This Short Note On How Media Sensationalizes Unwanted News Is Spot On

 

యాచకులు, యాచకులు..
గుడి మెట్ల దగ్గర కాదు..
ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గరా కాదు..
మన ఇంట్లో ఉంటారు, టీవీ లలో వస్తుంటారు

TRP కి బానిసలు
మెరుగైన సమాజం కోసం, ప్రజల విజ్ఞానం కోసం అంటూనే..
అవసరమైన కథలను మరుగున పడేసి , అఙ్ఞానిని తెచ్చి జ్ఞానిని చేస్తారు.

వార్తలు తక్కువ , వాదనలు ఎక్కువ.
కాంట్రవర్సీలంటే ఎంతో మక్కువ .

కత్తి కన్నా కలం గొప్పదంటూనే..
ఆ ‘కత్తి’ తో వ్యక్తుల్ని వ్యవస్థల్ని టార్గెట్ చేస్తుంటారు .

నిశీధిలో ఉన్న నిజాన్ని వెలుగులోకి తీసుకొస్తామంటూనే …
వెలుగులో ఉన్న అబద్ధాన్ని నిజం చేసేస్తారు.

వదంతులు సృష్టిస్తారు,
జీవితాలను బ్రష్టు పట్టిస్తారు.

బూతంటే ముద్దు ,
ముద్దంటే బూతు.

ఉన్నది ఉన్నట్టు చెప్తామంటూ ..
ఉన్నవారి ఉంపుడుగత్తెలుగా ..
రాజకీయం అనే చదరంగం లో పాలకుల పావులుగా మారుతున్నారు.

నైతిక ప్రవర్తన లేకుండా నమ్మిన నీతిని అమ్ముకుని ,
సమాచారం పేరుతో వ్యాపారం చేస్తున్నారు.

ఇప్పటికైనా ‘దురాశ దుఃఖానికి చేటు‘ అనే సామెతను అర్ధం చేసుకుంటే బాగుపడతారు.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , , , , ,