Characteristic Traits We Should Learn From Lord Ganesha To Become A Better Person In Life

 

మనం పిల్లలంగా ఉన్నప్పుడు మొదట నేర్చుకున్న శ్లోకం వినాయకునిదే. “శుక్లాం బరధరం విష్ణుం” అని చిన్నప్పుడు వచ్చి రాని మాటలతో మనం శ్లోకాన్ని చెప్పుతుంటే మన అమ్మ నాన్నలే కాదు, ఆ స్వామి కుడా మురిసిపోయుంటారు. మన చిన్నపట్ట్నుండి, వినాయక చవితి నాడు, మన తాత, అమ్మమ్మ ల దగ్గర ఆయన కథలు వింటూనే ఉంటాం. కాబట్టి మనకే తెలీకుండా ఆయన ప్రభావం మనపై ఉంటుంది. ఒక ఉద్యోగి ఎలా పని చేయాలి, ఎలా ఆలోచించాలి, నాయకుడిలా ఎలా ఎదగాలి అనే అంశాలని ఆయన కథల నుండి నేర్చుకోవచ్చు.

1. నిజాయితీ – Honesty

పార్వతి దేవి నలుగు పిండి తో ఒక బాలుడు రూపం చేసి ఆ రూపానికి ప్రాణం పోసి తన ద్వారమందు ఎవరిని లోపలికి రాకుండా చూడమని కాపలా గా పెట్టింది. పరమేశ్వరుడే వచ్చిన నిజాయితిగా నిబద్ధత తో ఆ బాలుడు తనకి అప్పగించిన పనిని చేసాడు. కాబట్టే మొదట శివుడు ఆగ్రహం తో అతని శిరస్సు ని ఖండించిన, ఆ తరువాత నిజం తెలిశాక అతనిని గజాననుడిని చేసి తన గణములకు అధిపతిని చేసారు. అలాగే మనకి చెప్పిన పని పూర్తి నిజాయితి తో నిబద్ధత తో చేస్తే మొదట్లో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు మన పైవారు మనల్ని అపార్థం చేసుకోవచ్చు కాని ఆ లక్షణం నీ లక్ష్యానికి చేరుస్తుంది నిన్ను అపార్థం చేసుకున్న వారు కోపగించుకునే వారు సైతం నిన్ను అనుసరిస్తారు.

2. ఆత్మవిశ్వాసం – Self Confidence

గజ ముఖం, ఎలుక వాహనం కాని ఎనలేని ఆత్మ విశ్వాసం. అదే వినాయకుని బలాలు. తను ఏనాడు తనని తక్కువ చేసుకోలేదు. తనకున్న వాటి తో తనకిచ్చిన పనిని ఎలా చేయాలి అని మాత్రమే ఆలోచించారు. అందుకే తనని తక్కువ అంచనా వేసిన చంద్రుడు , కుబేరుడు, ముషికుడు, ఆయన ముందు ఓడిపోయి అనుచరులు అయ్యారు. మనమెలా ఉన్న, మన మీద మనకు నమ్మకం ఉండాలి. చేయాలి అనుకున్నది చేయాలి.
మన దగ్గర లేని వాటి గురించి ఆలోచిస్తూ మన బలాలని సైతం బలహినతలని చేసుకుంటున్నాం మన లో నాయకుడి ని మనమే అణిచేస్తున్నాం.

3. సమయస్ఫూర్తి – Lateral Thinking

సమస్య కి సమాధానాన్ని మనం ఎప్పుడు ఒకే కోణం లో చూస్తాం. ప్రశ్న లోనే బదులు ఉంటుంది వెతకాలి అంతే. ఒకవేళ సమాధానం తోచనప్పుడు, అనుభవజ్ఞులని సంప్రదించడం లో తప్పు లేదు. తనకి తెలిసిన దానిని నలుగురికి చెపుతూ తనకి తెలీని దానిని నలుగురి నుండి నేర్చుకోవడమే నాయకుని లక్షణం. శివుడు, తన పుత్రులలో ప్రథమ పూజలు అందుకునే వారిని ఎన్నుకోవడానికి లోకాన్ని చుట్టి అన్ని పుణ్య తీర్థాలలో స్నానమాచరించి ఇంకొకరికంటే మొదట ఇక్కడికి చేరుకోవాలని పరీక్ష పెడతారు. కార్తికేయుకుడు చురుకైన వాడు నెమలి అతని వాహనం కాని వినాయకుడు తన ఎలుక తో ఎలా కార్తికేయుడిని వేగాన్ని అందుకోగలడు ఈ సమస్య ఉపాయం కోసం పండితుడైన నారదుని సూచనని తీసుకుంటారు. ఆయన చెప్పినట్టు సకల లోకాలని జలరాశులని తనలో దాచుకున్న తన తల్లి
తండ్రులగు పార్వతి పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణములు చేసి తన సోదరుని కన్నా అన్ని చోట్ల ముందే ఉంటాడు సకల కార్యాలకు ప్రధమ పూజలు అందుకునే విఘ్నాధిపతి అవుతాడు.

మనం మార్కులు తక్కువోస్తాయేమో పాస్ అవ్వమేమో అని భయపడి చదువుతాం కాని చదివింది మన జీవితం లో ఎక్కడో ఒక చోట మనకి ఉపయోగ పడుతుంది. అలాగే వినాయక చవితి నాడు చంద్రుడ్ని చూసిన దోషం రాకుడదని వ్రతాన్ని చేసి కథని చదువుతాం కనీసం వింటాం. అలా ఆయన కథలో సారాన్ని,ఆయనలోని గుణాన్ని మనలో నింపుకుంటాం. మనలోని నాయకుడున్నాడు, కొంచెం మంచికి, ఆత్మవిశ్వాసం తో, నిజాయితిగా ఉపయోగిస్తే అతడు వినాయకుడు అవుతాడు.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , ,