These Brutal Honest Lines About IT Employees Will Hit Every Struggling Youngster

Contributed By Nag Writes
ఎక్కడ నీ చిరునామా ఓ ఐటీ కుర్రోడా |
ఇంకెందాక నీ పయనం ఓ హైటెక్ కుర్రోడా
అత్తరు పూసుకుని సక్కగ ముస్తాబయినావు |
బిత్తరు సూపులతో ఆయాసపడతావు |
సత్తా చాటుకుంటూ సాగరాలు దాటుతావు |
పత్తా లేకుండా ఉరుకుతావు ఊగుతావు
హడావుడిగ సందుల గొందుల్లో రయ్యిమంటూ దూసుకెళ్లు బుల్లెట్ కుర్రోడా |
ఆడాఈడా కస్సుబుస్సు మనుకుంటు కయ్యాలు పెట్టుకుంటూ బుసలుకొట్టు కుర్రోడా |
వడివడిగా తడబడతు కయ్యికయ్యిమనుకుంటు కోపాల కుర్రోడా |
కుడిఎడమల తికమకతో నీతీ నియమాలు లేని కక్కుర్తి హైటెక్ సన్నాసి
రోడ్డెక్కితె రోదన అంతులేని వేదన |
బండెనక బండి కట్టి బారులుతీరి |
నడిరోడ్డున దిక్కులేని నరకయాతన |
గడిపేవు గంటలు గంటలు వృథా వృథా
కూర్చుంటే లేవలేవు తీరిగ్గా తినలేవు |
చర్చలు ఎన్నెన్నో తిన్నదేమో అరగదు అరిగింది అలిగి బుంగమూతి పెడుతుంది |
కూర్చునే మరి సల్లని గదిలో కష్టపడుతు ఆరోగ్యం అటకెక్కితె |
ఖర్చులుపెట్టి మరీ బరువులెత్తి వంగివంగి గెంతులేసేవు
అంతులేని ఆవేదన దాచుకుని లోలోన మరి నవ్వేవు పైపైన |
క్షణమానందం క్షణమావేశం |
క్షణికావేశపు నిర్ణయాలు క్షణక్షణ ఘర్షణలు |
అలుపెరుగని అంతర్మథనం గమ్యమెరుగని పయనం |
తీరానికి చేరేదెపుడో నీకైనా తెలుసా ఓ ఐటీ కుర్రోడా
చిన్ననాటి స్నేహాలు గుర్తొస్తే కన్నీళ్లు తుడుచుకుంటావు |
ఆనాటి అనుబందాలు అలనాటి ఆప్యాయతలు తలచుకుని కుమిలేవు |
అమ్మానాన్నల అక్కచెల్లెళ్ల ప్రేమ దూరమయ్యి రోదించేవు |
మట్టివాసన మరిచావు పచ్చని ప్రకృతికి దూరమయ్యి సొంతూరుని మరిచావు ఓ ఐటీ కుర్రోడా
ఎక్కడ నీ చిరునామా ఓ ఐటీ కుర్రోడా…
ఇంకెందాక నీ పయనం ఓ హైటెక్ కుర్రోడా..
If you wish to contribute, mail us at admin@chaibisket.com