This Women Handling Her ‘Layoff’ Days Is Very Relatable To Everyone In The Present Scenario

 

Contributed By Telugu Lessa

 

మా డైరెక్టర్ మీటింగుకి పిలిస్తే టీంలో సంతోష పడని వాళ్లుండరు. పెద్దాయనకి వాళ్ళు చేసే ప్రాజెక్టులు, కొత్త టెక్నాలజీలు గురించి చెప్పి మెప్పు పొందాలని ఉత్సాహంతో ఉంటారెప్పుడు. నాకు అలా ఎప్పుడూ అనిపించలేదు. ఒక మ్యానేజరుగా నన్ను ఆయన చాలా సార్లు కలిసి పని గురించి చర్చించడం, టీం గురించి తెలుసుకోవడం, పబ్లిక్ ఫోరమ్ లో నేను మాట్లాడటం ఆయన చూశారు. అలాంటిది మరుసటిరోజు నాలుగు గంటలకు ఆయనే స్వయంగా ఒక మీటింగ్ పెట్టడం అదే మొదటి సారి. కేవలం తారీకు, సమయం మాత్రమే ఉన్నాయి ఆయన పంపిన మెయిల్ లో. ఫలానా దాని గురించి ఏమైనా మాట్లాడతారా, నా వైపు నుండి ఏమైనా వివరాలు సిద్ధం చెయ్యాల్సి వస్తే ఏమీ తెలీకుండా ఎలా అని నేను పని చేసే ఇద్దరు సీనియర్లను అడిగాను. వాళ్ళకీ తెలీదు అంటే, సర్లే చూద్దాం ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో బిజినెస్ గురించి ఏమైనా చెప్తారేమో అనుకున్నా. మోడీ గారు ఈ టైంకి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు అంటే ఏం చెప్తారో అని ఆత్రుతతో ఉంటాం కదా, అలా అనిపించింది.

 

మర్నాడు జూమ్ మీటింగుకి లాగిన్ అయ్యాక ఆయనతో పాటు మా డిపార్ట్మెంట్ HR అతను కూడా ఉన్నారు. నాకెందుకో తేడాగా అనిపించింది వాతావరణం. పెద్దాయన ముభావంగా కేవలం నాలుగు నిమిషాల్లో చెప్పాల్సింది చెప్పేసారు. బిజినెస్ బాలేదు కాబట్టి మెల్లగా కొంతమందిని కంపెనీ నుండి తీసేస్తున్నాం అని.
“I am sorry, I have to let you go” అన్నారు. ఆ తర్వాత ఆయన మీటింగ్ నుండి వెళ్లిపోయారు. HR అతను “please share your screen, go to dashboard and click the ‘EXIT’ button” అన్నారు. నాకు అర్ధమైంది. Severance package తగ్గించడం కోసం మాతోనే రాజీనామా చేయిస్తున్నారని. నో అనడానికి లేదు. నేను ఈ తతంగం అంతా అయిదు నిమిషాల్లో చేసేసాను.
“Any questions?” అని అడిగారు HR.
“No” అన్నాను.
“Ok. Your laptop data will be wiped out by 8pm. Please copy all personal files in a separate folder. We will backup the files and send you the link once we collect your laptop from the address on file” అన్నారు.
ఆ సమయంలో ఆ HR అతను నాకు ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాకి ‘Thoughtful’ అని రివ్యూ రాసే వాడిలా కనిపించాడు.

 

“Ok” అని చెప్పి మీటింగ్ నుండి బయటకి వచ్చాక కాని నాకు పది నిమిషాల క్రితం ఏం జరిగిందో మెదడులో రిజిస్టర్ అవ్వలేదు. అయ్యాక ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. ఇంట్లో ఉన్న అమ్మ వాళ్ళకి చెప్పాలా, నాన్నకు ఫోన్ చెయ్యాలా…ఇప్పుడేంటి? ఇవేమీ కాదు. కంపెనీ వాళ్ళు ఎలా అయినా ఉండనీ, I will exit with grace and dignity అనుకున్నాను. అర్జెంటుగా నాతో పని చేస్తున్న టీమ్స్ కి ఇబ్బందులు రాకూడదని ఫైల్స్ అన్నీ అప్డేట్ చేసాను. నా PF, Form 16, insurance అవి ఇవి అన్నీ డౌన్లోడ్ చేసి, చివరిగా నా కోలీగ్స్ కి ఒక థాంక్యూ ఈమెయిల్ పంపేటప్పటికి 7.55pm అయ్యింది. సరిగ్గా 8pm కి data wipeout మొదలైయ్యింది. ఈ హడావిడిలో నేను వెళ్ళాక నాతో పని చేసే 83 మంది ఇబ్బంది పడకూడదనే ఆలోచించాను. వాళ్ళకి అన్నీ సిద్ధం చేసి బయటకు వచ్చాను. తర్వాత అలానే కూర్చుండి పోయాను. మెల్లగా అర్ధం అవుతోంది మెదడుకి. ఉద్యోగం పోయిందని. రేపట్నుంచి లాగిన్ అవ్వక్కర్లేదని. నాలుగంటే నాలుగు నిమిషాల్లో మొత్తం తారుమారు అయిపోయింది. రేపటి నుండి బిజీగా ఉండను. ఉరుకులు పరుగులు లేవు. టీం కాల్ టైంకి ఇంట్లో ఎం చేస్తుంటాను అనే ఆలోచనలు. తన కుటుంబంలో ఒకటేసారి నలుగురిని ఒక రోడ్ ప్రమాదంలో పోగొట్టుకున్న మా సాత్విక్ గుర్తొచ్చాడు. ఆ కష్ట సమయంలో అతని సెలవలని, ఇన్సూరెన్సు అని సాయం చేశానని తర్వాత చాలా సార్లు కృతజ్ఞతలు చెప్పాడు. లొక్డౌన్లో సిమ్లా వెళ్ళిపోయాడు. ఇక దగ్గరలో కలవడు కదా.

 

మా నందిత. US టీంతో ఏదైనా ఇబ్బంది అయితే, వెంటనే నా దగ్గరకి వచ్చేది. వీళ్ళు మళ్ళీ ఇలానే చేస్తున్నారు చుడక్కా అంటూ చిరాకు పడేది. కోపం తగ్గించుకో అని ఇప్పుడు ఓపిగ్గా ఎవరు చెప్తారు?

 

ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పలేదు. ఆ రోజు కాదు, ఆ తర్వాత పది రోజులు వరకు వాళ్లకేం చెప్పలేదు. లాప్టాప్ కోసం ఆఫీస్ వారు ఇంకా రాలేదు. రోజూ దాని ముందు అలానే కూర్చునేదాన్ని. మరుసటి రోజు సరిగ్గా టీం కాల్ టైంకి వంటింట్లో సింక్ దగ్గర టిఫిన్ గిన్నెలు కడుగుతుంటే బాధ ఆగలేదు. ఉదయం కాల్లో 15 మంది ఉన్న ఒక ప్రాజెక్ట్ టీం నుండి అప్డేట్ తీసుకునే నేను ఉప్మా గిన్ని మాడిందని ఇనుప పీసుతో దాన్ని గీకుతున్నప్పుడు నా లోపల జరిగిన యుద్ధానికి నేను ఆ నిమిషం భూమి మీద లేకపోయినా పర్లేదు అనిపించింది. గబ గబా చేతులు కడుక్కోని లాప్టాప్ దగ్గరకి వెళ్తే స్క్రీన్ మీద “Laptop is frozen by ITS for security reasons” అని ఉంది. దాన్ని ఆలా చూస్తూ ఉండిపోయాను. కళ్ళలో నుండి నీళ్లు ఎప్పుడు వచ్చాయో, ఎంత సేపు ఆలా ఉండిపోయానో నాకే తెలీలేదు.

 

కుటుంబాన్నిపోషించాల్సిన బాధ్యత లేదు. నా మీద ఆధార పడే వాళ్ళు లేరు. ఉద్యోగం లేకపోతే ఎలా బ్రతకాలని దిగులు లేదు. వైరస్ కారణంగా ఇదంతా జరిగిందని అని ఒకరు మీద కోపం లేదు. అయినా ఏదో వెలితి. మా అమ్మాయి బీ టెక్ ఫస్ట్ వచ్చిందండి అని చెప్పుకునే అమ్మ నాన్న ఉద్యోగం పోయిందంటే బాధ పడతారనీ కాదు. నేను గెలిచినప్పుడు నా పక్కన ఉన్నారు ఇద్దరు. అలాగే ఓడిపోయినప్పుడు కూడా చాలా సార్లు ధైర్యం చెప్పి ముందుకు నడిపారు. జీవితంలో ఇదే మొదటి సారి దెబ్బతినడం అంటే అదీ కాదు. మరి దేని గురించి నేను ఇంతలా బాధ పడుతున్నాను అనేది అర్ధం కాలేదు. లొక్డౌన్ లో మరో లొక్డౌన్ లా అనిపించింది. మొత్తానికే ఒంట్లో ఓపిక లేకుండా పోయింది. ఒక ఉల్లిపాయ కొయ్యి అని పిన్ని చెప్తే సగం కోసి ఓపిక లేక కూర్చుండిపోయాను. నాకు తెలీకుండా కళ్ళు చెమ్మగిళ్లాయి. అయినా కారణం తెలీలేదు. డాన్స్ క్లాస్ కి ఏదో సాకు చెప్పి వెళ్ళలేదు. లోపలంతా ఖాళీగా ఉంది. ఎవరైనా మాట్లాడితే, “అబ్బా, ఎందుకు ఈ మనిషి ఇంతలా మాట్లాడుతున్నారు” అనిపించేది. మంచం దిగకుండా అలానే పడుకోవాలని, తిండి మీద ధ్యాస లేకుండా, చీకటిలో అలానే ఉండాలని అనిపించేది.

 

పై పైన పనులు చేయడం, ఫోన్లు మాట్లాడటం ఇలా అన్నీ మామూలుగా చేస్తున్నా, లోపల మాత్రం బాలేదు. మనసుకున్న అంతులేని పొరల్లో కేవలం పైన పోర బాగుంది అనేలా ఉంది. మూడో రోజుకి విపరీతమైన తల పోటు, మైగ్రైన్ మొదలైంది. అమ్మకి ఏమి అర్ధమైందో తెలీదు కానీ, రాత్రి పది గంటలకు పక్కకి తిరిగి చూస్తే తను నా తల నిమురుతూ పక్కన పడుకొని ఉంది. అప్పుడు అనిపించింది, సుశాంత్ సింగ్ చేసింది మంచి పనా అని. ఆ ఆలోచనకి ఒళ్ళు జలదరించింది. Was he right? Did he do the right thing to get through the pain? ఆ తర్వాత రెండ్రోజులు అదే ఆలోచన.
నేను క్యాంపస్ లో సెలెక్ట్ అయ్యి, బీ టెక్ మూడో సంవత్సరం నుండి ట్రైనీ గా చేరి ఇక్కడ వరకు రావడానికి ఆరేళ్ళు పట్టింది. ఆరేళ్ళు కష్టం నాలుగు నిమిషాల్లో తుడిచేశారా? Where did the empathy go? We are social animals with emotions. We need to love, be loved, cared for. Do layoffs mean ruthlessness? Don’t people deserve a healthy ‘bye’? “We are connected in infinite ways with every single person we interact with. The love, the hate, the endless emotions are all part of us, a package that’s been together.”

 

83 మంది టీంలో నా చివరి మెయిల్ చూసి నలుగురు ఫోన్ చేసారు. ఎనిమిది మంది వాట్సాప్ మెసేజులు పెట్టారు. అంటే ఎంత ఎక్కువ కాల్ చేస్తే అంత గొప్ప అని కాదు. It’s never about numbers. Be it life or social media, it’s never ever quantity, but always quality. నాకు ఇంత మంది ఫాలోయింగ్ ఉంది అని సోషల్ మీడియా లో ఎవరైనా చెప్పుకుంటే వాళ్ళ మీద జాలేస్తుంది. అస్తమానం అక్కడే బ్రతకడం అంటే ఇల్లు, ఇంట్లో వారిని, నీ ఎదుగుదల అశ్రద్ధ చేస్తున్నట్టే అని ‘నా’ అనే మనిషి నాకు నేర్పిన పాఠం అది. టచ్ లో ఉన్న వాళ్ళని పరిస్థితులు బాగుపడ్డాక కలుస్తాము. కాదనుకున్న వారిని, “pleasure knowing them” అనుకుంటాం. కానీ, టీం అంటే కేవలం కలిసి పనిచేయడం కాదు కదా. “You are not a team because you work together. You are a team because you trust, respect, and care for each other.” – Vala Afshar.

 

ప్రాజెక్ట్ డెడ్లైన్ అంటే తిండి నిద్ర లేకుండా పని చేస్తాం కదా, అలానే, couldn’t the firm stretch for a decent lay off? A pink slip at least? ఇంట్లో పని వాళ్లని కూడా నాలుగు గంటల్లో పనిలో నుండి తీసేయము. ఈ లొక్డౌన్ లో నా ఫ్రెండ్స్ కి వెళ్తున్నాను అని సర్రిగా చెప్పలేకపోయాను. తర్వాత టచ్ లో ఉంటారు, ఉండకపోవచ్చు. అది వేరు. ఎవరింటికైనా ఫంక్షన్ కి వెళ్లి, నాకు టైం లేదని చెప్పా పెట్టకుండా వచ్చేసి, ఇంటికి వెళ్లి మెసేజ్ చేస్తా అంటే ఎలా ఉంటుంది? There has to be a dignity for a closure too. సినిమాలో ‘శుభం’ కార్డు వేస్తారు, లేకపోతే ఆర్టిస్టుల పేరులు వేస్తారు, ‘ది ఎండ్’ అని వేస్తారు… ఇవ్వన్నీ సినిమాకి ముగింపు అని మర్యాదగా చెప్పటం కోసమే.

 

ఇది కాకుండా తెలిసినవాళ్ళు పాఠాలు మొదలు పెట్టారు. “వదిలేయ్. నీకేం తినడానికి గతి లేకనా? జీవితంలో ముందుకు సాగాలి, ఎదగాలి అది ఇది అని. వాళ్ళ ప్రేమ అర్ధమైంది కానీ వాళ్ళ టైమింగ్ ఇబ్బంది పెట్టింది. The distress that one goes through while feeling helpless, not being able to do anything is beyond imagination. The vacuum sucks you in.
బాధలో ఉన్నప్పుడు సాయం చెయ్యాలని ఒక్కోసారి మనం ఎక్కువ చేస్తామేమో. దేనికైనా టైమింగ్ ముఖ్యం అంటారు కదా, అది దీనికి కూడా వర్తిస్తుంది. ఇబ్బంది చిన్నదైనా పెద్దదైనా అవతల వాళ్ళకి ఊపిరి ఆడనంతగా విసిగించకూడదు. అప్పుడప్పుడు కాల్ లేక మెసేజ్ చాలు. వాళ్ళకి ఇష్టమైతే మాట్లాడతారు, లేకపోతే ఇంకోసారి చూడచ్చు. ఆ టైంలో వాళ్ళు ఆలోచిస్తున్నారు ఏమో. జరిగింది జీర్ణించుకోవడానికి సమయం తీసుకుంటున్నారేమో. అంతే కాని వాళ్ళని పదే పదే విసికించి, వాళ్ళకన్నా ముందు మనం బాధ పడి, ఇది అంతా ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. లేకపోతే, I am always available for a call if you need to talk అని పెట్టకండి. నాకు తెలిసి బాధలో ఉన్న చాలా మంది ‘నన్ను పట్టించుకో’, ‘నేను బయటకి చెప్పుకోవాలి’ అని ముందు అడుగు వెయ్యరు, మీకు కాల్ చెయ్యరు, మెసేజ్లు పెట్టరు. Call them, text them, meet them, but the balance is important. ఎప్పుడూ హుషారుగా ఉండే అమ్మాయి ఏంటి తిరిగి రిప్లై ఇవ్వట్లేదని ఒకే ఒక ఫ్రెండ్ ‘ఏమైంది’ అని అడిగారు నన్ను. That is balance, giving people their space. The thing most people miss is, while thinking they are trying to help us, they themselves are trying to cure unhealed portions of their lives. నేను టైంకి కాల్స్ మాట్లాడట్లేదని, మెసేజ్లు రిప్లై ఇవ్వలేదని అలిగి వెళ్లిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు మాట్లాడటం తగ్గించావు కదా, అందుకే మేము మాట్లాడలేదు అని చెప్పిన వారూ ఉన్నారు. ‘Suffering is personal’ అంటారు కదా, అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. అది చిన్నదా, పెద్దదా అని కాదు. Pain is pain. Give them that freedom to go through it.

 

ఏదైనా సాధించాలంటే సహనం కావలి. సహనం అంటే కేవలం వేచి చూడటం కాదు. It is the ‘grace’ that you carry yourself with during the whole process. I chose grace. ఆ ఛాయస్ సులువుగా రాలేదు. నా లోపల రోజూ యుద్ధమే. రోజూ ఘర్షణే. ఏవేవో ఆలోచనలు వచ్చేవి. మన మనసు కంచె ఎంత గట్టిగా ఉంటే, చెడు ఆలోచనలు అంత దూరంగా ఉంటాయి. మీ నాన్న గారు మీకు నేర్పిన పాఠం ఏంటని సంవత్సరం క్రితం నా ట్విట్టర్ స్నేహితులు క్రిష్ణ మోహన్ గారు ఏదో కూతలో అడిగారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నిబ్బరంగా ఉండమని నేర్పారని జవ్వాబు ఇచ్చాను. ఇప్పుడూ అంతే.
ఆఫీస్ లాప్టాప్ తీసి పక్కన పెట్టి నా డెస్క్టాప్ సర్దుకున్నాను టేబుల్ మీద.పన్నెండో రోజు ఆఫీస్ వాళ్ళు వచ్చి లాప్టాప్ తీసుకెళ్లారు. బ్యాచ్ టాపర్ వి నీ ఉద్యోగం పోవడం ఏంటి అని నన్ను ఇంట్లో ఒక్కరు అడగలేదు. ఇంకోటి చూసుకో అని వత్తిడి చేయలేదు. నా తోటి వారిని ఉంచి నన్ను తీసేసారు అని బాధ నాకు లేదు. I am happy for them. ఇంతే మంది కాల్ చేశారు, ఇంతే మంది టచ్ లో ఉన్నారు అని దిగులు లేదు. మళ్ళీ ఉద్యోగం వస్తుంది. మళ్ళీ బిజీగా ఉంటుంది. ఉండనిదల్లా ఇక మీదట కార్పొరేట్ జీవితంలో ఎమోషన్స్. నాకు కష్టం వస్తే నాతో ఉంది ఇంట్లో వాళ్ళు, నేను నమ్మిన కార్పొరేట్ కాదు. You are replaceable for a firm, but you are irreplaceable for your family.

 

ఇప్పుడు కాస్త ఎక్కువ టైముంది. నాన్నకి బాబాయ్ కి బిజినెస్లో సాయం చేస్తున్నా. నానమ్మకి రోజూ అరగంట చదివే భగవద్గిత ఇప్పుడు గంట చదివి వినిపిస్తున్నా. డాన్స్ ప్రాక్టీస్ ఇంకో గంట పెంచాను.

 

పది రోజుల తర్వాత, రోజూ కంటే కేవలం పది నిమిషాలు ముందు రెడీ అయ్యాను. మా నాన్న దగ్గరకు వచ్చి, ఏమ్మా, ఏదైనా వీడియో ఇంటర్వ్యూ నా అని అడిగారు. అవునన్నట్టు తల ఊపాను. అప్పటి వరకు నేను ఇంట్లో ఉద్యోగం పోయిందని చెప్పింది లేదు, వాళ్ళు అడిగింది లేదు. అయినా సరే, కంప్యూటర్ ఉన్న గది వరకు వచ్చారు నాన్న నాతో. అక్కడ నిలబడ్డారు. నేను లాగిన్ అయ్యి, “Hi, good morning, my name is …..I am a Cyber Security professional…” అని చెప్తున్నా…నాన్న అక్కడ నుండి వెళ్లిపోయారు.
కూతురు సాధించగలదు అనే నమ్మకం వాళ్ళదైతే, ఏమైనా సరే వీళ్ళున్నారనే ధైర్యం నాది.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , ,