12 ఏళ్ళ తరువాత కలిసిన 6th క్లాస్ స్కూల్ మేట్స్ – A Short Story

 

పొద్దున్న 9 కి లేచి ఆఫీస్ కి పరిగెత్తడం. అక్కడ వచ్చిన పని చేయటం ఇంటికి వచ్చి తిని నిద్ర పోవడం గత 2 ఏళ్ళు గా ఇలానే సాగుతోంది జీవితం. ఎక్కడలేని గాంభీర్యం తో నవ్వటం కూడా రాని వాడిలా ఉంటూ సాగుతూ ఉన్న నా జీవితం లో ఒక రోజు..

 

ఎప్పటిలానే ఆఫీస్ కి వచ్చా “సత్య మీది తిరుపతి అన్నారు కదా!”. కొత్తగా వచ్చిన సూర్య అడిగాడు.
“అవును” ఒక పదం సమాధానం ఇచ్చాను..
“అవునా! 10th ఎక్కడ చదివారు అయితే” మాటలు కొనసాగించాడు సూర్య..
“7th అంటే 2007 వరకే తిరుపతి లో SVU లో చదివా తరువాత నెల్లూరు కి వచ్చేశా” ఆ తరువాత హైదరాబాద్ లో కాలేజ్, ఆ తరువాత ఇదిగో ఇక్కడ జాబ్” అని తను అడగక ముందే biodata మొత్తం చెప్పేశా..

 

“Actuallyy నేను కూడా SVU లో నే చదివా కాకపోతే 8th అంటే 2007 జూన్ లో . కాబట్టి మీరు నేను కలిసే ఛాన్స్ ఉండుండదు. మొన్న మా గ్రూప్ లో ఇలా జాబ్ లో జాయిన్ అయ్యా అని పోస్ట్ పెడితే నా వెనుక ఉన్న మిమ్మల్ని చూసి తను సత్య కదా అని అడిగాడు నా ఫ్రెండ్ ఒకడు సో మిమ్మల్ని అడిగా” అని అసలు విషయం చెప్పాడు సూర్య.

 

” ఏంటి ఎవరు?” 12 ఏళ్ళు తరువాత కూడా ఎవరు గుర్తుపట్టింది అని తెలీక ఒక రకమైన ఆత్రం ఉన్న ఆ ఆత్రానికి ముసుగు వేసి అడిగా…

 

“చైతన్య అడిగాడు, ఉండండి మాకో గ్రూప్ ఉంది అందులో add చేస్తా” అని నేను సరే అనేలోపు add చేసేసాడు సూర్య.

 

సూర్య: చైతూ, మొన్న అడిగావుగా నీ guess correct ey తను మీ 7th classmate అంటా

 

ఈ మెసేజ్ పెట్టిన వెంటనే ఎన్నో messages, “హాయ్ bro” అని messages vache ఈ కాలం లో, “ఒరేయ్ సత్తిగా” అని “ఒరేయ్ సత్తుగా” అని నేను మరిచిపోయిన నా పేర్లన్నీ గుర్తుచేస్తూ.. నన్ను నా డైన ఆ బాల్యం లోకి తీసుకెళ్లిపోయారు. project submission అనే ఆలోచన కాసేపు మర్చిపోయా

 

ఒక్కొక్కరి whatsapp dp చూస్తుంటే ఆనందం ఆశ్చర్యం రెండు ఒకే సారి వచ్చాయి.. ఒక్కొక్కరి గురించి తెలుసుకుంటుంటే.. జీవితం లో నేను ఎంత దూరం పరిగెత్తానో అర్ధమవుతోంది..

 

చిన్నప్పుడు అస్సలు చదవలేని మొద్దు అనుకునే వాడు IAS క్రాక్ చేసాడు. చిన్నప్పుడు బొండం అని ఎక్కిరించేవాళ్ళం తను ఇప్పుడు sixpack చేసాడు. చిన్నప్పుడు అల్లరి చేసే అమ్మాయి.. తన కూతురి అల్లరి గురించి చెప్తుంటే నవ్వొచ్చింది. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో కథ వాళ్ళందరి తో చేసిన అల్లరి గుర్తొస్తుంటే “అది కదా నేను, ఈ నేను వేరెవరో” అనే భావన ఒకసారిరగా మదిని మదించేస్తోంది. జీవితం ఎంత మార్చేస్తుంది మనిషిని, కానీ జీవితం కన్నా బలహీనుడా మనిషి?, అదెంత బలవంత పెట్టినా మనకు నచ్చినట్టు చేయాలి, ఈ ముసుగులు ఎందుకు? అని అనిపించింది. సరే ఈ ఆలోచనలన్నీ తరువాత అక్కడ మాట్లాడాల్సిన వారు చాల మంది ఉన్నారు. అందరితో ఆ పాత మధురాలన్నీ జ్ఞాపకం చేసుకున్నా.. అప్పటి నా టీచర్స్ నంబర్స్ కనుక్కుని ఫోన్ చేశా.. ఆ రోజంతా నేను ఆఫీస్ లోనే ఉన్నా కానీ, నా మనస్సంతా అలా నా 6th క్లాస్ స్కూల్ కి వెళ్ళొచ్చింది.., ఈ busy life లో ఒక గంట ఇలా ఉండటం బాగుంది.

 

అలా ఒక గంట గడిచాక, ఇక ప్రస్తుత జీవితానికి వచ్చేసా.., కానీ ఈ సారి పనంతా చక చకా అయిపొయింది. కోడ్స్ అన్ని వెంటనే తట్టాయి. మెదడు కాస్త కుదుట పడిందేమో బాగా పని చేసింది. ఒక సారి సూర్య ని పిలిచి గట్టిగా hug చేసుకుని ఇంటికి పయనమవుతూ.. నా మిగిలిన స్కూల్ ki whatsapp group start చేశా…, ఈ ఉరుకుల పరుగుల జీవితం లో కాసేపు కుదుట పడటానికి ఇలాంటివి అవసరమే మరి..

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

Tags: , , , , ,