రక్తపు చరిత్ర కి నిప్పు రాజేసింది ఎవరు? – ఇస్లామిక్ స్టేట్ vs ప్రపంచం!

(Special article written by Siddhu Manchikanti)
 
పారిస్ ఉగ్ర దాడిలో తమ కుటుంబ సభ్యులని కోల్పోయిన వారికి ప్రఘాడ సానుభూతి ప్రకటిస్తూ …

 
దొరికితే రక్తంతో దొరక్కపోతే రక్తపు మరకలతో చరిత్ర లిఖించబడుతోంది, చరిత్ర అంటే ఎక్కడో లేదు ఇక్కడ నుంచి సరిగ్గా రెండు మూడు వందల సంవత్సరాల తర్వాత ‘ఉగ్రవాద యుగం’ గా మనం బతుకుతున్న ఈ రోజుల్ని చదువుకుంటారు మన ముందు తరాలు వారికి అదే చరిత్ర కాబట్టి మనం ప్రస్తుతం చరిత్రలో బతుకుతున్నాం…
 

1948 లో మహాత్మాగాంధీ హత్య జరిగిన నాటికి స్వతంత్రం అప్పుడే కొత్తగా వచ్చి నూతన అధ్యాయంలోకి దేశం అడుగుపెడుతున్న వేళ అది. ఆయన ఈ దేశం కోసం ఎంత చేసారో ఏం చేసారో కూడా తెలియని చిన్నారుల దగ్గర నుంచీ పెద్దలూ అంతా తమకి వీలైనంత దగ్గరలో ఉన్న సముద్ర తీరాలకి లేదా నదులకి చేరుకొని, ఆ మహానుభావుడుకి కన్నీళ్లు పెట్టుకుంటూ సముద్ర స్నానాలు చేసారు. ఒక మహాత్ముడి నిర్యాణానికి దేశ ప్రజలు అందించిన మనసైన నివాళి అది పైగా అది హత్య, సాధారణ మరణం కాదు. సరిగ్గా 1992లో 44 సంవత్సరాల తరవాత బాబ్రీ మసీద్ కూల్చివేత ఘటనలో భారత దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో భారీ విధ్వంసం జరిగింది. దేశ విభజనకి ముందూ తరవాతా కలిసి కట్టుగా ఉన్న భారత దేశ హిందూ ముస్లిం లు రాజకీయ పార్టీల కుటిల నిర్ణయాలకి బానిసలుగా మారి దాదాపు తొమ్మిది వందల మంది చావుకు నెత్తిటు సాక్ష్యంగా మిగిలారు.
 
B_Id_333041_Mumbai_Riots
 
దుఃఖం ఎపుడూ రెండు మార్గాలు చూపిస్తుంది ఒకటి సమస్య మూలాలని ఎన్నుకుని ఏరుకుని వాటిని వేర్లతో సహా పెకిలించే వేసే జ్ఞానాన్ని , మరొకటి కోపం తో కృంగిపోయి ఆవేశాలకి లోనై గొండెని బాదుకుని సొంతవారిలోనే వైరిపక్షాలని ఎన్నుకుని విధ్వంసం సృస్టించడం. అతి ప్రాధమికమయిన మానవ చేతన – నిస్సహాయంగా తన ఉదాసీనతకి దారులు వెదుక్కోవడం కుసంస్కారం తప్ప మరేమీ కాదు.

 
ఇప్పుడు ఇస్లామిక్ స్టేట్ కీ ప్రపంచానికీ జరుగుతున్న ప్రఛన్న యుద్ధం లో మొట్ట మొదటి దాన్ని సమూలంగా మరచిపోయి రెండవదాన్ని పూర్తిగా ఆచరిస్తున్న తరుణం నడుస్తోంది. దీనికి మొదలు ఎక్కడో తెలుసు కానీ అంతం ఎక్కడ అనేది నరవమానవుడు ఎప్పటికీ కనిపెట్టలేదు. ముందు తరాలకి స్వేచ్చా వాయువులతో కూడిన ప్రపంచాన్ని అందించాల్సిన ఇప్పటి తరం ఉగ్ర పీడిత నరరూపరాక్షాస సమాజాన్ని అందిస్తూ బిక్కు బిక్కు మంటూ బతకండి అని గాలికి వదిలేస్తోంది. అసలే ఉగ్రవాదంతో నిండిపోయిన ప్రపంచశాంతికి ఇప్పుడు కొత్త , ఊహించని మజిలీని చేర్చేసాం. దాని పేరే ఇస్లామిక్ స్టేట్ .. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ..
 
isis-logo
 
ఇస్లామిక్ స్టేట్ ని అర్ధం చేసుకున్న వారు చాలా తక్కువ, వారి ముఖ్య ఉద్దేశ్యం ఇస్లాం మతంలోకి మార్చడమో మరేదో సాధించాడమో కానే కాదు .. ‘ దేవుడు ‘ వారికి వంక మాత్రమే , ఆ పేరుతో ఎలాంటి అరాచకానికైనా తెగబడచ్చు అని అమాయక యువతని మభ్య పెడుతున్న ఒక మూర్ఖపు తెగ అది అంతే .. అంతకు మించి దేవుడితో గానీ ఏ మతం తో కానీ ఎలాంటి సంబంధాలూ లేవు వారికి. ప్రపంచ వ్యాప్త ఉగ్ర నిర్మాణాలు అన్నీ తనలో దాచేసుకుంది అంటే ఆ వ్యవస్థ యొక్క సారూప్యం చక్కగా అర్ధం అయిపోతోంది. అమెరికన్ సైంటిస్ట్ కంటే ఎక్కువ తెలివిగలవారు ఆ ఇస్లామిక్ స్టేట్ లో పనిచేస్తున్నారు అని, అది అనేక విధ్వంసాలకి దారి తీస్తుంది అని ఎప్పటినుంచో నిఘా వ్యవస్థలు చెబుతూనే ఉన్నాయి. ఈ ఐఎస్ఐఎస్ స్థాపన కి ముందు వరకూ ప్రపంచ ఉగ్రవాద కోణం ఒక ఎత్తు ఆ తరవాత ఒక ఎత్తు అన్నట్టు సాగింది. అంతకు ముందు వరకూ మత ప్రొద్భలమో మరేదో వారిని ప్రేరేపిస్తూ వచ్చింది కానీ ఇప్పుడు ఐఎస్ఐఎస్ రాకతో ప్రచండ యుద్ధం మొదలైంది ఇది మతం వంకతో జరిగే మారణహోమం స్థాయిని దాటేసి రాక్షత్వత్వ భవిష్యత్తు ని రుచి చూపిస్తూ సాగుతున్న పెను దుర్మార్గం.
 
అంతకు ముందు వరకూ విచ్చిన్నంగా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఎవరు పడితే వారుగా ఉన్న ఈ ఉగ్రవాద సంస్థలు అనింటినీ ఒకతాటి పైకి తీసుకువచ్చి మరీ దాడులు జరిపేటంత గా వారిని ప్రభావం చేసిన అంశాలు ఏంటి ? ఉగ్రవాద మహమ్మారి గా ఇస్లామిక్ స్టేట్ మారడానికి చాలా కారణాలు లేకపోలేదు కానీ అందులో ముఖ్యంగా అగ్గి రాజేసిన వారి తప్పుని ఎత్తి చూపడం అవశ్యం.
 

ఇది నిన్నా మొన్నా రాజేసిన నిప్పు కాదు, 2003 లో ఇరాక్ లో మారణాయుధాలు ఉన్నాయి అంటూ అస్తవ్యస్తంగా ఉన్న ఆ దేశ వ్యవస్థని కుక్కలు చింపిన విస్తరి చేసిన అగ్రరాజ్యం అమెరికాకే ఈ పాపంలో అగ్రతాంబూలం దక్కి తీరాలి .. వైమానిక , రహదారి , నావికా , గగనతల దాడులతో ఇరాక్ నీ అక్కడి మనుషుల జీవితాలనీ చిన్నా భిన్నం చేసాయి . ఇళ్ళల్లో బాంబులు పడుతుంటే బాత్ రూముల్లో దాక్కున్న బతుకులు వారు చూసారు, ఊరికీ ఊరికీ మధ్య రోడ్డు సమూలంగా నాశనం అవగా పస్తులున్న బతుకులు అక్కడి బాలురు అనుభవించారు.
 
030402-N-5362A-004 Southern, Iraq (Apr. 2, 2003)
 
అధికారిక లెక్కల్లో వేలల్లో , అనధికారిక లెక్కల్లో లక్షల్లో తమ వారిని కోల్పోయిన అనిశ్చితి వారిని ప్రపంచానికి ఎదురు తిరిగేలా పురిగొల్పింది. ఇక్కడ వారిని వెనకేసుకుని రావడం కాదు , అంతటి పాశవికులు గా వారు మారడానికి ఎవరి వాటా వారికి ఇవ్వడం మాత్రమే మన ఉద్దేశ్యం . నెత్తురు మరుగుతున్న సమయంలో సరైన మార్గం చూపించే వారు లేక ప్రతీకారం కోసం రగిలిపోయేవారే అక్కడ ఉన్నప్పుడు అది కొందరు సైకోలకి ఆనవాలు గా మారింది. పైగా తమ దాడి పూర్తైన తరవాత అక్కడి స్థానిక ప్రభుత్వం మళ్ళీ కుదురుకునే దాకా కూడా చూడకుండా వారి సైన్యాలు వెనక్కి తీసుకుంది అమెరికా …
 
1380581725_execution-of-saddam-hussein1
 

సరిగ్గా ఈ సమయలో ‘ఇస్లామిక్ స్టేట్’ ఉద్భవించింది .. నేత్తుటేళ్ళు పారుతున్న రోడ్ల మీద పిచ్చికుక్కల స్వైర విహారం ఈ ‘ఇస్లామిక్ స్టేట్’ ఆవిర్భావం .. దాని ఫలితం ఇన్నాళ్ళ తరవాత ప్రతీ ప్రపంచ పౌరుడికీ కనిపిస్తోంది .. అప్పుడు చంపడానికి అమెరికాకి “మారణాయుధాలు” ఒక వంకైతే ఇప్పుడు చంపడానికి “దేవుడు” వారికీ ఒక వంక అంతే ..
 
ISIS-Iraq
 

పక్క సందులోకి పోయి అన్ని గుడిసెలూ తగలేట్టేసి ఇంటికొచ్చి దాక్కుని ఎప్పుడు ఎవడు వచ్చి మన గుడిసె తో పాటు మనల్ని కూడా తగలబెడతాడా అని భయపడుతూ ఇంట్లో కూర్చోడం లాంటిది ఈ పరిస్థితి .. ఈ పాపంలో భాగం తగలబెట్టిన వాడికంటే నిప్పు రాజేసిన వాడికే ఎక్కువ దక్కుతుంది.
 

US-PRESIDENT-GEORGE-BUSH--007
 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , ,