A Peek Into The Life And Times Of The Multi-Faceted Kaloji Narayana Rao!

 

5

 

కాళోజి, తెలుగు సాహితీ ఘనచరిత్రకు అతనొక సాక్షి, అతనొక సమీధ, ఆయన పలికించినటువంటి భావసాహిత్యం చాల తక్కువ మందే పలికించగలరు ఆ స్థాయికి చేరుకొనగలరు.. అంతటి ప్రజ్ఞా పాటవాలు కలగలసిన మహా కవి మన తెలుగువాడు అవ్వడం మనందరికి గర్వకారణం.. సాహిత్యంలో ఆయన సేవలకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం “పద్మవిభుషన్” తో ప్రజలందరి తరుపున సత్కరించింది.. ఇదంతా బాగానే ఉంది ఆయన ఘన చరిత్ర మనకు తెలుసు కాని కాళోజి గారి జీవితం ఎలా ఉండేది ? ఆయన ఎలా జీవితం గడిపారు అన్నది కొంత వరకు తెలుసుకుందాం..

 

6

 

చిన్నప్పుడు కాళోజి ఒక వ్యక్తినుండి చదువు నేర్చుకున్నాడు.. ఆ వ్యక్తి ఒకనాడు తనకు గురు దక్షిణ కావాలని అడిగితె దానికి మీరేం అడిగినా తీరుస్తాను అని బదులిచ్చాడు అందుకు ఆ గురువు తన మేన కోడలిని పెళ్ళి చేసుకోవాలని కోరాడు. మొదట కాళోజి ఆలోచనలో పడ్డాడు.. తనకు పైస సంపాదన లేదు.. నేను ఇంకా పెళ్ళి చేసుకొని వచ్చె భార్యను పిల్లలను ఎలా పోషించగలను అని మధన పడుతున్న తరునంలో తన అన్న రామేశ్వర్ ఎప్పటిలానే ఇప్పుడు ఆర్ధిక సాయం చేస్తానని ప్రోత్సహించడంతో పెళ్ళికి అంగీకరించాడు..

 

4

 

పెళ్ళినాటికి కాళోజి వయసు 26 తన భార్య రుక్మిణికి 13. రుక్మిణి కేవలం 4వ తరగతి వరకే చదువుకుంది, పెళ్ళైన తర్వాత చెవి మెళిపెట్టి మరి రుక్మిణికి చదువు నేర్పించెవారు.. తన భార్య చేసిన వంటలంటే కాళోజికి అమితమైన ఇష్టం.. తెలంగాణ రజకార్ల ఉద్యమంలో జైలులో ఉన్నప్పుడు కేవలంలో రుక్మిణి ఇంటినుండి పంపిన భోజనాన్ని మాత్రమే తీసుకునేవారు. వారిద్ధరి ప్రేమకు ప్రతిరూపంగా కొడుకు కలిగాడు. భార్య మీద ఎంత ప్రేమ ఉన్నా కూడా అది తనపై చూపించెవారు కాదు. భార్యకు జ్వరమొచ్చినా, తన కొడుక్కి జ్వరమొచ్చినా కూడా వారిని డైరెక్ట్ గా అడగకుండా ప్రతి అరగంటకు ఒకసారి తన మనవడిని పిలిచి వారి యోగక్షేమాలను తెలుసుకునేవారు. కాళోజి ప్రేమను అంతా మనసులోనే అవిభాజ్యమైన ఆత్మానందంతో అనుభవించేవారు..

 

3

 

కాళోజి ఘనచరిత్ర, ప్రజ్ఞపాటవాలు వారి కుటుంబ సభ్యులకు అంతగా తెలియదు. ఒకవేళ తన గురుంచి నిత్యం చెప్పుకునేదుంటే బహుశా తెలిసేదేమో కాని అలా ఎప్పుడు చేయలేదు.. ఒకదానికి అనవసరంగా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే మిగితా వాటిని విస్మరిస్తారు ఈ రకంగానే తాగుడికి, ఇతర అలవాట్లకు బానిసై లక్ష్యానికి, కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకుంటారు అని కాళోజి వ్యసనాలకు దూరంగా ఉండేవారు. సాధారణంగా స్వచ్ఛమైన తెలుగులో పాండిత్యం ఉన్నవారు వాటిమీద సుధీర్ఘంగా రచనలు చేసినవారికి ఇంగ్లీష్ మీద పట్టు అంతగా ఉండదు కాని కాళోజి ఇంగ్లీష్ లో మాట్లాడటం మొదలుపెడితే ఇతనికి తెలుగు ప్రముఖ రచయితలలో ఈయన కుడా ఒకరా అని అనుకునేంత అద్భుతంగా ఇంగ్లీష్ మట్లాడగలరు..

 

1

 

పెళ్ళైనా కూడా నెలల తరబడి తనకు నచ్చిన ప్రదేశాలలో గడిపేవారు. స్వతహాగా కాళోజికి వేసవికాలం ఎండలు అంటే అస్సలు నచ్చేది కాదు. చల్లదనం కోసం ఇంటిచుట్టు తడి బట్టలను ఆరేసెవారు.. చాల సార్లు ఇదే పద్దతి వల్ల కాళోజి గారిది ఈ ఇల్లే అని తెలుసుకోవడానికి ఒక గుర్తుగా ఉపయోగించుకునేవారు. తాను ఒకసారి నిజమని భావిస్తే భార్య, అన్న, కన్నతల్లి, మిగితా బందువులు కూడా ఎదురు చెప్పేవారు కాదు కాళోజి మాటను శాసనంగా భావించెవారు. గుర్రం జాషువా, ధాశరధి, భారత మాజీ ప్రధాని పి.వి. నరసింహరావు వంటి వారితో ఆయనకు మంచి స్నేహం ఉండేది..

 

కాళోజి మరణం తర్వాత తన ఇంటిని ఒకసారి దర్శించుకుంటే.. కాళోజి ఫోటోలతో ఇంటినిండా తన జ్ఞాపకాలతో నిండిపోయింది. ఎప్పుడు తన సాహితి ప్రపంచంలోనే జీవించెవారు. చాల సంవత్సరాల తర్వాత స్నేహితులు, బంధువులు కలిసినా వారితో చాల తక్కువ మాట్లాడెవారు కాని ఆ తక్కువలోనే వారిపై కాళోజికి ఉన్న ప్రేమ సులువుగా అర్ధమయ్యేల తన మాటలుండేవి.. వారి కుటుంబ సభ్యుల దృష్టిలో కాళోజి చనిపోలేదు.. కేవలం ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపొయారు .. ఇప్పటికి ఎక్కడో ఆనందంగా ఉన్నారని వారి నమ్మకం.

 

2

నేనంటే తిరుగుబాటు దారు
నా గొడవ మన తిరుగుబాటు – కాళోజి

 

Source:

Mana Kaloji – Documentary Film – Full from Amarnath Sandipamu on Vimeo.

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: ,