The Mantra At The End Of ‘Khaleja’ Has A Deep Meaning, Here’s What It Means

 

ఖలేజా, ఈ సినిమా గురించి ఇప్పటికే చాలా సార్లు మాట్లాడుకున్నాం. దైవత్వానికి త్రివిక్రమ్ గారు ఇచ్చిన నిర్వచనం ఈ సినిమా. మహేష్ బాబు ని అంతకుముందు కానీ ఆ తరువాత కానీ, ఈ సినిమాలో లా చూడలేదు. అందుకే ఈ సినిమా మనకు అంత ప్రత్యేకం. ఈ సినిమాలో చాలా మంచి సన్నివేశాలు, సంభాషణలు ఉన్నాయి.

 

అన్నిటికన్నా క్లైమాక్స్ లో రావురమేష్ అప్పుడే పుట్టిన పసిపాప చూపిస్తూ “ఇది నీ దర్శనం, ఇది నిదర్శనం” అన్న తరువాత సినిమాని ముగిస్తూ ఒక మంత్రం వస్తుంది. ఆ మంత్రం లో ఈ సినిమా అర్ధం మొత్తం దాగుంది.

 


పూర్ణమద: పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదద్యతే |

పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాతిష్యతే ||

ఓం శాంతి :శాంతి : శాంతి :

 

ప్రతి పదార్థం:
అద: – అది
పూర్ణం – అనంతం
ఇదం – ఇది
పూర్ణం – అనంతమైనది
పూర్ణాత్ – అనంతనుంచి (కంటికి కనిపించని ఈ అనంతం నుంచి)
పూర్ణం – అనంతం (గోచర ప్రపంచమంతా)
ఉదచ్యతే – ఉద్భవిస్తోంది
పూర్ణస్యపూర్ణమాదాయ – అనంతం నుంచి అనంతం తీసివేస్తే
పూర్ణ ఏవ – అనంతమే
అవతిష్యతే – మిగిలి వుంటుంది
ఓం – ఓం
శాంతి: – శాంతి

 

ఈ మంత్రం “ఈశావాస్యోపనిషత్తు” అనే ఉపనిషత్తు కి మూల మంత్రం. ఈశావాస్యోపనిషత్తు గురించి మరింత తెలుసుకోవడానికి click here.

 

భావం:
ఆ దేవుడు పరిపూర్ణుడు, ఆయనచే సృష్టింపబడిన ఈ లోకం పరిపూర్ణమయినది. కావున పూర్ణంతో ఇంకో పూర్ణాన్ని కలిపినా, వేరుచేసిన, గుణించిన, పూర్ణమే మిగులుతుంది. అలా ఈ ప్రపంచమంతా భగవంతుడి స్వరూపమే అని ఉపనిష్యత్తు లో ని ఆ శ్లోకం అర్ధం.
వేదమంత్రాలన్నీ ఓం శాంతిః అంటూ ముగుస్తాయి. మూడు సార్లు శాంతి అని ఎందుకు ముగుస్తాయంటే నిత్యజీవితములోని మూడు ఆటంకాల నుండి బయటపడటానికి. ఆ మూడు ఏమంటే
1.ఆద్యాత్మికం: శారీరక, మానసిక అనారోగ్యాలు మొదలగునవి
2.ఆదిభౌతికం: ఇతర జీవరాసులవలన, ఇతర మానవులవలన కలుగు బాధలు
3.ఆధిదైవికం: ప్రకృతి వలన అంటే వరదలు, భూకంపాలు, పిడుగులు, అగ్ని ప్రమాదాలు మొదలగునవి.

ఈ మూడు రకాలైన బాధల నుండి తప్పించుకోవడానికి మూడు సార్లు శాంతి అని పలుకుతాము.

 

శూన్యం లో ఏం లేదు అని కొందరు అనుకుంటారు. మొత్తం శూన్యం లోనే దాగుంది అని కొందరు అనుకుంటారు. ఎవరు దృక్పథం వాళ్ళది.

ఈ సినిమాలో కూడా సీతారామరాజు point of view లో తను nothing. పాలి ప్రజల point of view లో he is everything అనంతం,పరిపూర్ణుడు, దేవుడు. అలా ఆ రెండు point of views ని చాలా చక్కగా చెప్పే మంత్రం ఇది.

Khaleja

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: , , , , , , , ,