Presenting “Kaalam Cheppina Katha – Episode 5” Varanasi Anaadhalu!

 

బబ్లూ:
అమ్మ, పడుకున్నవా…అమ్మా!!!!
అమ్మ:
ఏంట్రా ఎందుకు అరుస్తున్నావు,ఏంటో చెప్పు
బబ్లూ:
అమ్మ నిద్ర రావట్లేదు ఏదన్న కథ చెప్పు
అమ్మ:
ఎలాంటి కథ
బబ్లూ:
ఏదైనా ఒక కథ
అమ్మ:
సమాజమే ఛీ కొట్టిన 5 మంది మిత్రుల కథ చెప్పన??
బబ్లూ:
హా
వారణాసికి దగ్గరలోని హోలపురి అనే గ్రామంలో శర్మ గారి ఇంట్లో
మూర్తి(శర్మ స్నేహితుడు):
శర్మ నాన్న గారు మరణించి ఇప్పటికీ చాల సమయం అయ్యింది…రావాల్సిన వాళ్ళు అందరు వచ్చేసారు…ఇక దహన సంస్కరణ కార్యక్రమాలు మొదల పెట్టన
గుండెల నిండా భాదతో కళ్ళలో సముద్రాన్ని నింపుకున్న శర్మ, తండ్రి మరణం నుంచి ఇంకా తేరుకోలేదు.తన చేతులు పట్టుకొని బుడి బుడి అడుగులు వేయించిన తండ్రి జ్ఞాపకాలు ఇంకా తన కళ్ళ ముందు మెదుగుతూనే ఉన్నాయి.కటిక పేదరికం లో వున్నా తండ్రి మాటలనే స్పూర్తిగా తీసుకొని జీవనాన్ని ముందుగు సాగించాడు.తండ్రి నవ్వు ముందు తన కష్టం చాల చిన్న బోయేది.ఒక్క సారిగా ఇక నా తండ్రి లేరు అనే చేదు వార్త తెల్సుకున్న శర్మ, భార్య పిల్లలు ఉన్నా అనాధ అయ్యాడు.మూగబోయిన గొంతుతో కళ్ళను తుడుచుకుంటూ ఇక తండ్రి లేడనే నిజాన్ని గ్రహిన్చీ దీనంగా మూర్తి వైపు చూసాడు..
మూర్తి(శర్మ స్నేహితుడు):
శర్మ, ప్రతి మనిషి పుట్టాక కాలం చేయక తప్పదు,పోయినవారి కోసం కదిలే కాలం ఆగదు.నాన్న గారికి దహన సంస్కరణ కార్యక్రమం మొదలు పెడదాం…ఇప్పటికే చాల ఆలస్యం అయ్యింది

శర్మ:
ఇప్పుడే వద్దు మూర్తి
మూర్తి(శర్మ స్నేహితుడు):
ఇంకా ఎవరైనా రావలసింది వుందా??
శర్మ:
లేదు అందరు వచ్చారు
మూర్తి(శర్మ స్నేహితుడు):
మరి ఎందుకు వద్దన్టున్నావ్.
శర్మ:
చిన్నపట్నుంచి నన్ను ఎంతో ప్రేమగా పెంచారు నాన్న..బాగా చదివించాలని చాల ఆశ పడ్డారు..కాని మా తల రాత ఆ ఈశ్వరుడు ఇలా రాశాడు…ఎన్ని కష్టాల్లో వున్నా నేను అడిగింది ఎన్నడు కాదనలేదు..నేను పెద్ద వాడిని అయ్యాను కాని గొప్ప వాడిని కాలేక పోయా..పుత్రుడు అంటే పున్నమ నరకము నుంచి రక్షించువాదంటారు..కాని నా చేత కాని తనం వల్ల బ్రతికినంతకాలము నరకము చూస్తూనే వున్నారు..కాలం చేసిన తర్వాత అయిన నాన్న గారి ఆత్మ శాంతంగా వుండాలి..అందుకే దహన సంస్కరణలు వారణాసి లో చేద్దాం అనుకుంటున్నా
మూర్తి(శర్మ స్నేహితుడు):
వారణాసా??? మరి అంత డబ్బు??
శర్మ:
దైవ సన్నిధిలో దహనం చేస్తే ఆత్మా శాంతంగా నా మనస్సు ప్రశాంతంగా వుంటుంది..ఇక డబ్బు అంటావా ఆ ఈశ్వరుడే గతి…ఈ రోజే వారణాసి కి తీస్కెళ్ళి అన్ని కార్యక్రమాలు చేయిద్దాం..
వారణాసి లోని క్రునాల్ ఇంట్లో..
గ్యాన్(క్రునాల్ తమ్ముడు):
అన్న ఈ సంవత్సరం అన్న మనం బడికి వెళ్తామా?
క్రునాల్:
ఇది వరకు డబ్బు కోసం చదువుకోవాలి..కాని ఇప్పుడు చదువు కోసం డబ్బులు కావాలి..మన నాన్న అంటరాని వాడని మనకి పనికూడా ఎవ్వరూ ఇవ్వట్లేదు…

గ్యాన్:
అమ్మ నాన్నే బ్రతుకుంటే మనం కూడా అందరి లాగే హాయిగా చదువుకునే వాళ్ళం కదా అన్న
క్రునాల్:
హాయి అనే మాటకి మనకి, దేవుడికి భక్తుడికి ఉన్నంత దూరం వుంది.అమ్మ ఉన్నత కులం లో పుట్టింది నాన్నేమో అంటరాని వాడు, మనుషులకు కులాలు వర్గాలు కాని ప్రేమకు కాదు కదా..పెళ్లి చేసుకొని ప్రేమని గెలిపించారు కాని ఊర్లో వాళ్ళంతా అమ్మని అనరాని మాటలు అంటూనే వుండేవారు..అమ్మ చాల సంవత్సరాళ్ళు ఓర్చుకుంది కాని ఒక రోజు మాటలు హద్దులు దాటాయి అమ్మ అవమానం భరించలేక ఆత్మ హత్య చేస్కుంది…అమ్మ చావుకి నాన్నని పెళ్లి చేస్కోవడమే కారణం అని అమ్మ బంధువులు నాన్నని చంపేశారు..పై కులస్తులు కదా అడిగేవారు లేరు…..చివరికి ఇలా నువ్వు నేను మాత్రమే మిగిలాము.
గ్యాన్:
ఆదరించే అమ్మ నాన్నే లేనప్పుడు ఆరాధించే దేవుడు ఉండి ఎం ప్రయోజనం కాని ఆఖలేస్తుంది ఎమన్నా తిందామా?
క్రునాల్:
దాచుకున్న డబ్బంతా తిండికే కర్చు చేస్తే ఇక మనం ఈ ఏడాది కూడా చదువుకోలేము
గ్యాన్:
తెలుసు అన్న కాని నిన్న రాత్రి గంజి తాగి పడుకుందే మల్లి ఇంత వరకు మంచి నీళ్ళు తప్ప ఏమి ముట్టలేదు…కళ్ళు తిరుగుతున్నాయి..ఇప్పటికే సూర్యుడు నడి నెత్తిన వున్నాడు ఇక ఈ రోజు మనకి డబ్బులు వస్తాయన్న నమ్మకం కూడ లేదు…రోజు 9 కే గిరాకి తీస్కోచే వాహిద్(క్రునాల్ స్నేహితుడు) అన్న ఇంత వరకు రాలేదు ఇంకా వస్తాడన్న నమ్మకం కూడా లేదు…అందుకే నిన్నటి డబ్బుతో ఒక్క బన్ను కొనుకుంట..ఆ ఈశ్వరుడి మీద వట్టు మల్లి రాత్రి గంజి వరకు ఎమీ అడగను.
తమ్ముడి ఆఖలి తీర్చలేకపోతున్న అనే భాదతో క్రునాల్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి..తమ్ముడి వైపు చూస్తూ అటిక మీధున్న సంచిలో నుంచి ఒక రెండు రూపాయల బిళ్ళ తీసి ఇచ్చాడు.ఇంతలో వాహిద్ క్రునాల్ క్రునాల్ అంటూ అరిచాడు.వాహిద్ గొంతు వినగానే గ్యాన్ కి పోయిన ప్రాణం తిరిగి వచినట్లయ్యింది..
గ్యాన్:
అన్నా!!!వాహిద్ అన్న వచ్చాడు..ఇదిగో రెండు రూపాయలు..
క్రునాల్:
ఏంటి…ఆఖలి అన్నావ్…బన్ను కావాలి అన్నావ్..వద్దా??

గ్యాన్:
వాహిద్ అన్న వచ్చాడు కదా ఆఖలి పోయింది.ఇదిగో ముందే చెప్తున్నా ఈ రోజు డబ్బుతో నాకు రాత్రి రెండు బన్నులు కొన్నివాలీ..సరేనా
క్రునాల్:
నవ్వుతూ…సరే!!
వాహిద్:
ఏంటి ఇద్దరు నవ్వుకుంటున్నారు..నాకు తెలీకుండా వేరే ఎవర్తోనో బేరం కుదుర్చుకున్నార ఏంటి ఇద్దరు??
క్రునాల్:
నిన్ను కాదని ఎవరి దెగ్గరికి వెళ్తాం చెప్పు…తమ్ముడు ఆఖలి అంటుంటే చదువుకోసం దాచుకుంటున్న దాంట్లో నుంచి రెండు రూపాయల బిళ్ళ ఇఛ..నిన్ను చూసి వాడు అది వెన్నకి ఇచ్చేసాడు.
వాహిద్:
వాడు ఆఖలి అంటుంటే రెండు రూపాయలకు కూడా అంతో అలోచించి ఇవ్వాళా..ఆ రెండు రూపాయలతో ఇప్పుడు మీరిద్దరూ చదివి సర్కారి ఉద్యోగులు అవుతార ఏంటి??
క్రునాల్:
ఎంత పెద్ద నది అయిన ఒక్క వర్షపు చుక్కతోనే మొదలు అవుతుంది
వాహిద్:
మొదలు పెట్టావా నీ సోది..గ్యాన్ నువ్వు మీ అన్న ని ఇక అడగకు..సాయంత్రం నీకు ఏది కావాలంటే అది నేను కొనిస్త…అది సరే గాని పదండి వెళ్దాం ఇప్పుడే అమిత్ కబురు చేసాడు ఏదో గిరాకి వచ్చేలా ఉందంట..త్వరగా ఘాట్ దెగ్గరికి వెళ్దాం…
క్రునాల్:
హా…పద.
మూర్తి(శర్మ స్నేహితుడు):
వారణాసికి అయితే వచ్చాం ఇప్పుడు మనకి ఇక్కడ ఎవరు సహాయం చేస్తారు
శర్మ:
అంతా ఆ ఈశ్వరుడే చూస్కుంటాడు.మనం అయితే ముందు మణికర్ణిక ఘాట్ దెగ్గరికి వెళ్దాం దహన సంస్కరణలన్నీ అక్కడే జరుగుతాయి..
మూర్తి:
పద వెల్దం..చేసేది ఏముంది..చెప్తే వినవు కదా…
మణికర్ణిక ఘాట్ వద్ద
శర్మ:
అయ్యా…మా నాన్న గారు ఈ రోజు తెల్ల వారు జామున మరణించారు..దహన సంస్కరణలు చేయాలి..మాకు ఇక్కడ ఏమి తెలిదు కొంచెం సహాయం చేస్తారా
నీలేష్(ఘాట్ వద్ద బ్రోకరు):
అయ్యో కచ్చితంగా…చుస్తే చాల మంచి వాళ్ళల వున్నారు..నా దెగ్గరికి వచ్చారు కాబట్టి సరిపోయింది వేరే ఎవరి దేగ్గరికన్నా వెళ్లుంటే అది ఇది అని మోసం చేసేవాళ్ళు..ఇంతకి మీ కులం ఏంటి??

శర్మ(ఆశ్చర్యంతో):
కులమా??కులం తో ఎం పని??
నీలేష్:
కులం ని బట్టే ఇక్కడ రేటు..బ్రామ్హనుడయితే ఒక రేటు కాపు అయితే ఒక రేటు ధలితుడైతే ఇంకో రేటు..కింద కులం వాడివైన డబ్బుంటే మరో రేటు..
శర్మ:
మరణించాక కూడా ఇంకా కులం ఏంటయ్యా
నీలేష్:
కులం దేహం కి కాదు…దేహాన్ని మోసుకోచిన్న వారిది..
మూర్తి:
కులం ముసుగులో మనిషికి శవం కి తేడా లేదులే..మేము బ్రామ్హనులం…
నీలేష్:
అయితే 15000 రూపాయలు ఇవ్వండి…అన్ని కార్యక్రమాలు అద్బుతంగా చేయించి ఆత్మ ని స్వర్గానికి పంపే పూచి నాది..
శర్మ:
15000ఆ???నేను అంత ఇచ్చుకోలేను…ఒక 4000 కి సర్దుకుంటారా?
నీలేష్:
ఏంటి 4000ఆ? ఏమి మీ నాన్న గారి ఆత్మ స్వర్గానికి వెళ్ళాలని లేదా?? నువ్వేమి కొడుకువయ్య??సరే 12౦౦౦ ఇవ్వు చివరి మాట
శర్మ:
4000 కి ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వలేను..
నీలేష్:
భలే బేరం తగిలింది..వెళ్ళు వెళ్ళవయ్య…ఈ రోజు మీ నాన్న కి ఇక సంస్కరణలు అయినట్లే…
(ఈ సంబాషణ అంత వెనకి నుండి వింటున్న అమిత్, నీలేష్ వెళ్ళిపోగానే..)
అమిత్:
అయ్యా నమస్కారం..నా పేరు అమిత్..మీరు ఇందాక అతినితో మాట్లాడినది అంత విన్నాను..మీ నాన్న గారి సంస్కరనాలు నేను చేయిస్తా..ఆ 4000 నాకు ఇవ్వండి..
శర్మ:
చిన్న పిల్లాడిలా వున్నావు నువ్వేల చేయిస్తావు..
అమిత్:
అయ్యా నన్ను నమ్మండి…శవాన్ని కూడా వదలని కిచకులు వీళ్ళు..ఎంతో మంది మీ లాగే డబ్బు లేని వాళ్ళకి మేమే దహన సంస్కరనాలు చేయించాం..మా స్నేహితులకు కబురు పంపాను..వస్తుంటారు..అన్ని దెగ్గరుందడి మేమే చేయిస్తాం..
శర్మ:
సరే..ఎందుకో నీ మాటలు నమ్మాలనిపిస్తుంది..ఎక్కడ నీ స్నేహితులు??
అమిత్:
అదిగో వచ్చేసారు..
అతని పేరు క్రునాల్ ఆ పక్కన అబ్బాయి అతని తమ్ముడు గ్యాన్..ఆ టోపీ పెట్టుకున్న వాడు వాహిద్ ఇంకా ఆ పొట్టిగా వున్నా వాడు హరి…మీరు ఆ 4000 ఇస్తే కార్యక్రమానికి కావాల్సినవి ఏర్పాటు చేస్తాం…
శర్మ:
ఇదిగో తీస్కో..మోసం చెయ్యవు కదా??
అమిత్:
డబ్బు విలువ తెలియని వాడు మోసం చేస్తాడు, ఆఖలి విలువ తెలిసిన వాడు కష్టపడతాడు,…మాకు ఆఖలి అంటే ఏంటో తెలుసు..భయపడకండి..
శర్మ ఇచ్చిన డబ్బుతో అన్ని కార్యక్రమాలు సవ్యంగా జరిపిస్తారు అయిదు మంది స్నేహితులు..అన్ని కర్చులు పోగా వారికి మిగిలినది 500 రూపాయిలు మరియు పార్థివ దేహం మీద కప్పిన వస్త్రం..ఆ వస్త్రాన్ని చక్కగ మడిచి సంచి లో పెట్టుకుంటాడు హరి..ఇది గమనించిన శర్మ హరి తో..
శర్మ:
ఎం బాబు శవం మీద కప్పిన వస్త్రాన్ని సంచిలో దాచుకున్నావు?
హరి:
మేము ఇంత కష్టపడి పని చేస్తే మాకు వచ్చే లాభం మనిషికి 100 రూపాయలు దానితో పాటు ఈ వస్త్రం..దీనిని శుబ్రంగా ఉతికి మల్లి 200 రూపాయలకి అమ్ముతం..అప్పుడు మల్లి తలా ఒక 50 రూపాయలు వస్తాయి..
శర్మ:
అల చేయడం తప్పు బాబు..శవం మీద కప్పిన దానిని శవం తో పాటే కాల్చెయాలీ అదే మన శాస్త్రం..

హరి:
ఎవరికీ ఉపయోగపడిందండి మన శాస్త్రం…మీ తండ్రి గారి ఆత్మ శాంతి కోసం ఎక్కడ్నుంచో వచ్చారు దహన సంస్కర్నాలకు..అలాంటి మిమల్ని మోసం చేయమని చెప్పిందా శాస్త్రం..హరి అని దేవుడి పేరు పెట్టుకునే స్వేచ్చ ఇచ్చిన శాస్త్రం దేవుడుని చూడటానికి మాత్రం నిర్బందించింది ఎందుకు??అందరిలా ఆడుకోవాల్సిన వయసుల్లో ఇలా శవాల మీద కప్పే వస్త్రాలను అమ్ముకొని బ్రతకాల్సి వస్తుంది…మా దిశ గమనాలను నిర్దేశించి మీరు అంటరాని వాళ్ళు అని గుడికి బడికి దూరం గ పెట్టినప్పుడు ఏమైంది శాస్త్రం??ఒక సారి కులం కొలమాను ఒక సారి డబ్బు కోలమాను..అటు కులం ఇటు డబ్బు రెండిటికి దూరంగ బ్రతికే మా లాంటి వాళ్ళ కోసం ఎం చేసింది శాస్త్రం?చదువుకోవాలనే కోరికతో ప్రతీ రూపాయి కూడ బెట్టుకుంటూ వుమ్ముతో దాహాన్ని గాలి తో ఆఖలి ని నింపుకుంటున్న ఈ అన్నధమ్ములకు ఎం చేసింది శాస్త్రం..మాకు శాస్త్రం తో విధి విధానాలతో పనిలేదు..మాకి తెలిసిందంతా రెక్కలు ముక్కలు అయ్యే లా కష్ట పడటం…చిరు నవ్వుతో సమస్యని పరిష్కరించడం అంతే…
ఆ అయిదుగురి ఆత్మస్తైర్యం ముందు శర్మ చాల చిన్న బోయాడు..బహుశ తన తండ్రి ఎప్పుడూ చెప్పే మంచి ఇదేనేమో అని గ్రహించాడు…ఎదగాలంటే కావాల్సింది డబ్బు కులం కాదు గుండె నిబ్బరం అని తెల్సుకున్నాడు…వాళ్ళ మాటలలో జీవితానికి సరిపడే స్పూర్తితో నవ్వుకుంటూ అక్కడనుంచి వెళ్ళిపోయాడు…..
(ఇంతలో మసీదు నుంచి నమాజు గంట మోగింది వెంటనే వాహిద్ సంచిలో నుంచి వస్త్రాన్ని తీసుకొని నమాజు చేయడం మొదలు పెట్టాడు)

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: , , ,