This Old Woman’s Sorrowful Tale Of Domestic Abuse Will Bring Tears To Your Eyes!

ఆకలిగా ఉందా… ఐతే నా లద్దె(Latrine) తినవే…! ఈ మాట అత్త కోడలితో అనలేదు, కోడలు అత్తతో అనలేదు కన్నకూతురు తన కన్నతల్లితో అన్నమాటలు.. సూటి పోటి మాటలే కాదు శరీరానికి రక్తం కారేల 75 సంవత్సరాల తల్లిపై దాడిచేస్తు కూతురు అల్లుడూ కలిసి విపరీతంగ చిత్రహింసలకు గురి చేసేవారు. మానవ సంబందాలు, మానవ విలువలు మంట గలుస్తున్న నేటి ప్రపంచంలో కన్న కూతురిపై తల్లి గెలిచిన యధార్ధ కథ ఇది

1

‘గోదారి’ చిన్నప్పుడే తల్లిని కోల్పోయింది సవతి తల్లి కనుసన్నల్లో క్రమశిక్షణతో పెరిగింది.. ఉన్నత చదువులు చదివి టీచర్ గా భారతదేశాన్ని నిర్మించే ఎంతోమంది గొప్ప పౌరులను ఈ దేశానికి తన భోదనల ద్వారా అందించింది. మంచి మనిషిని పెళ్ళి ద్వారా తన జీవితంలోకి ఆహ్వానించింది కాని చేసుకున్న కొన్ని సంవత్సరాలకే భర్త చనిపోయారు వారికి కలిగిన కూతురునే ఎన్నో కష్టాలను అనుభవించి ఎంతో అల్లారు ముద్దుగా పెంచి బి.యి.డి లాంటి ఉన్నత విద్యను అందించింది.. పండిత పుత్రా పరమ శుంఠ అన్నట్టుగా ఆ కూతురు ఒక పాన్ డబ్బా నడిపే వ్యక్తిని పెళ్ళిచేసుకుంది మొదట గోదారి వ్యతిరేకించిన కూతురు అల్లుడూ బాగుండాలని కోరుకుంది.

5
3

వరంగల్ జిల్లా మహబూబాబాద్ లో విద్యార్ధుల నుండి గౌరవ, సత్కరాలతో విరమణ పొందింది. ఉపాధ్యాయురాలుగా తన రిటైర్ మెంట్ డబ్బులతో హైదరాబాద్ కొత్తపేటలో కొనుకున్న అపార్ట్ మెంట్ లోనే తన మిగిలిన జీవితాన్ని గడపాలని నిశ్చయించుకుంది కొన్నాళ్ళ తరువాత కూతురు అల్లుడు వచ్చి అందరం వేరే చోట్ల ఎందుకు ఉండటం..! అని ఒకే చోట ఉందామని గోదారి ఇంట్లోకి వచ్చేశారు ఇక అప్పుడు మొదలైంది అసలు కథ. చిన్నప్పుడే తల్లి పోయింది, పెళ్ళి చేసుకున్న భర్త కొన్ని సంవత్సరాలకే పోయారు అప్పటి నుండి తను ఎదుర్కున్న ఒంటరి తనన్ని ఒదిలేసి కూతురు అల్లుడు రూపంలో సంతోషాన్ని పొందుదామని ఆశించింది పాపం ఆ 75ఏళ్ళ పిచ్చితల్లి..

4

ప్రతిరోజు ఏవో సూటి పోటి మాటలు, చెప్పు దెబ్బలు, కూతురు అల్లుడూ ఎప్పుడైన ఊరు వెళితే గోదారిని ఇంట్లోనే పెట్టి తాళం వేసి వెళ్ళెవారు వారు ఎప్పుడో ఒక వారం తర్వాత వచ్చేవారు.. సమయం సందర్భం లేకుండా అద్రరాత్రి లేపి కన్నతల్లితో లాట్రీన్ శుభ్రం చేయించెవారు బ్రష్ తో చేస్తుంటే బ్రష్ తో వద్దు సరిగ్గా శుబ్రం కాదు అని చేతితో కడిగించెవారు. నాకు బ్రడ్ తినలని ఉండదు అని చెత్తబుట్టలో పారెస్తే ఆ చెత్త బుట్టలో పారేసిన బ్రడ్ నే బలవంతంగా తినిపించేవారు.. అత్తమ్మ అందులోను వృద్ధురాలు అనే సంస్కారం లేకుండా అల్లుడు కొట్టేవాడు ఇదే విషయాన్ని కూతురికి చెబితే అవునా అని ఇంకో నాలుగు ఈమె కూడా తన్నేది. ప్రతిరోజు ఇలాంటి చిత్రహింసలకు ఏడుస్తుంటే చుట్టుపక్కల వారు విని అడిగితే మా అమ్మకు పిచ్చిపట్టింది అని చెప్పేవారు.. తిట్లు తన్నుడు లాంటి కార్యక్రమాల తర్వాత కూతురు ఇంట్లో దేవతా మూర్తిలా నిలబడితే గోదారిని తన చుట్టు తిరిగి తప్పాయింది క్షమించు అని ప్రాధేయపడి కూతురు కాళ్ళమీద పడి మొక్కితే అప్పుడు వదిలేసేది! టీచర్ గా రిటైర్ మెంట్ తర్వాత నెల నెల గోదారికి వచ్చె 40,000 పెన్షన్ కూతురు అల్లుడు కాజేసేవారు ఇలా 7 నెలలు మానసికంగా శరీరకంగా మాటల్లో వర్ణించలేని భయంకరమైన చిత్రహింసలు అనుభవించింది

2

ఒకరోజు వారిని ఏమారిచి తప్పించుకొని ఆ అపార్ట్ మెంట్ లోని వేరే ఫ్లాట్ లోకి వెళ్ళి జరిగినదంతా చెప్పి విలపించింది. ఆ ఫ్లాట్ లోని కొంత మంది వ్యక్తులతో పరిచయాలున్న వాసిరెడ్డి వేణుగోపాల్ (జర్నలిస్టు) అనే వ్యక్తి ప్రోద్భలంతో న్యాయపోరాటం చేసింది.. ఒక కంప్లైంట్ ఇస్తే కూతురు అల్లుడు జైల్ లో ఉంటారు అని తెలిసినా కన్నపేగు బంధం తనని ఆపింది.. తన ఫ్లాటు, పెన్షన్ వచ్చే బ్యాంక్ పుస్తకాలు మాత్రమే తనకు ఇప్పించండి అంటూ పోరాటం చేసింది అలా సోషల్ మీడియా ఫేస్ బుక్ వేదికగా వేణుగోపాల్ చేసిన పోరాటానికి ఉన్నతాధికారులు పోలీసుల సహకారంతో 75 సంవత్సరాల గోదారి కూతురు అల్లుడిపై ఏ విధమైన కేసులు పెట్టకుండా తన ఆస్థులను స్వాధీనం చేసుకుంది. నిజంగా గోదారి చుట్టు ఎంతమంది ఉన్న ఎందరిలో ఉన్న తనకు తాను ఎప్పటికి ఒంటరే ఇప్పటికైనా తాను కోరుకున్న ప్రశాంత జీవనం గడపాలని ఆశిద్దాం.

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , ,