This Short Poem About An Introverted Lover Is Relatable To All The Introverts Out There

Contributed by Gopinath Vaddepally
ఏదైనా తప్పు చేసేప్పుడో,చేస్తున్నపుడో,
చేశాకానో గుండె భయంతో పరుగులు పెడుతుంటుంది.
తప్పు రా,చూస్తే బాగోదు అని భయం ఓ వైపు,
తప్పదు రా.. చూడాల్సిందే అనే కోరిక ఇంకో వైపు.
కుదురుగా పక్కన నిలబడలేకున్న..
ఈ వర్షానికి ఆకాశం నుండి ఓ తార
నేలమీద పడి అమ్మాయిల మారిందేమో అన్నట్లు,
మొహం మీద ముత్యాల్ల మెరిసిపోతున్న
చినుకుల్ని చున్నీతో తుడుచుకుంటు,
యెల్లో కలర్ చుడిదర్లో,
మనసుని మాయ చేసే మైమరుపుల,
ఓ మెరుపులా నా పక్కనే నిలబడింది ఓ అమ్మాయి..
ఎదో మాగ్నెటిక్ పవర్ ఉంది ఈ అమ్మాయిల్లో,
మనసుని పట్టి లాగినట్లుండే తన చూపులు,
ఆ నీలి సంద్రాల లోతంత తన నీలి కళ్ళల్లో కనిపిస్తుంటే,
ఆ పెద్ద పెద్ద కళ్ళకి కాటుక దిష్టి తగలకుండా పెట్టినట్లుంది.
వర్షానికి తడవకుండా ఆగాను అనుకుంటే,
తన వలపుల వర్షంలో తడిపేసింది.
వర్షం తగ్గిపోయింది.
ఓ మాట చెప్పేసి వెళదామని తనని పిలిచి చెప్పాను,
You look so beautiful..
ఏంటీ అనింది..
సమయానికి నాలో కవి బయటకి రాలేదు,
ఏం చెప్పాలో తెలియక,
Nothing sorry..
బైక్ స్టార్ట్ చేసి ఫాస్ట్ గా అక్కడి నుండి పారిపోయాను..
ఇప్పుడు మేలుకుని రాస్తున్నాడు
తనకిది చెరాలన్న ఆశతో…
If you wish to contribute, mail us at admin@chaibisket.com