This Short Story About A Guy Struggling Between Friendship And Love Is A Must Read!

 

నచ్చిన అమ్మాయి జీవితాంతం పక్కన ఉండాలంటే ప్రేమ ఒక్కటే మార్గమా ? ఒక అబ్బాయి అమ్మాయి కలిసి ఉంటె వాళ్ళు ప్రేమించుకుంటునట్టేనా?

స్నేహానికి విలువనిచ్చే ప్రతి స్నేహితుడి మనసులో ప్రశ్న ఇది. ఇద్దరు స్నేహితుల మధ్య ఒక అమ్మాయి వస్తే వాళ్ళ మధ్య దూరం పెరుగుతుంది అంటారు. కాదు స్నేహం అనే బంధం మధ్య ప్రేమ అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే అది పెరుగుతుంది. స్నేహం అనే బంధం తో ముడిపడిన ఆ స్నేహితులు అరుణ్,అనన్య. ఒక బంధం బలపడాలి అంటే ఇద్దరు వ్యక్తులు సంవత్సరాలు కలిసి ఉండక్కర్లేదు, కొన్ని సార్లు కొన్ని క్షణాలు కూడా సరిపోతాయి. అర్ధం చేసుకునే వాడు కొన్ని సార్లు మన లైఫ్ లో కి చాలా లేట్ గా రావొచ్చు కానీ వచ్చిన ఆ క్షణం నీ లైఫ్ లో ఎన్ని disturbances ఉన్న అన్ని మర్చిపోతాం.

అరుణ్, అనన్య లైఫ్ లో జరిగిన ప్రతి కథ లో వాడు ఉంటాడు. అనన్య అరుణ్ కి ఏ ప్రాబ్లెమ్ వచ్చిన సపోర్ట్ చేస్తూ తన వెనకే ఉంటుంది.

“అంత ప్రేమ ఉంచుకుని ఎందుకురా చెప్పవ్?”
“మూడేళ్లనుంచి చూస్తున్నాం .. గంటల తరపడి మాట్లాడతావ్ .. తనతోనే తిరుగుతావ్ . తింటావ్. .. ఉంటావ్ .. అయినా ఎందుకు చెప్పలేదురా ?”
“మాటలు రాక? ధైర్యం లేక ?”

నాలుగేళ్ళ నుంచి అరుణ్ తో కలిసి ఉన్న స్నేహితులు అడుగుతున్న ప్రశ్నలు అవి.

“ఇంత మంది ఇన్ని అంటున్న మాట్లాడకుండా ఎం ఆలోచిస్తున్నావు రా ? అరుణ్ నిన్నే అడిగేది !!”

“మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంది, అను కి పంచటానికి కావాల్సినంత ప్రేమ ఉంది , కానీ అది ప్రేమ అని చెప్పటానికి నా దగ్గర క్లారిటీ లేదు, అది ప్రేమే అయితే తనకి చెప్పే దైర్యం అసలే లేదు. తను కాదంటే తనను వదిలి ఉండాలి అనే ఆలోచనే నన్ను తలకిందులు చేస్తుంది .”

“అలా అని చెప్పకుండా అంతే ఉంటావా ? చెప్తే కదా తెలిసేది?”

“తనతో ఉంటె బాగుంటుంది రా. లైఫ్ మొత్తం తాను నాతోనే ఉంటేనే ఇంకా బాగుంటుంది రా . కానీ once స్నేహం అనే stage నుండి ప్రేమ అనే stage కి వెళ్ళాక కొన్నిసార్లు ఆ బంధం బరువు అవుతుంది. నాతో ఉండాలి అనుకోవటం స్నేహం, నాతో మాత్రమే ఉండాలి అనుకోటం ప్రేమ. దీన్నే మనం possesiveness అంటాం. మనకు తెలీకుండానే మనం possesive అయిపోతాం. ఫ్రెండ్స్ గా ఉన్నపుడు నలుగురితో కలిసి తిరిగే వాళ్ళు లవర్స్ అయ్యాక నాలుగు గోడల మధ్య ఎపుడు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఉండాలి అని అనుకుంటారు.”

“అరె అరుణ్ నువ్వు మరి ఎక్కువ ఆలోచించేస్తున్నావ్ . ఒకసారి ఇద్దరు లవ్ లో కి వెళ్ళాక ఇవన్నీ ఆలోచించొచ్చు”

” నేను అదే రా చెప్తుంది. అరేయ్ మనం ఫ్రెండ్స్ అయ్యినప్పుడు కానీ ఫ్రెండ్స్ అయ్యాక కానీ దీనిగురించి అయినా ఆలోచించామా? ఫ్రెండషిప్ అనేది ఒక relation , కానీ లవ్ ఒక responsibility. ఏదో టైం పాస్ కి, లేదా ఫ్రెండ్స్ ముందు ఫోజ్ కొడతానికో లవర్ ని maintain చేస్తే మన లైఫ్ తో పాటు మనల్ని నమ్మిన వారి లైఫ్ కూడా waste చేసిన వాళ్ళం అవుతాం. ఒకరితో relation లోకి వెళ్లాలంటే ఎంతో ఆలోచించాచాలి. Life లో మనం అనుకోకుండా, ఆలోచించకుండా చేసేది only friendship మాత్రమే. తనతో ఇపుడు ఎలా ఉన్నానో లైఫ్ మొత్తం ఇలానే ఉంటా. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, నవ్వుకుంటాం, అరుచుకుంటాం కానీ when needed ఒకరికొకరం అండగా ఉంటాం. Love is not just the only thing which binds two people together for life time. We are friends, just friends, ఇంకా చెప్పాలి అంటే best friends.”

లైఫ్ లో ఎంతో మందిని కలుస్తాం. కానీ కొంత మందే మనకు close అవుతారు. And we never want to lose them. ఒకరు మనకి కేర్ చేస్తున్నారు అంటే కొన్నిసార్లు మనకి feelings వస్తాయి . కానీ we never want to share it with that person. Because Friendship >Love. In Love careering becomes concern and then the problem raises.

ఎవరం ఎవరం
మనమసలెవరం?
తెలియని నేలపై
తెలువక కలిసాం
ఒకరికి ఒకరై
ఒకటైపోయాం

మనసులో ఉన్న
మాట్లాడలేని మౌనం
చెప్పాలంటే
గుండెల్లో భయం
ప్రేమనుకున్న
నన్ను ఆపిన స్నేహం

ప్రేమకు మొదలా మన ఈ స్నేహం ??
కలిసుండాలంటే ఇద్దరం కావాలా మనం ప్రేమికులం ?
తోడుగా ఉండాలి అని అనిపిస్తుంది ప్రతి క్షణం
ప్రేమ పరిణయం అవేనా దానికి మార్గం??

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: , , , , ,