This Poem On How We All Feel During The Last Days Of College Life Will Hit You Right In Feels!

 

ఒక్క కొత్త జీవితం లోకి అడుగు పెట్టిన ఆరోజు ఇంకా గుర్తుంది. ఏదో సాధించాలి అనే ఆశ, కొత్తగా ఏదో చెయ్యాలి అనే తపన, అందరు కొత్తగా ఉన్నారు అనే ఆలోచన, ఏం జరుగుతున్నదో తెలియని అయోమయం. అలా ఆ అనుమానాలు, ఆశయాలు మధ్యలో తెలీకుండానే నాలుగు ఏళ్ళు గడిచిపోయాయి. కాలేజీ లైఫ్ ఎన్నో మరుపురాని, మరిచిపోలేని మధురానుభూతులు సమ్మేళనం. ఇపుడు అది అయిపోతుంది అనే ఒక భయం. ఎంతగానో దగ్గరైన మనుషులకి దూరం అవుతున్నాం అనే బాధ. ఇంతకముందు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి అంటే తెలియని ఆనందం ఉండేది అందరి కళ్ళల్లో. కానీ ఇపుడు మాత్రం కన్నీరు మాత్రమే ఉంది. ఎన్ని గొడవలు ఉన్న, చివరికి అందరికి గుర్తున్నవి క్లాస్ లో చేసిన అల్లరి పనులే, ఎన్ని సార్లు తిట్టుకున్నా చివరికి గుర్తొస్తున్నవి చిరునవ్వులే, ఎన్ని మనస్పర్థలు ఉన్నా చివరికి మా మనుసులను కలచివేస్తుంది మరలా కలుస్తామో లేదో అన్న ఆలోచన మాత్రమే.క్షణం యుగంలా గడుస్తుంది అంటారు, కానీ మాకు ఈ నాలుగేళ్లు ఒక్క క్షణం లో గడిచిపోయినట్టు అనిపిస్తుంది. ఒక్కసరి ఆ అందమైన క్షణాలు మళ్ళీ కలిసి తిరగలి అని ఉంది. ఇపుడు ఈ క్షణం ఇలాగే ఆగిపోవాలి అని ఉంది.

కాలమా కాలమా ఆగిపోవమ్మా
ఈ క్షణం ఈ జీవితం
ఇక సాగబోదమ్మా..
కొన్నాళ్లే పరిచయం
ఒకరిపై ఆ నమ్మకం
కలగటమే ఈ స్నేహం
దగ్గరవుతున్న ఈ తరుణం
మళ్ళీ అయినాం దూరం

కాలమా కాలమా ఆగిపోవమ్మా
ఈ క్షణం ఈ అక్షరం
మన బంధానికి నిదర్శనం

ఓ అక్షరమా నీకు నమస్కారం
ఆగిపోతుందా ఈ కాలం ఒక క్షణం??

నాది కానీ ఈ ప్రపంచం
ఎవరో తెలియని ఈ జనం
మాట్లాడాలంటే భయం
అంతా అయోమయం
అనుకున్నా నేను అడుగుపెట్టిన ఆ క్షణం

చూస్తూ చూస్తూ కలిసిపోయాం
మనం అందరం
ఆటపాటలు, పగటి నిద్రలు,
కొత్త సాధువులు, సరికొత్త పేరులు
కనులు మూసి తెరిచేలోగా అస్తమించెనే ఈ యుగం
తెలియకుండానే ముగిసింది ఈ సెకం

ఓ అక్షరమా నీకు నమస్కారం
మరలా మొదలైందా అయోమయం??

MAY WE MEET AGAIN!!

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: , , , , , ,