This Short Story Tells Us How Harsh Life Can Be Sometimes

Contributed By Gireesh Raman
ఆమె !
తన కూతురికి 13 ఏళ్ళ వయస్సులో రెండో కాన్పు ఇస్తూ ఆ తల్లి మరణించింది
ఇప్పుడు ఆ బిడ్డకు తాను తల్లి అయ్యింది,
తాళి లెని తల్లి అయ్యింది,
పుష్పవతి కాకుండానే అమ్మ అయ్యింది .
ఎప్పటి లాగే సగం తెలిసిన లోకం వెక్కిరించింది .
ఏడాదికి ఆమె యెడ ఎడారి అయ్యింది.
వొణికి బాగా మరకలు పడ్డాయి కొత్తది కొనిపించమని తాగుబోతు తండ్రిని అడిగింది .
చంటోడిని చంకనేసుకొని తండ్రితో సంతకెళ్లింది .
అక్కడ ఆమెని ఎండలో పీటవేసి కూర్చోబెట్టి పలక మీద నా కూతుర్ని అమ్ముతున్నాను అని రాసి పట్టుకొని నిల్చున్నాడు .
పాపం తనకేమో చదువు రాదు, కొత్త వోణి వస్తుందేమో అని నవ్వుతు కూర్చుంది .
ఇంతలో ఒక ముసలి అతను “నాకు పిల్లలు లేరు నీ కూతురిని నేను కొన్నుకుంటాను” అన్నాడు .
ఆ మాట విని ఆమె గుప్పెటిలో గట్టిగ పట్టుకున్న చింత గించాలు నేల రాల్చింది .
అష్టాచెమ్మా కోసం పోగుచేసింది అవి.
అష్టా పడింది.
సొమ్ము తీసుకొని చంటోడిని లాక్కుని సారాయి దుకానికి చేరాడు కసాయివాడు .
25 సవంత్సరాల తరువాత ఈ కథను ఓ వేశ్య గృహానికి వోచిన ఓ రచయిత పడక మీద కూర్చొని రాస్తున్నాడు .
పైట జార్చిన ఆమె ఏడుస్తూ తన కథను చెప్తుంది .
ఓ వ్యభిచార గృహం లో కలిసిన అక్క-తమ్ముళ్ల కథ పైవాడు రాస్తున్నాడు .
“మనం ఒక్కసారే చస్తామా ?”అని ఆ రచయత కథ ముగించాడు .
If you wish to contribute, mail us at admin@chaibisket.com