15 Powerful Dialogues From Gabbarsingh Which Made Fans Go Crazy In Theaters
అప్పటి వరకు సినిమా అంటే అమ్మ నాన్నలతో వెళ్లడమే. కానీ, ఇంటర్మీడియట్ లో ఫ్రెండ్స్ తో వెళ్లి పేపర్లు ఎగరేస్తూ.. రచ్చ చేసిన మొదటి సినిమా గా Gabbarsingh కి ఎప్పటికి నా సినిమా జ్ఞాపకాలలో ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది . థియేటర్ ముందు జాతర చేయడానికి, టాప్ లేచేలా అరవాడినికి ఎన్నో ఏళ్ళు నిరీక్షించిన ఫ్యాన్స్ కే మధురానుభూతిని ఇచ్చిన సినిమా.. నాకు అలా నిలవడం పెద్ద విషయం కాదనుకోండి. ఒక సగటు ఫ్యాన్ పవన్ కళ్యాణ్ ని తెరపై ఎలా చూడాలనుకున్నారో.. అలానే మొదటి సీన్ నుండి. చివరి సీన్ వరకు అదే ఎనర్జీ తో అదే పవర్ తో పంచులు వేస్తుంటే, కొడుతుంటే, మామూలు theatrical experience ఇవ్వలేదు ఈ మూవీ.. వీటికి తమ వంతు సాయం చేస్తూ.. డైలాగులు.. ట్రైలర్ లో విన్న “నాక్కొంచెం తిక్కుంది, కానీ దానికో లెక్కుంది” అనే డైలాగ్ sample ఏయ్ అని, అంతకు మించి ప్రాసలు, పంచులున్న డైలాగులు ఎన్నో ఉన్నాయని అర్థం చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టలేదు.. ఒక్కో సీన్, చూసే ప్రతి ప్రేక్షకుడిని మొదటి నుండి చివరి వరకు అదే high లో ఉంచింది.. ఈ ఆర్టికల్ రాస్తుంటే ఆ BGM echo లా వినిపిస్తూనే ఉంది.. పాటలు ఇప్పటికి playlist లో టాప్ లో నే ఉంది.. అలా ఒక పక్కా commercial మాస్ సినిమా ఎలాంటి experience ఇవ్వగలదో, అలాంటి experience 100 కి 100 శాతం ఇచ్చిన సినిమా గబ్బర్సింగ్… రిలీజ్ అయ్యిన టైంలో థియేటర్ ముందు రచ్చ ఎలా ఉండేదో.. ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది…
అలాంటి జాతరకు కారణమైన కొన్ని powerful dialogues ఇవి.
If you wish to contribute, mail us at admin@chaibisket.com