Not An Engineer Or A Doctor, This Telugu Ammayi Is ‘Miss Physique of Telangana’

 

మిగిలిన అన్ని స్పోర్ట్స్ కన్నా బాడీ బిల్డింగ్ పై కాస్త చులకన భావన ఎక్కువగానే ఉంటుంది. సినిమాలలో చూసుకుంటే సంవత్సరాల తరబడి వర్కవుట్ చేసి కండలు పెంచిన బాడీ బిల్డర్ ను సన్నగా ఉండే హీరో ఒక్క దెబ్బకే పడగొడతాడు! ఇక బయట చూసుకున్నా దాదాపుగా అంతే “నీకు బాడీ ఎదిగింది కానీ బ్రెయిన్ ఎదగలేదు రా” లాంటి మాటలు బహుశా ప్రతి ఒక్క బాడీ బిల్డర్ ఫేస్ చేసే ఉంటారు. నిజానికి బాడీ బిల్డింగ్ అనేది అత్యంత కష్టతరమైన క్రీడ!! ఆత్మను, శరీరాన్ని ఏకం చేస్తే తప్ప ఇందులో రాణించలేము. ప్రతిరోజు క్రమం తప్పకుండా వర్కౌట్లు, క్రమశిక్షణ, మంచి డైట్, వ్యక్తిగత విషయాలలో జాగ్రత్తలు పాటించడం లాంటివెన్నో పాటిస్తే తప్ప శరీరంపై కండలు రావు. ఇంతటి కష్టతరమైన స్పోర్ట్స్ లో ఒక మహిళ అది కూడా మన తెలుగమ్మాయి కీర్తి గారు ఎదుగుతుండడం నిజంగా మనందరికి గర్వకారణం. 

నాన్న సర్కిల్ ఇన్స్పెక్టర్:

ఈ తెలుగమ్మాయి కీర్తి గారు హైదరాబాద్ మూసరాంబాగ్ లో నివసిస్తున్నారు. నాన్న సునీల్ గారు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు. అమ్మ హోమ్ మేకర్, చెల్లి సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా వర్క్ చేస్తున్నారు. కీర్తి గారి ఫ్యామిలీ అంతా కూడా బాగా చదువుకున్నవారు, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ లో స్థిరపడ్డవారే ఎక్కువ. మొదట ఫిట్ నెస్ కోసం జిమ్ లో జాయిన్ అయిన కీర్తి గారికి బాడీ బిల్డింగ్ మీద ఆసక్తి పెరిగింది, దీనినే కెరీర్ గా ఎంచుకుంటే చాలా బాగుంటుందని ఆశించారు. ఐతే “బాడీ బిల్డింగ్” చెయ్యాలని ఉంది అని ఇంట్లో చెబితే ఎలా రియాక్ట్ అవుతారా అని మొదట చాలా కంగారు పడ్డారు, అనుకున్నట్టుగానే నాన్న గారు ఒప్పుకోలేదు. మహిళలకు మజిల్ రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది, మరీ ముఖ్యంగా అబ్బాయిలాంటి శరీరాకృతి వస్తే బయటివారు ఏమనుకుంటారో అన్న అనుమానాలు ఉండేవి. కీర్తి గారు నాన్నగారికి నమ్మకం కలిగించేంతవరకు ప్రాక్టీస్ మాత్రం ఆపలేదు. కొన్ని ఛాంపియన్ షిప్స్ గెలవడం, ఇంట్లో కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడం వల్ల రెట్టింపు ఉత్సాహంతో వర్కౌట్స్ కొనసాగించారు. 

మిస్ ఫిజిక్ ఆఫ్ తెలంగాణ:

దాదాపు మూడు సంవత్సరాల క్రితం కీర్తి గారు జిమ్ లో ఎక్కువ సమయం గడపడం మొదలుపెట్టారు. మన రెండు తెలుగు రాష్ట్రాలలో మహిళా బాడీ బిల్డర్స్ చాలా తక్కువ. అబ్బాయిలకు ఫిజిక్ నేచర్ ప్రకారం వారికి త్వరగానే మజిల్ బిల్డ్ అవుతుంది అమ్మాయిలు కాస్త కష్టపడాల్సి ఉంటుంది. కీర్తి గారు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఐదు గంటల వరకు జిమ్ లో గడుపుతారు. చికెన్, కూరగాయలు, ఎగ్ వైట్, సాల్మన్ ఫిష్, స్టీమ్ ఫుడ్ తీసుకుంటారు. అన్ని అనుకున్నట్టు పాటించడం మూలంగా అప్పటివరకు చులకనగా చూసిన వారికి క్రిందటి సంవత్సరం జరిగిన పోటీలలో “మిస్ ఫిజిక్ ఆఫ్ తెలంగాణ” మెడల్ ను అందుకొని “కీర్తి నాకు బాగా తెలుసు” అని మిగిలినవారితో చెప్పించుకునే స్థాయికి చేరుకున్నారు. 

బాడీ బిల్డింగ్ కు ముందు తర్వాత:

బాడీ బిల్డింగ్ కు ముందు కీర్తి గారు ఓ సాధారణ అమ్మాయిలానే ఉండేవారు. కొన్ని విషయాలకు భయపడేవారు, చేస్తున్న పని కాస్త కష్టతరంగా ఉంటే మధ్యలోనే ఆపేసేవారు, జంక్ ఫుడ్ కూడా ఎక్కువే. రెగ్యులర్ గా వర్కౌట్స్ మొదలుపెట్టిన తర్వాత, ఫుడ్ హ్యాబిట్స్ మారడం, క్రమశిక్షణ గల లైఫ్ స్టైల్, మరి ముఖ్యంగా ఫిజికల్ స్ట్రెన్త్ సైకలజికల్ స్ట్రెన్త్ పై ప్రభావం చూపించింది. ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. అప్పటి కీర్తి ఇప్పటి కీర్తి వేరు! ఫ్రీ లాన్స్ ట్రైనర్ గా పనిచేస్తూ ప్రతినెలా అవసరమయ్యే ఖర్చులను తనే సంపాదించుకుంటున్నారు. ఎంతటి కష్టమైన పని ఐన ఇప్పుడు ఒక్కసారి మొదలుపెడితే పూర్తిచేస్తున్నారు. తనకు ఇప్పుడు అసలైన జీవితం కనిపిస్తుంది.. జీవితం ఎంత అందమైనదని తెలుస్తుంది.. ఇప్పుడు తన లక్ష్యం ఒక్కటే అంతర్జాతీయ స్థాయి కాంపిటీషన్స్ లో పాల్గొనడం.


 

విమెన్ ట్రైనర్స్ రావాలి:

మన హైదరాబాద్ లో వందలాది ఫిట్నెస్ సెంటర్స్ ఉన్నాయి. అందులో దాదాపు 85% కి పైగా అబ్బాయిలే వర్కౌట్స్ చేస్తుంటారు, ఇంకా ట్రైనింగ్ ఇచ్చే వారిలో విమెన్ ట్రైనర్స్ మరీ తక్కువ. విమెన్ ట్రైనర్స్ ఎక్కువగా ఉంటే కనుక అమ్మాయిలు కూడా జిమ్ వెళ్ళడానికి ఇష్టపడుతారు, విమెన్ ట్రైనర్స్ తో అమ్మాయిలు ఫ్రీగా తమ అభిప్రాయాలను పంచుకుంటారు, సరైన వర్కౌట్స్ కూడా చేస్తారు. అన్ని రంగాలలో విమెన్ రాణిస్తున్నట్టుగానే బాడీ బిల్డింగ్ లోనూ రాణించాలి!! ఇది వారి మానసిక, శారీరక శక్తికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యంత అవసరం. 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , ,