The Story Of This Housewife Who Turned Into An Entrepreneur Will Inspire You!
పెళ్ళి ఒక పురుషుని జీవితంలో అంతగా పెను మార్పులు తీసుకురాకపోవచ్చు కాని ఒక మహిళ విషయంలో మాత్రం ఖచ్చితంగా తీసుకువస్తుంది. మంచి టాలెంట్ ఉన్న చాలా మంది మహిళలు తమ జీవితాన్ని పెళ్ళి తర్వాత భర్త, పిల్లల కోసం త్యాగం చేస్తుంటారు. పెళ్ళి తర్వాత తమ అభిరుచులను ఆచరణలో పెట్టాలని ప్రయత్నించిన కూడా చాలా మంది మహిళలకు అది కష్టతరం అవుతుంది. ఆ కష్టపు మలుపును దాటి గమ్యాన్ని చేరుకునే వివాహితులు కొంతమందే ఉంటారు.. మన విశాఖపట్నానికి చెందిన యజ్ఞ ప్రియ గారు కూడా ఆ కోవకు చెందినవారే..
కొన్నిసార్లు మన హాబీస్ యే మన జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాయి.. అవ్వే మనకు సంపదను తీసుకువస్తాయి. ఇష్టపడి చేసే పనులలో కష్టం తెలియదు అన్నట్టుగా తనకు ఏదురైన కష్టాలను ఎదుర్కుని లక్ష్యాన్ని ధైర్యంగా సాధించారు యజ్ఞ ప్రియ. ఇందుకోసం తన సోదరితో పాటు మరి కొంతమందితో ఒక గ్రూప్ గా ఏర్పడి “జ్ఞాపిక క్రాఫ్ట్స్” ను స్థాపించారు. Designing paper bags, wall hangings, gift baskets, chocolate boxes, jewelry లాంటి చేతివృత్తుల ద్వారా అతి తక్కువ పెట్టుబడితో ఇంట్లోనే ఖాళీ సమయాలలో క్రాఫ్ట్స్ తయారుచేస్తు ఎంతో ఆదాయాన్ని పొందుతున్నారు యజ్ఞ ప్రియ గారు.
ఈ క్రాఫ్ట్స్ తయారుచేసేందుకు అవసరమయ్యే ముడి సరుకు మన తెలుగురాష్ట్రాలలో అంతగా లేకపోవడంతో యజ్ఞ ప్రియ కలకత్తా, సూరత్ నుండి సరుకును దిగుమతి చేసుకుని ఇక్కడి మహిళల అభిరుచులకు తగ్గట్టుగా క్రాఫ్ట్స్ తయారు చేయడంలో నిష్ణాతులయ్యారు. ఇంట్లోనే ఉంటు తమ పనులను చూసుకుంటూ ఇలాంటి మంచి జ్ఞాపకాన్ని అందించే క్రాఫ్ట్స్ తయారుచేస్తూ ఆన్ లైన్ లో అమ్మకాలు సాగిస్తున్నారు. మనం ఒక కొత్తదారిని ఎంచుకుని సక్సెస్ సాధిస్తే అదే దారిని నమ్ముకొని ఎంతోమంది ముందుకొస్తారు ఇప్పుడు ఇలాంటి అభిరుచి ఉన్న మహిళలు యజ్ఞ ప్రియను చూసి ముందుకొస్తున్నారు నిజంగా ఇది అభినందించాల్సిన విషయం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.
If you wish to contribute, mail us at admin@chaibisket.com