7 Great Quotes From The Pen of Deva Katta For Prasthanam!

1) మనిషి నేల మీద రాలిన నుంచి చచ్చేదాక నిప్పులా మండుతూనే ఉంటాడు, ఆకలితో మండుతాడు, కోపంతో మండుతాడు, కోరికతో, ఈర్ష్యతో మండుతూనే వుంటాడు. ఆ మంటతో కొందరు ముట్టుకున్నవస్తువులనల్ల తగలపెడుతూ మండే సుడిగుండాల్లా ఎదుగుతారు , మరికొందరు అదే మంటతో జ్ఞానాన్ని వెతుక్కుంటూ లోకానికి దారి చూపే దీపాలల ఎదుగుతారు!

2) రాజకీయం పులి మీద సవారి లాంటిది, ఒక్కసారి ఎక్కితే మళ్లి ఎక్కలేము, ప్రాణాలతో మిగలం!

3) మనిషి చరిత్రే అన్నదమ్ముల యుద్ధంతో మొదలయింది, సెంచరీలగా ఆయుధాలు మారినా.. యుద్ధాలు మారలేదు!

4) స్వార్ధమే మనిషి అసలు లక్షణం, నిస్వార్ధం దానిని కాచే కవచం!

5) ఆశ ముసిరినప్పుడు ఆలోచన మసక బారుతుంది, నీతి నిజాయితీలు కొలిమిలో కొవ్వోతిలా కరిగిపోతాయి

6) నాయకత్వం అనేది పుట్టుకతొ వచ్చె లక్షణం

7) కాలగర్భం లో చీకటి వెలుతురులా మనిషిలొ మంచి చెడు ఎప్పుడూ పోరాడుతూనె ఉంటాయి. ఆ తీరని పోరాటామె ఈ మానవ ప్రస్థానం

If you wish to contribute, mail us at admin@chaibisket.com