Know About Kahaniya; The App Where Writers Can Sell Their Stories

 

నేను ఒక రచయితను, మనుషులను భూమిగా చేసుకుని కలాన్ని నాగలిగా మార్చి పాఠకుల మదిలో ఆలోచనలను పుట్టిస్తాను.. నేను రైటర్ ని కాబట్టి ఒక 50కేజీల బియ్యం, రెండు కిలోల కందిపప్పు, ఓ ఐదు కేజీల సన్ ఫ్లవర్ ఆయిల్, 500గ్రాముల చింతపండు, అబ్బా ఎదో మర్చిపోయానే.. అ!! ఒక కేజీ టాటా ఉప్పు ప్యాకెట్టు పట్టుకు రావయ్యా!!

 

ఇలా ఒక రైటర్ కిరాణా కొట్టుకు వెళ్లి అడిగితే ఎలా ఉంటుంది.? నువ్వు రైటర్ వి ఐతే నేనెందుకు ఫ్రీ గా ఇవ్వాలిరా హవులే!! అని పిచ్చోడిని చూసినట్టు చూస్తారు. పోనీ రచయిత దగ్గర డబ్బులు లేవా అంటే అసలు ఎలా ఉంటాయి?? పుస్తకాలు అని, రీసెర్చ్ అని, అదీకాక ఒక బుక్ ను పబ్లిష్ చెయ్యాలని పబ్లిషర్స్ దగ్గరికి వెళ్లి అడిగితే “మేము పబ్లిష్ చేస్తాము, కానీ 100 పుస్తకాలు మీరు ముందే కొనాల్సి ఉంటుంది” అని ఒక గుదిబండ కండీషన్!! రైటర్ ఫుల్ టైమ్ జాబ్ చేసుకుంటూ పార్ట్ టైమ్ లో రాసుకోవాలే తప్ప ఒకరి సహాయం లేకుండా ఫుల్ టైం రచయితగా కొనసాగడం చాలా కష్టం. రచయిత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య “పారితోషకం”. పోనీ పారితోషకం సమస్య తర్వాత సంగతి గుర్తింపు వస్తుందా అంటే అది కూడా అది కష్టమే. “పండిన పంటను మార్కెటింగ్ చేసుకోలేక రైతు పడే కష్టం లాంటిదే రచయిత రచనను మార్కెటింగ్ చేసుకోవడం”.. ఇలాంటి ఎందరో రచయితల పారితోషికం, గుర్తింపు, అవకాశాల సమస్యలను కహానియా ప్రస్తుతం తీర్చగలుగుతుంది!!


 

కహానియా 2016లో జ్ఞానపీట్ పురస్కార గ్రహీత సి. నారాయణరెడ్డి గారిచే స్థాపించబడిన ఒక స్టార్టప్!! మన దగ్గర విషయం ఉంటే చాలు కహానియా మిగిలిన పనులు అదే చూసుకుంటుంది. రచయితలకు అన్ని రకాల కథలను రాసుకునే స్వేచ్ఛ ఎలా ఉందో వాటి ధర నిర్ణయించే అధికారం కూడా ఇక్కడ కలదు. ఐతే మొదటి రచన నుండే ఇది సిద్దించదు, రచయిత శక్తి, రచనలోని క్వాలిటీని బట్టి మూడు నాలుగు రచనల తర్వాత రైటర్ నేరుగా కథ, నవలను అమ్ముకోవచ్చు.


 

పల్లవ్ కహానియా సృష్టికర్త.. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగి అమెరికాలో హయ్యర్ స్టడీస్ పూర్తిచేసి కొంతకాలానికి కహానియా మొదలుపెట్టారు. ఇది ఒక్కరికి ఉపయోగపడే సంస్థ కాదు, రచయిత కెరీర్ కు, మంచి కథల కోసం ఎదురుచూస్తున్న సమాజానికి, సినిమా ఇండస్ట్రీకి కహానియా ఎంతో మేలుచేస్తుంది. కహానియా లో పబ్లిష్ అయ్యి అత్యంత ప్రజాదరణ పొందిన కథను ప్రస్తుతం సినిమాగా తీశారు, కొద్దిరోజుల్లోనే రిలీజ్ కాబోతోంది(స్టోరీ రివీల్ కాకూడదని కథ పేరు, రచయిత పేరు చెప్పడం లేదు), అలాగే ఒక వెబ్ సిరీస్ కూడా ప్రారంభం కాబోతోంది.

 

ఓరోజు పల్లవ్ కు పెద్ద రచయితను కలిసే అవకాశం లభించింది. “ఇప్పుడు ఎవరు చదువుతారు బాబు పుస్తకాలను, నేను రాయడం మానేసి ఇప్పటికి 20 సంవత్సరాలు కావస్తోంది, నాకు రాసేంత శక్తి ఉన్నా చదివి అర్ధం చేసుకునే పాఠకులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారయ్యా!! నేను రాసేది ఒకటయితే వాళ్ళు అర్ధం చేసుకునేది మరొకటి, మిడి మిడి జ్ఞానం, అర్ధం చేసుకునే ఆలోచనలు లేకపోవడం ఇవన్నీ పెరిగిపోయాయి ఇప్పుడు నేనెందుకు రాయాలయ్యా..” అని ఆ పెద్ద రచయిత అంటే మరోవైపు పాఠకులు మాత్రం 20, 30, 50 సంవత్సరాల క్రితం రాసిన కథలను మాత్రమే చదువుతున్నారు అదేమిటంటే ఇప్పుడు వచ్చే రైటర్స్ అందరిలోనూ మ్యాటర్ ఉండడం లేదండి” అనే మాటలు వినిపించాయి.


 

కానీ పల్లవ్ రీసెర్చ్ లో తేలిందేమిటంటే ప్రకృతి ప్రతి కాలంలో మాహానుభావులను తయారుచేస్తునట్టుగానే గొప్ప రచయితలను కూడా తయారుచేస్తూ వస్తుంది. ఇక్కడ లోపం సరైన ప్లాట్ ఫార్మ్ లేకపోవడమే!! నిజాయితీ కలిగిన వేదిక ఏర్పాటు చేస్తే కనుక రచయితలు బయటకు వస్తారు, రచనలు పుట్టుకువస్తాయి, ముఖ్యంగా రైటర్ బ్రతకాలి పనికి తగిన గుర్తింపు, పారితోషకం ఖచ్చితంగా ఉండాలనే పల్లవ్ సంకల్పం.. ఈ ప్రయాణంలో తాను ఎదుగుతూ ఎందరినో వృద్ధి లోకి తీసుకువచ్చే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. 

For Additional Information: https://kahaniya.com
kahaniya App: https://play.google.com/store/apps/details?id=com.viven.android.kahaniyaofficial

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , ,