A guy Meets His Fake FB Friend In Real Life & What Happens Next Is Mad

 

“4 నెలల క్రితం ఫేస్ బుక్ లో పరిచయం. మెల్ల మెల్ల గా తన భావాలు నావి ఒకేలా ఉండటం తో మంచి ఫ్రెండ్స్ అయ్యాం. తనకు నాలా కథలు కవితలంటే చాలా ఇష్టం. తన ఫేస్ బుక్ వాల్ అంతా తను రాసిన కథలు, కవితలే. సిరివెన్నెల పాటలు నుండి త్రివిక్రమ్ మాటలు వరకు చాలావాటిలో నా ఇష్టాలకు తన ఇష్టాలకు సిమిలారిటీస్ ఉన్నాయి. అందుకే ఇంకా కనెక్ట్ అయ్యాను. తన పోస్ట్స్ అన్ని చాలా మెచూర్డ్ గా ఉంటాయి. ఈ రోజు ఎందుకో కలుద్దాం అని తన దగ్గర్నుండి మెసేజ్ వచ్చింది.” అని నా మాట పూర్తయ్యే లోపు…

 

“ఇంకేమి రా పోయి కలువు” అని నా ఫ్రెండ్ సూర్య నాకన్నా ఎక్సైట్ అవుతూ చెప్పాడు.

 

నేను: వెళ్లాలంటే భయమేస్తోంది రా…

 

సూర్య:ఎందుకు రా అబ్బాయి ని కలవాలంటే అంత భయం.

 

నేను: నేను అబ్బాయి అని తనకు తెలీదు కాబట్టి.

 

సూర్య: ఏంటి?

 

నేను: తనతో నేను అమ్మాయి పేరు తో చాట్ చేశారా

సూర్య: ఎందుకలా చేసావ్ రా పాపం అవతలబ్బాయ్ ఇటువైపు అమ్మాయి తో చాట్ చేస్తున్న అని ఎంత సంతోషపడి పోయుంటాడో.

 

నేను: రేయ్ ఎక్కిరించడం ఆపి ఎమన్నా సలహా ఇవ్వు.

 

సూర్య: నీకున్నవి రెండే దారులు గమ్మునే కూర్చోవడం. కలిసి ,మాట్లాడి సారి చెప్పి మేటర్ ని అక్కడితో ఆపేయడం. నిజాన్ని ఎక్కువ సేపు దాచలేం. నాకైతే నువ్వు మాట్లాడితేనే మంచిదని అనిపిస్తోంది. వాడు మంచోడు అయితే తిట్టి వదిలేస్తాడు, మనలాంటోడు అయితే కొట్టిపారేస్తాడు. ఏమి చేసిన ఈ గోల తప్పుతుంది.

నాకు అదే మంచిది అనిపించి ఏదైతే అది అయ్యిందని తను కలుద్దాం అని చెప్పిన కాఫీ షాప్ కి వచ్చాను.

 

చాలా సేపైనా తను రాలేదు. ఎక్కడున్నావ్ అని మెసేజ్ చేస్తే ఇక్కడే ఉన్న అని రిప్లై వచ్చింది. ఇన్ని రోజులలో ఫస్ట్ టైం తన ఫోన్ నెంబర్ అడిగి ఫోన్ చేసాను. నా వెనక సీట్ నుండి రింగ్ వినిపించింది. తిరిగి చూస్తే నా జీవితం లో నేను ఊహించని మలుపు ఆ క్షణం నాకు ఎదురైంది, ఎందుకంటే ఇన్నాళ్లు నేను అబ్బాయి తో చాట్ చేస్తున్న అనుకున్న కానీ నేను చాట్ చేస్తోంది ఒక అమ్మాయి తో అని తెలిసిన క్షణం అది.

నా ముఖం లో తన ముఖం ఒకే రకమైన భావం. తన దగ్గరికి వెళ్లి సారి అని చెప్పబోయే లోపు తను సారి చెప్పింది.

 

నేను: అయ్యో! మీరెందుకండి సారి చెప్పడం . ఏదో అనుకోకుండా మీ ప్రొఫైల్ చూసి పోస్ట్స్ బాగున్నాయని ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాను.అలా చేయకుంటే ఇదంతా అయ్యేది కాదు కదా.

 

తను: ఈ విషయం లో మీ తప్పు ఎంతుందో నాది అంతే ఉంది. మీరు రిక్వెస్ట్ పెట్టారు కానీ నేనే కదా మొదటి మెసేజ్ చేసింది.

 

నేను: సరే అండి మీది తప్పు ఉంది నాది తప్పు ఉంది. తప్పుకి తప్పు చెల్లు కి చెల్లు. ఒక మంచి కాఫీ తాగి . ఈ విచిత్రమైన సీన్ ని ముగించేద్దాం.

 

తను: తప్పకుండా. కానీ మీరు అమ్మాయి పేరు తో ఎఫ్.బి అకౌంట్ ఎందుకు క్రియేట్ చేసుకున్నారో చెప్తారా ఈ లోపు.. నేను చెప్తా let’s confess each other.

 

నేను: తప్పకుండా. లేడీస్ ఫస్ట్ అంటారు. కానీ లేడీ అకౌంట్ నాది కాబట్టి నేనే మొదలు పెడతా. మీకు తెలుసు బయట పరిస్థితులు ఎలా ఉందొ… కారణం ఏదైనా నేరం ఏదైనా ఎక్కువ అన్యాయానికి గురవుతుంది అమ్మాయిలే. వాళ్ళ పరిస్థితి ని వాళ్ళు నిత్యం అనుభవించే మనో వేదనని వాళ్ళలా ఉంటె కానీ అర్ధం చేసుకోలేమని అనిపించి ఫేక్ అకౌంట్ క్రీయేట్ చేసుకున్నాను. అప్పటికి కానీ నాకు అర్ధం కాలేదు. మగాళ్ల మధ్య మృగాలు ఎంతమంది ఉన్నారో. ఆ ఫేక్ అకౌంట్ సాయం తో చాలా మంది వెదవాలకి బుద్ధి చెప్పాను. కానీ బాధపడేవాళ్లు ఉంటె పెట్టె వాళ్ళు ఉంటారు. అదే సమస్య ని ఎదుర్కునే ధైర్యం వాళ్లలో కలిగిస్తే, వాళ్ళ సమస్య వాళ్ళని చూసి భయపడేలా చేయాలి అనిపించింది. అది కూడా ఒక అమ్మాయి లా వాళ్లలో ధైర్యం నింపితే ఆ ధైర్యం ఇంకా బలంగా ఉంటుంది. అందుకే నా పోస్ట్స్ ద్వారా ఆ ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రయాణం లో ఒక మంచి అబ్బాయి ని బాధపెట్ట అనుకున్న కానీ ఆ అబ్బాయి అకౌంట్ ఫేక్ అని ఇప్పుడు తెలిసింది ఒక పక్క సంతోషం ఇంకో పక్క ఆశ్యర్యం తో ఉన్న ఇప్పుడు.. సో ఇది నా కథ మీది?

 

తను: తప్పు చేసే వాళ్ళే మారితే ఇంకెవ్వరు తప్పు చేయరు కదా .ఒక అమ్మాయి, అమ్మాయి తరుపు మాట్లాడడం పెద్ద విషయం కాదు. అదే ఒక్క అబ్బాయి అమ్మాయి తరుపు మాట్లాడితే ఇంకో అబ్బాయి ఆలోచిస్తాడు. అందుకే అబ్బాయి పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి పోస్ట్స్ పెట్టడం స్టార్ట్ చేశా. ప్రేమించడానికి వేధించడానికి ఒక చిన్న తేడా ఉంది . ఆ తేడాని అబ్బాయిలు అర్ధం చేసుకుంటే చాలా మంది అబ్బాయిలు తప్పులు చేయరు అనేది నా అభిప్రాయం. ఈ ఫేక్ అకౌంట్ ద్వారా ఆ అభిప్రాయం నిజం అని రుజువయ్యింది కూడా. ఈ ప్రయాణం లో మారాం అని తమ తప్పుల్ని తెలుసుకున్న అబ్బాయిలని కలిశా.ఫేక్ అకౌంట్ అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఒక కథని రాసేంత అనుభూతి ని ఇచ్చింది. ఆ కథలో ఓ మలుపు లా మీరెదురయ్యారు.

 

నేను: మీరు బాధపెట్టే వాళ్లను మార్చాలని ట్రై చేస్తున్నారు నేను బాధపడే వాళ్ళను మార్చాలని ట్రై చేస్తున్నాను. మనమెందుకు ఎఫ్.బి పేజీ మొదలు పెట్టకూడదు. సో కొంతమందైనా మనవల్ల మారుతారు కదా…. మీరు అబ్బాయి అనుకుని కలిసి సారి చెప్పి ఈ విషయం మాట్లాడుదాం అనుకున్న.

 

తను:నిజానికి నేను కూడా సారి చెప్పి ఇదే విషయం మాట్లాడదాం అనుకున్న. కానీ మీరేమో అబ్బాయి నేనేమో అమ్మాయి మనమిద్దరం చేయగలమా…?

 

నేను: ఇదే స్థానం లో ఒక అమ్మాయి ఉంటే మీరు, ఒక అబ్బాయి ఉంటే నేను, పెద్దగా ఆలోచించేవాళ్ళం కాదు. నిజానికి మార్పు ఇక్కడనుండి మొదలవ్వాలి. మనమెందుకు స్నేహితులు అవ్వకూడదు. మనమెందుకు కలిసి మన వంతు మార్పు మనం కోరుకునే మార్పు మన చుట్టూ ఉన్న వాళ్లలో తీసుకురాకూడదు.

 

తను: Yes you are roght I’m in lets start a page.

(ఇంతలో కాఫీ వచ్చింది . ఒక సిప్ కాఫీ , ఒక చిన్న నవ్వు మా మధ్య స్నేహానికి, మా పేజీ కి మొదలు అయ్యింది)

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , , , , , ,