‘Guitar Rao’ – The Incredible Man In Hyd Who Teaches Music For Just ₹1

 

ఉన్నది ఒక్కటే జన్మ మరొకసారి ఇక్కడికి వస్తామో లేదో తెలియదు అంతెందుకండి మరో క్షణం మనం బ్రతికే ఉంటామని కూడా గ్యారెంటీ కూడా ఇవ్వలేము.. ప్రతి ఒక్క మనిషిలోనూ సమాజంపై ప్రేమ చూపించే మనిషుంటాడు కాని రకరకాల కారణాల వల్ల ఆగిపోతుంటారు.. అన్ని దాటుకుని సమాజం ప్రేమ కురిపించేవారు చాలా అరుదు అలాంటి వ్యక్తులలో ఎన్. వేంకటేశ్వర రావు గారు ఒకరు..


ఒక గిటార్, ఫ్లూట్ మొదలైన Music Instruments బ్యాగ్ లో పెట్టుకుని సంగీతం నేర్పిస్తానని అని చెప్పి తిరుగుతంటే ఏదో బ్రతకడం కోసం ఇలా చేస్తున్నారని చాలామంది అనుకున్నారు కాని రావు గారి లక్ష్యం వేరు. ఒంగోలు జిల్లాకు చెందిన వేంకటేశ్వరరావు రావు చదువు రీత్యా తిరుపతిలో, ఉద్యోగ రీత్యా బెంగుళూర్, తమిళనాడులో గడిపారు. ఆరోజుల్లోనే సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేసి అత్యున్నత సంస్థలలో పనిచేసి లక్షల్లో జీతం అందుకున్నారు. ఎంత జీతం అందుకున్నా గాని అది శరీరానికి సంతృప్తినిస్తుందేమో కాని మన హృదయానికి కాదు. సంగీతానికి భాష లేదు అది ఎల్లలు లేనిది ధ్వని తరంగాలతో మన చెవి నుండి హృదయానికి చేరి అనిర్వచనీయమైన ఆనందానికి గురిచేస్తుంది. “కేవలం వినడం వరకు మాత్రమే కాదు వారు పలికించగలగాలి వారు మరికొంతమందికి నేర్పించగలగాలి అనే ఆకాంశతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ మార్గంలో ప్రయాణిస్తున్నారు”.


రావు గారికి ఇద్దరు కుమార్తెలు. ఒక కూతురికి బ్లైండ్ ఐనా గాని ఓ కన్నడ సినిమాలో నటించి జాతీయ ఉత్తమ అవార్డును అందుకున్నారు. ఒక ఉద్యోగం నుండి మరో ఉద్యోగానికి మారితేనే కుటుంబంలో సవాలక్ష సందేహాలస్తాయి అలాంటిది ఏకంగా ఉద్యోగానికి రాజీనామా చేసి వీది వీది తిరుగుతూ సంగీతం నేర్పిస్తానంటే ఆ కుటుంబంలో ఏ స్థాయిలో చర్చ జరిగి ఉంటుందో అంచనా వేసుకోవచ్చు..మరే సమస్యలు రాకుండా రావు గారు పూర్తిగా కుటుంబానికి ఆర్ధికంగా ఏ ఇబ్బందులు లేకుండా అన్ని విధాలా పంపకాలు జరిపి తను కలలు కన్నా ఆశయాన్ని చేరుకున్నారు.


“చాలామంది తల్లిదండ్రులు తాము నేర్చుకోలేని సంగీతాన్ని తమ పిల్లలు నేర్చుకోవాలని వారికి ఇష్టంలేకపోయినా గాని వారిపై రుద్దడానికి సిద్ధపడుతుంటారు. ఇక నుండి అలాంటి తల్లిదండ్రులు నా దగ్గరికి రావచ్చు” – గిటార్ రావు

మిగిలిన సంగీత గురువులు ఉదయాన్నే చక్కగా రెడి అయ్యి స్టూడియో దగ్గరికి వెలితే, రావు గారు మాత్రం బ్యాగ్ నిండా సంగీత వాయిద్య పరికరాలను భుజానికి తగిలించుకుని కే.బి.ఆర్ పార్క్, కృష్ణకాంత్ పార్క్, రవీంద్ర భారతి, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాలలోని సంగీతం నేర్చుకోవాలనే ఔత్సాహికుల దగ్గరికి చేరుకుంటారు. కేవలం సంగీతం విషయంలో మాత్రమే కాదు ఎవరైనా ప్రేమతో ఫీజు ఎక్కువ ఇచ్చినా కాని దానిని అనాథాశ్రమాలకు అందిస్తారు. ఇక తన దగ్గర నేర్చుకునే వారిలో సామాన్యులు, యువకులు మాత్రమే కాదు కొంతమంది టీవి నటులు, 70 సంవత్సరాలు పైబడిన వృద్ధులు ఇలాంటి రకరకాల వర్గాల వారున్నారు. 2014 నుండి సాగిస్తున్న ఈ ప్రస్థానంలో ప్రతిరోజు సుమారు 100కి పైగా ఔత్సాహికులను కలుసుకుంటూ ఇప్పటికి లక్షమందికి పైగా శిక్షణ అందించారు.

రావు గారు సంగీతాన్ని నేర్పించాడికి ఏ ఇంటిని తీసుకోలేదు ఔత్సాహికులు ఎక్కడ ఉంటే అక్కడికే చేరుకుని తనకు తెలిసిన విద్యను అందిస్తారు. సంగీతాన్ని నేర్పించడానికి మిగిలిన చోట వందల్లో, వేలల్లో వసూలు చేస్తే రావు గారు మాత్రం కేవలం రోజుకు ఒక్క రూపాయి మాత్రమే వసూలు చేస్తారు. ప్రస్తుత కాలంలో “ఫ్రీ” అంటే దానికి ఏ మాత్రం విలువ ఉండదు, ఆసక్తి కూడా అంతగా ఉండదు అందుకే ఆ మాత్రం ఫీజు వసూలు చేస్తానని చెబుతుంటారు.


మీరు రావు గారి దగ్గర సంగీతాన్ని నేర్చుకోవలంటే ఈ నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు 81 79 673522 (Message and WhatsApp Only)

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , ,