈ రోజు ఈ సరికొత్త సిద్ధాంతం పురుడు పోసుకునేది కాదేమో !
 
8 copy
 
9. కళలకు, కలలకు వ్యత్యాసం తెలీని వింతలోకం లోకి ప్రయాణిస్తున్న మనకోసమే అనుకుంటా ఇది. అయినా మీ పిచ్చికాని కల, కళ ఏదైతే ఏంటండి మాకు రెండు తెలీదు కదా అనుకునే నాలాంటి వాళ్ళు కూడా ఉంటారేమో !! ఉంటె మట్టుకు వారికో పే….ద్ద _/\_
 
9 copy
 
10. మనిషికి మృగానికి తేడాని ఇంతకంటే స్పష్టంగా, సహజంగా, అర్ధవంతంగా చెప్పవలసిన అవసరం లేదు.
 
10 copy
 
11. మనిషి అంతర్గత విషయం ప్రేమ. మనం ఎక్కడున్నా ప్రేమ మన గుండెల్లో ఉంటుంది. పరిస్థితుల, ప్రదేశాల, ప్రేరణల పరంగా మారేది ప్రేమ ఎప్పటికి కాదు.
 
11 copy

 
పైన రాసినవన్నీ మాటల రచయిత గొప్పతనం కాని క్రిష్ గారిది ఏముంది అని మీకు అనిపించవచ్చు కాని దర్శకుడి ఊహలు ఉన్నతంగా లేకపోతె ఇలాంటి అత్యున్నతమైన మాటలు, పాటలు రాసే అవకాశం రచయితలకు రాదు కదా. ఆ విధంగా చూస్తే వీటిని మనకు అందించిన గౌరవం క్రిష్ గారికే కదా. ఏమంటారు ?

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , ,