What If Jandhyala Gari Character Gives Today 9PM Diya Precautions In His Style

Contributed By Hari Atthaluri
ఆర్పేయమంది లైట్లు రా అయ్యా..లైఫ్ లు కాదు…
వెలిగించమన్నాడు కదా అని ఓ… అని ఉన్నవన్నీ తగలెట్టకండి…
దియా అన్నారు కానీ దిక్కు మాలిన వన్నీ పట్టుకోకండి…
ఫ్లాష్ లైట్ లు వేయండి కానీ ఫ్లాష్ న్యూస్ లో రాకండి…
టార్చ్ వేయండి కానీ..జనాల్ని టార్చర్ చేయకండి..
ఈ మూడు లేకపోతే మూసుకుని ఉండండి కానీ ముదరస్టపు పనులు చేయకండి….
కూసంత ఉన్న ఆ బ్రెయిన్ ని వాడండి…
కాసింత దూరం ఉండండి…
కొంపలు ఆర్పకండి…
కొంపలోనే ఉండండి…
కుదిరితే బాల్కనీలో రండి కానీ బయటకు వచ్చి తగలడకండి…
ఏంటి అర్దం అవుతుందా ??
ఓ సందు దొరికింది కదా అని ఊపుకుంటూ వచ్చి..
మొన్న లా మళ్ళీ అన్ని సిల్లీ సిల్లీ చేష్టలు చేయకండి
కరోనా కి కరెంట్ ఉందో లేదో తెలియదు గా…సో కామెడీ చేయకండి…
కామెడీ కాస్తా ట్రాజెడీ అయిపోతుంది…
జర భద్రం..మీరు..మీ పక్కన ఉన్న జనాలు…
ఎవడైనా దిక్కు మాలిన పనులు చేస్తే sanitizer పూసుకుని మరీ డిప్ప పగల కొట్టండి..
మూర్ఖంగా చేసి మళ్లీ మొదటికి తీసుకు వచ్చే
మొండి వెధవలు మీ చుట్టు పక్కల ఉంటే 100 కి డయల్ చేయండి… వాళ్ళే వచ్చి మొదటి తాంబూలం ఇస్తారు…
ఇంట్లో ఉండి సినిమాలు చుడండి, బయటకొచ్చి మీ జీవితాన్ని సినిమా చేసుకోవద్దు మరి.. ఉంటా… ఆ ఇంట్లోనే ఉంటా
If you wish to contribute, mail us at admin@chaibisket.com