KCR Strictly Warns That Officials May Lose Their Jobs If Potholes Are Found On Roads From June!

 

మన ముఖ్యమంత్రి కే.సి.ఆర్ గారు కొన్ని విషయాలలో ఉడుంపట్టు పట్టుకుంటారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కూడా ఇలాగే వ్యవహరించారు. తెలంగాణను సాధించేవరకు కూడా ఆ పట్టును వదలకుండా గమ్యాన్ని ముద్దాడారు. ఇప్పుడు రాష్ట్రం వచ్చేసింది పుట్టుకతోనే తెలంగాణ దేశంలోనే ధనిక రాష్ట్రం ఐనా కాని ఇంకా చాలా చాలా సమస్యలున్నాయి.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు ఒకరకమైన ఉద్యమం జరిగితే బంగారు తెలంగాణే లక్ష్యంగా ఇప్పుడు రెండో దశ ఉద్యమం కే.సి.ఆర్ గారి నాయకత్వంలో జరుగుతుంది. కొత్తరోడ్లు వేయడానికి ఇంకా గుంతలను(Potholes) పూడ్చడానికి కూడా సంవత్సరానికి ఎంతో బడ్జెట్ కేటాయిస్తున్నారు కాని పరిస్థితిలో ఏ విధమైన మార్పు లేదు. ఇదంతా చూసి చూసి ఈ విషయం మీద కే.సి.ఆర్ గారు కోపంగా ఒక డెడ్ లైన్ పెట్టేశారు.

09HYRPL01-Bad-r_HY_2847262f

 

ఒకసారి వరంగల్ కి వెళ్ళినప్పుడు అక్కడి హైవే మీద ఉన్న గుంతలు చూసి సరిచేయండి అని చెప్పారట.. కాని ఈ మధ్య వెళ్ళినప్పుడు కూడా ఆ గుంతలు అలాగే ఉండేసరికి కేవలం వరంగల్ హైవే మీద మాత్రమే కాదు తెలంగాణ అంతట కూడా నెలరోజులలో(జూన్1) రోడ్డుమీద ఏ ఒక్క గుంత కూడా కనిపించకూడదని ఒకవేళ కనిపిస్తే సస్పెండ్ చెయ్యడానికి కూడా వెనుకాడనని నిన్ననే(సోమవారం) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇందుకోసం రిటైర్డ్ అధికారుల సేవలను కూడా వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉండమన్నారు. నిజానికి గుంతలు పుడ్చండి అని ఎన్నిసార్లు చెప్పినా కాని Expect చేసినంత Results రాకపోవడంతో ఈ Decision తీసుకోవాల్సి వచ్చింది. నెల రోజుల తర్వాత తెలంగాణ అంతటా పర్యటిస్తానని కూడా ముందే హెచ్చరించారు. వచ్చేది వర్షాకాలం. వర్షాకాలంలో రోడ్డుమీద ఎన్ని ఇబ్బందులుంటాయో మనకు Special Discussion అవసరం లేదు. చూద్దాం నెలరోజులలో ఎలాంటి Results వస్తుందో.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , ,