This Hard Hitting Poem On Downfall Of Journalism Standards Over TRP Greed Is Spot On!

ఎక్కడికి పోతుంది ఈ జర్నలిజం?
ఎక్కడికి తీసుకుపోతుంది దాన్ని ఈ సమాజం
నైతిక విలువలను మర్చిపోతున్న ఈ తరుణం
TRPల మోజులో తప్పటడుగులు వేస్తున్న ఈ వైనం
ప్రశ్నించాల్సిన మనం,
జనం వేస్తున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేని స్థితికి చేరిపోయాం
ఓ అక్షరమా నీకు నమస్కారం
కత్తికంటే కలం గొప్పది అన్న మనం
డబ్బు పోటుకి మన గౌరవాన్ని మట్టికి కరిచినం
ఏముందని? ఏముందని? ఆ పచ్చని నోటులో
ఏమైనది ఏమైనది నీ కలం పొగరులో
తప్పునెత్తి చూపే నీవు
తప్పయిపోయావు
చెడుని చెండాడాల్సిన నీవు
చెడ్డోని చెంత చేరావు
పేదోనికి నీడ నివ్వాల్సిన నీవు
ధనవంతుని కొమ్ము కాస్తున్నావు
ఓ అక్షరమా నీకు నమస్కారం
మొదలయేనే నీకు అంతం!
సమస్యను పరిష్కరించాల్సిన నీవు
సమస్య అయిపోయావు
కత్తి కంటే కలం గొప్పది అన్నారు,
కలం కన్నా ధనం గొప్పది అని మీరు రుజువు చేసారు
పచ్చ నోటు తగలగానే
అక్షరం తెల్లబోయింది
అక్షరాన్ని నమ్ముకున్న ఆ కలం మూగబోయింది
డబ్బు మనుషుల చేతిలో పడి జర్నలిజం చచ్చిపోయింది!
ఓ అక్షరమా నీకు నమస్కారం
ఇదేనేమో నీ పతనానికి ఆరంభం
If you wish to contribute, mail us at admin@chaibisket.com