This Store In Hyderabad Is A Heaven For ‘Plant Lovers’ With Quirky & Cute Designs

 

ఈ మధ్య ఇంటి అందం కోసం హోమ్ డెకరేటింగ్ ఐటమ్స్ మరింత పెరిగిపోయాయి.. ఎంత కాస్ట్లీ ఐనా వాటిలో జీవం ఉండదు.. జీవం లేకపోవడంతో వాటిలో ఏ అందం వర్ధిల్లదు. ప్రతి ఇంటికి ఒక పెరడు ఉంటే చాలా బాగుంటుంది.. ఇంట్లోకి బంధువులు వచ్చేటప్పుడు దారికిరువైపుల పూల మొక్కలుంటే ఎంత బాగుంటుంది, ఒక్కసారి ఊహించుకోండి.. “బాగుంటుంది మాకు ఖాళీ స్థలం ఉంటే ఇంకా బాగుంటుంది” అని అనుకుంటున్నారా.. హైదరాబాద్ కు చెందిన గుంజన్ డొమింగో గారికి ఇదే ఆలోచన వచ్చింది.. మొక్కలు పెంచడానికి ఖాళీ స్థలం అవసరం లేదు, జీవం లేని హోమ్ డెకరేటింగ్ ఐటమ్స్ స్థానంలోనే మొక్కలను పెంచుతూ “పౌద్ సే యారి” అనే నూతన స్టార్టప్ మొదలుపెట్టారు గుంజన్ గారు..


మొక్కలను పెంచడం కోసం ప్రత్యేకంగా కుండీలు అవసరం లేదు.. పాడై పోయిన టైర్లు, వేసుకోని జీన్స్, ఇతర చిన్న చిన్న వస్తువులను అందంగా ఉపయోగకరంగా రీసైకిల్ చేసి వాటినే కుండీలుగా మార్చేస్తుంటారు. ఇప్పుడు మీరు ఆశ్చర్యంతో చూడబోయే ప్రతి ఒక్క ఆకృతులు “పౌద్ సే యారి” రూపొందించినవే.. ఇంత మైమరుపుగా రావడానికి గల ప్రధాన కారణం గుంజన్ గారు ప్రకృతి ప్రేమికురాలు కావడం. ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుండగానే తనకు ఈ ఆలోచన వచ్చింది. మొక్కల పెంపకం, మొక్కలలోని రకాలు, ఇంట్లో పెంచేవి, ఇంటి బయట ఎండలో పెరిగేవి ఇలా మొక్కల గురుంచి పూర్తిగా రీసెర్చ్ చేశాక అడుగు ముందుకు వేశారు.



మామూలు కుండీలలో మొక్కలు పెంచడం రొటీన్ వాటిని అతిథులు కాసేపే చూస్తారు, అదే ప్రత్యేకంగా తయారుచేసిన కుండీలలో పెంచితేనే కదా ప్రత్యేకత. ప్రతి ఇంట్లో పనికిరాని వస్తువులుంటాయి వాటర్ బాటిల్లు, గాజు పాత్రలు, డ్రమ్ములు, ప్లాస్టిక్ వస్తువులు, చివరికి కవర్లు కూడా కుండీలకు అనుకులమే మీ దగ్గర ఉన్నవి లేదంటే పౌద్ సే యార్ వారు ప్రత్యేకంగా తయారుచేస్తారు. ఇందుకోసం సుమారు 150 రకాల మొక్కలను ఉపయోగిస్తున్నారు, ఇందులో మన ఇండియాలో దొరికేవి విదేశాలలో దొరికేవి ఉన్నాయి.




హాల్ లో, కిచెన్ లో, బెడ్ రూమ్ లో ఇలా ప్రతి ఒక్క గదికి అక్కడి పరిస్థితులకు, అక్కడి వైశాల్యానికి తగ్గట్టుగా డిజైన్ చేస్తారు. ఓసారి హీరో వెంకటేష్ గారు కార్లో వెళ్తూ వెళ్తూ సడెన్ గా భిన్నమైన కుండీలతో నిర్మితమైన ఈ స్టోర్ ను చూసారట. అరె భలేగా ఉందే అని లోపలికి వచ్చి చూశారట. విపరీతంగా నచ్చడంతో మా ఇంట్లోనూ చెయ్యమని అడిగి ప్రత్యేకంగా అభిరుచికి తగ్గట్టుగా చేయించుకుని, రామానాయుడు స్టూడియోలో ఎగ్జిబిషన్ కూడా పెట్టించారట.




Have a look at their website here.

Contact Number: 9705733222

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: , , , , , , ,