Here’s A Brutal Honest Letter To All Who Are Not Following Lock Down

Contributed By Vasudeva Sri Vamsi
మారరా మారరా మీరస్సలు మారరా …
వదలరా వదలరా మూర్ఖత్వం వదలరా…
మెలగరా మెలగరా భాధ్యతతో మెలగరా…
బ్రతకరా బ్రతకరా జ్ఞానంతో బ్రతకరా…
ఎంతచెప్పాలి , మీకు ఎలాచెప్పాలి….
మళ్లీమళ్లీ వినటానికి సిగ్గుఉండాలి…
బుద్ధి , జ్ఞానం , కుసంత బుర్ర వాడాలి..
దేశం నీదనుకునేంత భాద్యతుండాలి ..
ఇంటిపట్టునుండమంటే మాటవినాలి …
దానివెనుకవున్న కారణాల్ని తెలుసుకోవాలి …
మనిషికున్న మేధస్సును వాడుకోవాలి …
ఇంక పిచ్చిప్రశ్నలేయకుండా మూసుకోవాలి..
విపత్తులను ధైర్యంగా ఎదుర్కోవాలి…
అసలు నిర్లక్ష్యం పూర్తిగా వదిలెయ్యాలి…
మనవల్ల నలుగురెపుడు బాగుపడాలి…
జనాల్ని భాధపెట్టేవాళ్ళకి శిక్షపడాలి…
రోడ్డు మీదకి రావడానికి బుద్దుండాలి…
ఇపుడు నిర్లక్ష్యంగుండటానికి సిగ్గుండాలి…
దేవుడు బుర్రిచ్చినపుడు వాడికోవాలి…
భాధ్యతతో ఆచితూచి వ్యవహరించాలి…
ఎంతచెప్పాలి , మీకు ఎలాచెప్పాలి….
మళ్లీమళ్లీ వినటానికి సిగ్గుఉండాలి…
బుద్ధి , జ్ఞానం , కుసంత బుర్ర వాడాలి..
దేశం నీదనుకునేంత భాద్యతుండాలి ..
అసలు ఇంత కథకు కారణం మనమే అనాలి …
ముందు మనిషిప్రవర్తనలో చాలా మార్పురావాలి..
అన్నీజీవుల్ని సమానంగా చూడాలి ….
ప్రకృతిలో భాగం మనమను స్పృహరావాలి…
అడవికాలినపుడు సాయంచేసుండాలి…
తూఫాన్లొచినపుడు చేయూతే ఇచ్చిఉండాలి…
మనదికాదు మనకిరాదు అని వదిలేశాం..
ఇపుడు మనకితప్పదింక ఎదుర్కోవాలి…
చెట్లునాటి , మూగజీవుల సాయపడాలి…
అన్నిటితో మనమనేటి తెలివుండాలి…
పొల్యూషన్ చేయటాన్ని ఆపెయ్యాలి…
మనం ప్రకృతిలో భాగం అని తెలుసుకోవాలి…
ఇప్పటికైనా మనకళ్ళు తెరుచుకోవాలి…
ఇంకనుంచైనా “మనిషి” లాగా మనముండాలి…
భాధ్యతగల పౌరుడివలె నడుచుకోవాలి…
లోకహితం కోసం నిరంతరం పాటుపడాలి…
దేశసేవలోనే ఈ తనువును చాలించాలి…
చేతులు ప్రతిగంటగంట కడుగుతుండాలి…
పరిశరాలు శుభ్రంగా ఉంచుకోవాలి …
శుభ్రతనే దైవంగా భావించాలి …
స్వీయ దిగ్భంధం తప్పదంటు పాటించాలి…
ఈ మాటలు తప్పనిసరిపాటించాలి…
నాదేశం త్వరగా రక్షింపబడాలి…
నా అనువారందరెపుడు బాగుండాలి…
ఆయురారోగ్యాలతో మీరు తులతూగలి…
If you wish to contribute, mail us at admin@chaibisket.com