This Conversation Between 2 Jigiri Friends Tells The True Meaning Of Friendship

 

Contributed By Gajendra Sevanna

 

వారాంతం కావడం తో మాములు కన్నా traffic ఎక్కువగా ఉంది.. సాయంత్రం కురిసిన వాన వాళ్ళ city అంతా shitty గా తయారైంది.. ఈ traffic గోల కి , తడిసిన నేల కి దూరంగా డాబా పైనుండి అరుణాస్తమయాన్ని చూస్తూ నిల్చోని ఆలోచిస్తన్నాడు సూర్య .. చాలా సాయంత్రాల్లా ఒంటరిగా కాకుండా ఈ సాయంత్రం తన ఫ్రెండ్ సత్యతో మాట్లాడాలనిపించింది .. phone తీసి Dosth Satya కి dial చేసాడు…

సూర్య : hello బావా.. ఎలా ఉన్నావ్ ?
సత్య : ఎం రోయ్.. ఈ హైదరాబాద్ వర్షాలకు.. నీ ఫోన్ కాళ్లకు ఒక timing ఉండదా ఏంది ? ఏమైపోయినవ్ ఇన్ని దినాలు ??
సూర్య : నిజంగా కొంచెం busy గానే ఉనిన్నాను.. ఎక్కడున్నావ్ ?
సత్య : ఇప్పుడే office అయింది.. దమ్ము కొడ్తున్నా.. ఎం ?
సూర్య : దాన్ని ఆర్పేసి ..bike start చేసి బయల్దేరి నా place కి వచ్చెయ్.
సత్య : ఆ..సరే అర్ధ గంటలో ఆడుంటా..

 

సత్య , సూర్య ఇద్దరు 6 ఏళ్ళ నుండి స్నేహితులు. సూర్య కి సత్య 2 ఏళ్ళు సీనియర్. సూర్య కి film making కల .. దాన్ని నిజం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లోనే తను busy గా ఉన్నది. కారణం ఐదు అంకెల జీతమో, లేకపోతే సూర్య లాగా comfort zone నుండి బయటకి రాలేక పోవటం అయిండొచ్చు చదువు పూర్తవ్వగానే సత్య నోరు తిరగని కంపెనీ లో నచ్చని ఉద్యోగానికి చేరాడు . ఇద్దరికి ఉన్న common interest “cinema ” వీళ్లిద్దరు కలిస్తే సినిమా తప్ప సినిమా మరొక topic ఉండదు మాట్లాడుకోవడానికి. వీళ్ళిద్దర్నీ ఇనాళ్ళు కలిపి ఉంచింది కూడా సినిమా నే. చాలా రోజుల తరవాత సూర్యని కలవబోతున్నాడనే ఉత్సాహంతో బయలుదేరాడు సత్య.

సత్య వచ్చేసరికి ..సూర్య ఢాబా పైకి రా అన్నట్లు సైగ చేసాడు…

అక్కడ అంతా Perfect గా setup చేసి ఉంది… ఊరికి దూరంగా ఒక పెద్ద building ఢాబా మీద దొరికేటంత ఆహ్లాదం ఏ pub లోను దొరకదు.. table మీదున్న scotch bottle చూసి shock అయ్యి అడిగాడు సత్య ..

 

సత్య : urgent గా రమ్మంటే story sitting ఏమో అనుకుని ఒచ్చినా.. ఏంది రా మందు sitting set చేసినావ్ ??
సూర్య : తాగాలనిపించింది !
సత్య : ఎమన్నా విశేషం అయితే తప్ప మందు ముట్టవు గా .. ఇపుడు ఏమైంది ?
సూర్య : మందేస్తూ మాట్లాడుదాం !! ఇంకేంటి ఎలా ఉంది ఉద్యోగం ??
సత్య : same shit .. different day !
సూర్య : shawshank Redemption
సత్య : ఏంటి ?
సూర్య : నువ్ చెప్పిన dialogue సినిమా పేరు …
సత్య : నా బాధ లో కూడా నీకు cinema మాత్రమే కనిపిస్తోందా beyy ?
సూర్య : అయినా నీకేం బాధలున్నాయి బావ .. పెద్ద company లో మంచి ఉద్యోగం.
సత్య : ఆసక్తి లేని ఉద్యోగం .. అర్ధంకాని భాష లో సినిమా చూడ్డంలా ఉంటది .. బావున్నా అర్ధం కాదు .. అర్ధం కాకున్నా చూడాలనిపిస్తుంది !
సూర్య : ఇప్పుడు నువ్వు కూడా నీ బాధని సినిమా భాషలోనే గా చెప్తున్నావ్ …
సత్య : హ హ హ .. నాదేముందిలే ..చెపు నీ ప్రయత్నాలు ఎక్కడదాకా ఒచ్చినై ?

సూర్య : అది చెప్పాలనే పిలిచింది ఇక్కడికి.. 2 weeks ముందు ఒక చిన్న producer కి story narrate చేసాను..బాగా నచ్చింది ఆయనకి.. ఆయన already మన short films కూడా చూసున్నాడు. సాయంత్రమే phone చేసి Bound script రెడీ చెయ్యి ఇంకో 1 month లో project start చేద్దాం అన్నారు ..

 

ఇంకా చెప్పటం పూర్తి కాకుండానే సత్య ఎగిరి గంతేశాడు …congratsss మచ్చా అంటూ అరుస్తూ !! సూర్య కి అది ఎంత important అవకాశం అనేది సత్యకి తెలుసు .. దాని కోసం పడ్డ కష్టాన్ని ప్రత్యక్షంగా చూసింది కూడా సత్య ఒక్కడే. మన విజయం లో మన కన్నా మన తోడు ఉన్నవారికి ఎక్కువ ఆనందం ఉంటుందట ..తాను అంతగా excite అవుతుంటే .. చాలా calm గా కూర్చోనున్న సూర్య ని అడిగాడు ..

సత్య : ఎం రా.. ఆలా ఉన్నావ్.. ఎం excitement లేదారా నీకు ?
సూర్య : excitement దేనికి రా ? ఏ ఊరి bus ఎక్కితే .. ఆ ఊరికే గా వెళతాం.. దానికెందుకు excitement ??
సత్య : అబ్బో ! next ఏంటి మరైతే ?
సూర్య : ఇంకో Peg ..
సత్య : peg కాదు .. పెళ్లి సంగతి నేనడిగింది !

సూర్య దగ్గర్నుండి సమాధానం లేదు .. మళ్ళీ సత్యే అన్నాడు..

సత్య : ఈ విషయం లో నేహా వాళ్ళ ఇంట్లో చెప్పి ..వాళ్ళని ఒప్పిస్తే next పెళ్లే గా మరి ?

మళ్ళీ సూర్య దగ్గర్నుండి మౌనమే సమాధానం..

సత్య : ఏంట్రా ఎం మాట్లాడవు ?
సూర్య : నేహా .. నా success .. మా పెళ్లి !! తనకి నాకు మధ్యలో నా success ఉంది..
సత్య : ఏమంటున్నావ్ రే ?

 

సూర్య :

గంట క్రితం producer నుంచి call రాగానే నేను నీ లాగే ఆలోచించా.. ఆ విషయం first తనకి చెప్పాలనే అనుకున్నా.. కానీ తన నుండే call వచ్చింది. answer చెయ్యగానే నేను చెప్పాలనుకున్నది కట్ చేస్తూ తనే ఒక force లో మాట్లాడుతోంది.. కొత్తగా ఎం కాదు.. తన పెళ్లి చూపులు ఆపాలి … వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి .. తనని పెళ్లి చేసుకోవాలి .. వీటన్నింటికన్నా ముందు నేనో ఉద్యోగం చెయ్యాలి.. లేకపోతే వాళ్ళ నాన్న తెచ్చిన Australia సంబంధం చేసుకోవాలి… నువ్వు settle గా..మా ఇంట్లోకొచ్చి మాట్లాడు .. ఎంత సేపు అదే reel తప్పించి నేనేం చేయాలనుకుంటున్నా.. నా కల ఏంది .. ఏదీ అవసరం లేదు దానికి ..ఇంకో నెలరోజుల్లో ఏమి చెయ్యకపోతే Australia సంబంధానికి okay చెప్పేస్తా అంది .. మనుషులు ఇంత selfish గా ఉంటారా అనిపించింది ఒక్కసారిగా.. ఇన్ని ఆంక్షలతో కూడి వచ్చే ప్రేమ మీద కాంక్ష అవసరమా అనిపించింది..నా కలని ప్రేమించలేంది …నిజం లో నాతో ఎలా ఉండగల్గుతుంది ? తనకి ఆ సంబంధమే correct అనిపించింది ..

“తరవాత ఎం చెప్పావ్ ?” అడిగాడు అంత సేపు నిశ్శబ్దం గా వింటున్న సత్య ..

సూర్య : ఎం చెప్పలేదు .. ఫోన్ కట్ చేశాను ..
సత్య : ఏంటీ.. తనకి విషయం చెప్పకుండానే కట్ చే..సా..వా ??
సూర్య :చెప్పాలనిపించలేదు.. చెప్పాలన్నా తాను తిరిగి ఫోన్ చేయలేదు.

కొంతసేపు వింత నిశ్శబ్దం నెలకొంది ..

 

తనకి నేను answer కాదు .. ఒక option అంతే. వినటానికే వింతగా ఉంది సత్యా…” నిశ్శబ్దాన్ని చీలుస్తూ అన్నాడు సూర్య..

సత్య : బాధ పడకు రా..
సూర్య : అంతా అయిపోయాక బాధ పడినా .. బావి లో పడినా ప్రయోజనం ఏముంది ! నాకేమి బాధ గా కూడా లేదు .. నేను నాతోనే ఉంటాను ..నన్ను పోగొట్టుకుంది తనే.
సత్య : దీన్నే తలుచుకుంటూ తలకాయ పాడుచేసుకోమాక .. అమ్మాయి ని వదిలేసి అవకాశం మీద దృష్టి పెట్టు.

సూర్య : రేయ్ సత్య.. నిన్నోటి అడగనా ?
సత్య : అడగొద్దంటే ఆపెయ్యవు గా .. కానీ..

సూర్య : నా మీద నీకు ఎందుకంత నమ్మకం ? ఏంటా నమ్మకం వెనక కారణం ?? నా ఆశయం గురించి విన్న ప్రతి ఒక్కరు .. negative గా మాట్లాడిన వల్లే .. మా అమ్మ నాన్న తో సహా .. నా ఆశయాన్ని అసాధ్యం గానే భావించే వాళ్ళు.. సినిమా కళ లో భాగం అవ్వాలనే నా కల.. కలగానే మిగిలిపోద్దేమో అని భయం లో ఉన్నా.. అటు ఇటు గా అప్పుడే మన పరిచయం అయ్యింది. నువ్వు ఇచ్చిన ప్రోత్సహంతోనే ఆరోజు నా ప్రయాణం మొదలయింది .. ఈరోజు నేను నా గమ్యాన్ని చేరానంటే దాన్నికారణం ఆరోజు నా మీద నీకున్న నమ్మకమే కారణం !

 

సత్య : రేయ్ .. నమ్మకం ..కారణం .. గమ్యం అని ఏవేవో మాట్లాడుతున్నావ్ .. కానీ అవేవి కావు .. ఇష్టం. నీకు సినిమా మీదున్న ఇష్టం.. నువ్వు సినిమాని చూసే దృక్కోణం. నేను నీలో చూసింది ఇవే . అందుకే నీ ఆశయం విన్నపుడు నాకు వింతేమీ కలగలేదు .. ప్రయత్నం లో నిజాయితీ ఉంటె .. గెలుపు పిలవకపోయినా వస్తుందనేది నా నమ్మకం .. అదే నీకు చెప్పా. అన్నిటికి మించి సినిమా అంటే నాకూ ఇష్టమే.. కానీ నేను చెయ్యలేకపోయిన ప్రయాణం నువ్వెంచుకున్నావ్.. అందుకే నీకు చెయ్యగలిగింది చేశాను .. నువ్వు ఏదో ఒకరోజు గమ్యం చేరితీరుతావ్ అని నమ్మాను.. cut చేస్తే కూర్చొని మందేస్తున్నాం.. సెలెబ్రేట్ చేసుకుంటున్నాం నీ విజయాన్ని..

సూర్య : నేహా .. నేను గెలిస్తే నాతో ఉండాలనుకుంది .. నువ్వు నేను గెలిచేంత వరకు నాతోనే ఉన్నావు. గెలుపు తర్వాత మనిషి ప్రతిభను నమ్మటం సులభం.. కానీ ఒక మనిషి ఎప్పటికైనా గెలుస్తాడనే నమ్మకం పెట్టడం కష్టం.. అదే నమ్మకంతో అతని గెలుపు కోసం ఎదురుచూడటం గుణం. అదే నీలో ఉన్నది .. తనలో లేనిది. అందుకే ఇప్పుడు నా పక్కన నువ్వున్నావ్ .. నా success ని కలిసి celebrate చేస్కోగల్గింది నీ ఒక్కడితోనే… love you for trusting in me సత్య.

“ నీ విజయం లోనే కాదు.. ప్రయాణం లోనూ తోడుండే వాడే అసలైన Companion “

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments