Hey Singles, Is God Really Busy Writing Your Love Story? A ‘Devudu Rasina Love Story’

 

Part-1

Part-2

కాని పెళ్ళికూతురు వాళ్ళింట్లో నేను ట్రైన్ లో కలిసిన అమ్మమ్మ కనిపించారు ఆమెని పలకరించే లోపు ట్రైన్ లో కలిసిన బాబు వాళ్ళ అమ్మ కనిపించారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళే లోపు ట్రైన్ కలిసిన చెల్లి ఎదురుపడింది. వాళ్ళందరిని పలకరించి ” మీరందరు ఒకటే కుటుంబమా?” అని అడిగాను. “అవును అన్నయ తను మా అమ్మమ్మ, తను మా వదిన , నేను పెళ్ళి కూతురు కజిన్ ని” అని అందరిని పరిచయం చేసింది. వీళ్ళందరిని కలిశా అన్న ఆనందం, రాధ ని కూడ మళ్ళి కలుస్తానేమో అని ఆశ ని కలిగించింది. ఈ సారి ” దేవుడా ఈ ట్విస్టులు ఏంటి కాస్త నా లైఫ్ లో నేను అనుకున్నది ఒక్కటైనా చేయ్యి ” అని ఎప్పటిలానే దేవుడిని భక్తి తో మందలించే లోపు కోటి దీప కాంతులు నా కళ్ళలో నింపుతూ రాధ ని పెళ్ళి కూతురు గా నా ముందు నిలబెట్టాడు. దేవుడికి వేల సార్లు థ్యాంక్స్ చెప్పుకుంటున్న కాని లోపల ఎన్నొ ప్రశ్నలు మెదిలాయ్… కొ-ఇన్సిడెన్స్ అంటే మరి ఈ రేంజ్ లో ఉంటుందా అని ఆలోచిస్తూ అప్పటి వరకు దించిన తలని పైకి ఎత్తి చూస్తే అక్కడ ఎవరూ లేరు… తను నేను తప్ప. ఇక ఆత్రం ఆపుకోలేకా “నేను ముందే తెలుసా మీకు?” అని అడిగా. “అవును తెలుసు మొదటి సారి మా బామ్మ ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు చూసా ఆరోజంతా తను మీ గురించే మాట్లడింది.. ఎఫ్.బి లో మీ ప్రొఫైల్ చూసాను ఆరోజు. చూడటానికి బాగున్నారు అనిపించింది.. తరువతా మా వదిన ని ట్రైన్ ఎక్కించడానికి వచ్చినప్పుడు చూశాను, మా చింటూ ని మీరు దగ్గరికి తీసుకోవడం గమనించా.. మంచివారనుకున్న తరువతా మా వదిన కూడ సర్టిఫై చేసింది.. మంచి వారని.. మీ పై ఎందుకో తెలీని ఆసక్తి కలిగింది.. మా కజిన్ ని మా అన్నయ పికప్ చేసుకున్నప్పుడు డ్రైవర్ సీట్ లో నేనే ఉన్నాను మీరు దగ్గరునుండి తనని అప్పగించడం చూసాను. తనకి మీరు చాలా ధైర్యం చెప్పారంటా కదా అది విన్న తరువతా ఇలాంటి అబ్బాయి నా లైఫ్ లో ఉంటే బాగుంటుంది అనిపించింది. కాని ప్రేమ పెళ్ళి ఇవి ఇద్దరు మనుషులకి కాదు రెండు కుటుంబాలకి సంబంధించిన విషయం అందుకని మా వదిన, బామ్మ సాయం తో, మాట్రిమొని ద్వారా మా అమ్మ నాన్న లని మీ అమ్మ నాన్నలతో మాట్లడించి ఈ పెళ్ళి చూపులు ఎర్పాటు చేశాను కాని ఎక్కడొ చిన్న సందేహం మీరెవరినైనా ప్రేమించారా అని అందుకే మీరు ఏ ట్రైన్ లో వస్తున్నారో కనుక్కుని మీ ఎదురు సీట్ ఎవరిదో అబ్బాయిదైతే తనని బతిమాలి మీ ఎదురుగా కుర్చున్నా… మీరు ఎవరిని ప్రేమించ లేదు అన్న విషయం తెలుసుకున్న. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే క్షమించండి కాని ఇలా పెళ్ళి చూపులకి ముందు ఆ పెళ్ళి కొడుకుని కలవాలి అన్నది నా ఫాంటసీ ” అని చెప్పింది..

తన మాటలు విన్న తరువాత ఆనందం ఎంత కలిగిందో, దెవుడి ముందు చూపు మీద అంతే అశ్చర్యం వేసింది. “నేను ప్రేమించే అమ్మాయి ని ట్రైన్ లో కుర్చోపెట్టు అని కోరుకుంటే నన్ను ప్రేమించే అమ్మాయి ని తన కన్న ముందు తన కుటుంబాని నాకు ట్రైన్ లో పరిచయం చేసి.. నా వెనుకా నాకో అద్భుతమైనా ప్రేమ కథను రాసవా!! ప్రేమ తో పాటు మంచి కుటుంబాన్ని అందిచావా దేవుడా. నేను నిన్ను అన్నవేమి పట్టించుకోకు. అయినా నువ్వు పట్టించుకోవులే ఎందుకంటే నువ్వు నా మంచి దేవుడివి” అని నా లైఫ్ లో దేవుడు చేసిన మాయకి శతకోటి కృతఙతలు చెప్పుకుని, రాధతో “నిన్న మీరు వెళ్ళేముందు మీకు చెప్పాలి అనుకున్న మాట. ఈరోజు మీరు కనిపించిన వెంటనే చెప్పాలి అనుకున్న మాట. ఎన్నో ఏళ్ళ నుండి ఈ క్షణం కోసం నాలో నిరిక్షిస్తున్న మాట.. ఐ లవ్ యు మీరు ఒప్పుకుంటే పెళ్ళి చేసుకుందాం. ఇక మీదట మీరు మేము అన్న పదాలు మన మధ్య ఉండవు మనం అనే పదమే ఉంటుంది.” అని చెప్పాను. తను మౌనంగా అంగీకరిస్తూ.. సిగ్గు పడుతుంటే మా అమ్మ నాన్నలు దూరం నుండి మా ఆనందాన్ని చూస్తు మురిసిపోయారు.

దేవుడి సంగతి అంటారా..
“He may be busy in writing another love story”.

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: , ,