దురద్రుష్టవసాత్తూ తన రెండు కాళ్ళు కోల్పోయినా గూగుల్ లో జాబు కొట్టి ఎందరికో స్పూర్తిగా నిలుస్తున్న నరేష్!

కరుటుర నాగ నరేష్, చిన్నతనంలోనే దురద్రుష్టవసాత్తూ తన రెండు కాళ్ళు కోల్పోయినా తన సంకల్పం తన పట్టుదల, మాత్రం కోల్పోలేదు. IIT లో చదివి ప్రస్తుతం గూగుల్ లో జాబ్ చేస్తున్నాడు. మన తెలుగు వాడైన ఈ హీరో కథని ఇప్పుడు చూద్దాం.
 
నరేష్ కథ చాలా ప్రత్యేకం: తన తల్లి దండ్రులు పెద్దగా చదువుకోలేదు. చిన్నప్పుడే ఒక ప్రమాదం వలన తన రెండు కాళ్ళు కోల్పోయినా వీల్ చైర్ లో IIT లో B. Tech చదివి ఇప్పుడు గూగుల్ లో జాబ్ చేస్తున్నాడు. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు నరేష్, దేవుడు ఎప్పుడు తనకి పరిక్షలు పెడుతుంటాడని అందుకే తను చాలా అదృష్టవంతుడిని అని నరేష్ చెప్తుంటాడు.
 
naga-naresh-karutura
 
జనవరి 11,1993 లో లారీ లో ఊరికి వెళ్తుండగ ప్రమాదం జరిగి అతని కాళ్ళకి చిన్న గాయలు అవ్వడంతో ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు ఒక బ్యాండేజ్ వేసిన వారం తరవాత మొకాళ్ళ వరకు Gangrene పాకడంతో జిల్లా ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. అప్పటికే ఆలస్యం అవ్వటంతో డాక్టర్లు తన రెండు కాళ్ళను తొలగించేసారు.
 
Naga-Naresh-Karuturi
 
అలా తను ఏ మాత్రం కుంగిపోకుండా తన స్కూలింగ్ ని తనుకు లో పూర్తి చేసి SSC లో స్కూల్ టాపర్ గా నిలిచాడు. తరవాత గౌతమి జూనియర్ కాలేజి లో ఇంటర్ పూర్తి చేసి IIT లో సీట్ సంపాదించి తన ప్రయాణం ఇంకో కొత్త లోకం లో మొదలుపెట్టి మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏది లేదని నిరూపించడు. అక్కడ తన కోసం లిఫ్ట్ పెట్టించి ఒక ఎలక్ట్రానిక్ వీల్ చైర్ ని బహుమతి గా ఇచ్చి తాను చదివిన నాలుగు సంవత్సరాలు ఎక్కడా లోటు రానివ్వకుండా చూసుకున్నారని నరేష్ చెప్పడు.
 
naga-naresh-karuturi-wings-dr.sijuvijayan-ayushmithra-300x172
 
మన ప్రపంచం లో చెడ్డవాళ్ళకంటే మంచివారే ఎక్కువ ఉన్నారు, మన చుట్టూ ఉండేవాళ్ళు ఎప్పుడూ మనకి సాయం చేస్తూనే ఉంటారు. మన మీద నమ్మకం ఉంచి ముందుకు సాగితే మనకు ఎటువంటి ఆటంకం ఎదురు వచ్చినా మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని ముందుకు తీసుకు వెళ్తూనే ఉంటారు. ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోకు అని నరేష్ తన జీవితం ద్వారా నేర్పించాడు.
 
తన విజయం లో కీలక పాత్ర పొషించిన నరేష్ తల్లి తండ్రులకు తన అక్కకి మా వందనాలు, తను ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని మరెందరికో స్పూర్తిగా నిలవాలని ఛాయి బిస్కెట్ కొరుకుంటుంది.
 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , ,