9 Things We Can Totally Relate To If We Are The Organisers Of Vinayaka Mandapams In Our Area!

 

పండుగలంటే అందరూ కలిసి సంతోషంగా జరుపుకునే వేడుక. దాదాపుగా అన్ని పండగలని ఇంట్లో వాళ్ళతోనే జరుపుకుంటాం. కానీ నవరాత్రి ఉత్సవాలు,అందులోను వినాయక నవరాత్రులప్పుడు మాత్రం మనం ఇంట్లో కంటే వినాయక మంటపంలోనే ఎక్కువ ఉంటాం. ఇక మన కాలనీ/ఏరియాలో వినాయక నవరాత్రులకి నిర్వాహకులం మనమే అయితే మన హడావిడి మాములుగా ఉండదు. మనలాంటి వాళ్ళ గురించే ఈ ఆర్టికల్..

 

1. Preparations – Plannings
అందరికీ నవరాత్రలు తొమ్మిది రోజులే కానీ మనకి మాత్రం నెల రోజుల ముందు నుండే ఆ festive atmosphere మొదలవుతుంది . ప్లాన్నింగ్స్ ,ఎంత ఎత్తు విగ్రహం పెట్టాలి,డబ్బులు ఎంత కావాలి,ఖర్చులు ఏమిటి ,మంటపానికి లైటింగ్స్ ఎలా పెట్టాలి,సౌండ్ బాక్సలు ఎక్కడ ఫిక్స్ చేయాలి ఇలా రోజూ సాయంత్రం మన హై లెవెల్ కమిటి తో మీటింగ్స్ ఉంటూనే ఉంటాయి

GIF by Gifskey.com

2.Collecting Chandas/Donations
ప్లానింగ్స్ అయిపోయాక చేయాల్సిన మొదటి పని,చందాల కోసం ఇంటింటికీ తిరగడం.ఎన్నికలప్పుడు నాయకులూ కూడా మనం తిరిగినంత తిరిగరు . చందా ఇంత ఇవ్వమని అడగలేము. ఎంత ఇస్తే అంతే తీసుకోవాలి,ఇంట్లో వాళ్ళు లేకుంటే మళ్ళి వెళ్ళాలి,అందరికి రసీదులు ఇవ్వాలి. ఆ చందాలన్నీ లెక్క చేసి జాగ్రత్తగా వాడాలి. తక్కువైతే మనమే డబ్బు సర్దాలి .

GIF by Gifskey.com

3.Selecting Ganesh Idol
చందాలు సేకరించాక చేయాల్సింది విగ్రహం కోసం బయల్దేరడం . కొందరు ముందే ఆర్డర్ ఇచ్చి వినాయక విగ్రహం చేయించుకుంటారు. మరికొందరు ఉన్నవాటిల్లోంచి ఒక విగ్రహాన్ని తీసుకుంటారు . ఇదివరకు ఓ పోటీ ఉండేది, పక్క కాలనీ వాళ్ళ విగ్రహం కంటే మనదే ఎక్కువ ఎత్తులో ఉండాలి,మన విగ్రహమే హైలైట్ అవ్వాలి అనే పోటీ ఉండేది. ఇప్పుడు ఆ పోటీ కాస్త తగ్గింది అనుకోండి. ఇప్పుడు మట్టి వినాయకుడి విగ్రహం పెట్టడమే ఉత్తమంఅనే ఆలోచనలోనే అందరూ ఉన్నారు .ఆ విగ్రహంతోనే ఎన్నో రూపాల్లో విగ్రహాలు వస్తున్నాయ్ కాబట్టి పెద్దగా వేరే మంటపాల వాళ్ళతో పోటీ ఏమి లేదు.

GIF by Gifskey.com

4.Decoration of Mandapam
ఇక వినాయక చవితికి రెండు రోజులముందు నుండే మంటపానికి అలంకారాలు చేయడం,సీరియల్ లైట్స్ తో లైటింగ్ సెట్ చేయడం,కొత్త కొత్త డెకొరేషన్స్ చేయించడం. భక్తి భావన కలిగేలా మంటపాన్ని రూపొందించడం లోనే టైం అంతా గడిచి పోతుంది.

GIF by Gifskey.com

5.Preparing Daily Schedule for Various Poojas
నవరాత్రుల్లో ఏ ఏ రోజు ఏ పూజలు జరపాలి అని ఒక నిర్ణయానికి రావాలి. అయ్యవారితో కలిసి చర్చలు చేసి రోజూ జరిగే పూజ కార్యక్రమాలు , మళ్ళీ ప్రతీ రోజూ జరిపే విశేష కార్యక్రమాలు అని అన్నిటిని షెడ్యూల్ చేసి కాలనీ వాళ్లందరికీ వివరాలన్నీ చెప్పాలి. ఇక మనం ప్రతీరోజూ ఉదయం అభిషేకం ,అర్చన నుండి రాత్రి నైవేద్యం వరకు రోజంతా మంటపంలోనే ఉంటాం కదా,ఆ మంత్రాలూ కూడా ఎంతో కొంత వచ్చేస్తాయి మనకి.

GIF by Gifskey.com

6.Organising Cultural Programs
పూజ కార్యక్రమాలు అన్నీ రోజూ యధావిధిగా జరుగుతోనే ఉంటాయి.వాటికీ తోడు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి కదా మరి . ఒక రోజు సాయంత్రం భక్తి పాటల కచేరి . మరో రోజు భజనలు,ఓ రోజు సాయంత్రం కోలాటాలు ఇలాంటివి. ఇక నవరాత్రులప్పుడు అన్ని మంటపాలలో విధిగా జరిగేది అన్నదానం . దానికోసం కూరగాయలు కొనడం నుండి విస్తరాకులు తెచ్చే వరకు మనమే అన్నీ చూసుకోవాలి.

GIF by Gifskey.com

7.24*7 @ Ganesh Mandapam
ఈ నవత్రులు తొమ్మిది రోజులు మన తిండి నిద్ర అన్నీ మంటపంలోనే . అక్కడ ప్రసాదమే మనకి భోజనం. మనలో కొందరైతే ఇక తొమ్మిది రోజులు దీక్షగా ఉండి నేల మీదే పడుకుంటారు కూడా. ఎందుకో అమ్మా నాన్నా ఎన్నిసార్లు చెప్పిన గుడికి వెళ్లని వాళ్ళం కూడా ఈ తొమ్మిదిరోజులు నిష్ఠగా ఉంటాం భక్తితో పూజలు చేస్తాం.

GIF by Gifskey.com

8.Distributing Prasadam
ఇక నవరాత్రులు చివరికి వచ్చేసరికి హడావిడి ఇంకా పెరిగిపోతుంది. కాలనీ లో అందరూ తమ ఇంట్లో ప్రతిష్టించుకున్న విగ్రహాలని వాళ్లే వెళ్ళి నిమజ్జనం చేయలేరు.కాబట్టి మన మంటపానికి తెచ్చి ఇస్తారు చివరి రోజు,మన పెద్ద వినాయక విగ్రహంతో కలిపి ఆ చిన్న విగ్రహాలని కూడా నిమజ్జనానికి తీస్కెళ్లాలి. ఇక అన్నిటికంటే ముఖ్యమైంది అందరికి ప్రసాదం అందించడం. చందాలప్పుడు కొన్ని ఇళ్ళకి వెళ్లకపోయినా పర్లేదు అనుకుంటాం కానీ ప్రసాదం మాత్రం అందరి ఇళ్ళకి వెళ్లి మరీ అందిస్తాం.

GIF by Gifskey.com

9.Laddu Auction – Journey to Nimajjanam
లడ్డూ వేలం .ఓ పదేళ్లనుండి ప్రతీ మంటపం లో తప్పనిసరిగా జరుగుతున్న కార్యక్రమం ఇది. కాలనీ వాళ్ళందరూ వచ్చాక ఇన్ని రోజులు వినాయకుడు చేతిలో ఉన్న లడ్డుని వేలం వేసి ఆ ప్రసాదాన్ని వాళ్ళకి అందించడం. ఇది ఒక కొత్త అనుభూతి..
ఇక నిమజ్జనానికి ముందు మనతో కలిసి పనిచేసిన అందరితో వినాయక విగ్రహం ముందు ఫోటో తీసుకోవడం తప్పనిసరి .చివరి పూజ అయిపోయాక నిమజ్జనానికి విగ్రహాన్ని తరలించాలి . అదేంటో ఇన్ని రోజులు పూజలు చేసి అక్కడే ఉంటూ ఉండడం వల్లనో ఏమో ఆ వినాయక విగ్రహంతో ఎదో తెలీని అనుభందం ఏర్పడినట్టు అనిపిస్తుంది. నిమజ్జనానికి సమయం అయ్యేకొద్దీ ఎదో భాద కూడా ఉంటుంది.
ఇక నిమజ్జనాయికి యాత్ర మొదలైనప్పటి నుండి భజనలు భక్తి పాటలతో ,గణేష్ మహారాజ్ కి జై,గణపతి బప్పా మోరియా అంటూ అసలు తగ్గని ఉత్సాహం తో అరుస్తూనే ఉంటాం.

GIF by Gifskey.com

ఇదంతా చదువుతుంటే మీకు కూడా ఎక్కడోఅక్కడ మీ కాలనీ లో వినాయక మంటపం దగ్గర మీకు కలిగిన అనుభూతులు గుర్తొచ్చేవుంటాయి . వినాయక నవరాత్రుల సమయం లో మీకు కలిగిన అనుభవాలు,వినాయక మండపం దగ్గర మీరు చేసిన హడావుడిని మాతో పంచుకోండి.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , ,