ఈ చిన్ని ఉత్తరం తండ్రి కూతుర్ల అనుబంధాన్ని, అందంగా తెలుపుతుంది.

 

Contributed by Sainikith Nerella

నాన్న..!
నీ చిట్టి తల్లిని మాట్లాడుతున్న..
నడక వచ్చే అంతవరకు నడిపించావు..
జగమెరిగేవారకు తోడుగా ఉన్నావు..
నన్ను నీ ప్రపంచం అనుకున్నావు..
నాతో బుడి బుడి అడుగులు వేయించి..
నాకు ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి
ఎందుకు నాన్న నన్ను వదిలేసి వెళ్లిపోయావు..
నువ్వు పక్కన ఉన్నపుడు ఏ ప్రపంచాన్ని అయితే నేను గెలిచానో.
అదే ప్రపంచం లో నన్ను వదిలేసి వెళ్లావు..
నలుగురితో ఎలా బ్రతకాలో నేర్పించావు..
అదే నలుగురిలో నన్ను వదిలేసి వెళ్లిపోయావు..
నువ్వు ఉన్నపుడు కష్టం తెలియకుండా పెంచావు.
వెళ్లేముందు కష్టాన్ని జయించగల శక్తిని ఇచ్చావు..
నువ్వు లేని బాధ కన్నా..
నువ్విచిన బాద్యత నన్ను నడిపిస్తుంది..
ఆలోచన ఆరంభం అయింది నీతోనే..
నా ఆలోచనలో నువ్వే,నా ఆశయంలో నువ్వే..
నడక తెలియనప్పుడు వ్రేలు పట్టుకొని నడిపించావు..
ఆ వ్రేలుకి నేడు నీ తోడు లేకున్నా..
నువ్విచ్చిన ధైర్యం తోనే నడుస్తున్నాను…
నేడు నా కళ్ళముందు నువ్వు లేకున్నా..
నేను కనే కలలో బ్రతికే ఉన్నావు…
నా రేపటి గెలుపు కూడా నువ్విచినదే,నీ స్వంతమే..
ఇక నుండి కూడా నా ప్రతి ఆలోచన..
నేను వేసే ప్రతి అడుగు లో నువ్వే ఉంటావు..
నువ్విచిన జన్మ,నువ్విచిన జీవితం
నా ప్రతిక్షణం నీకే అంకితం
నాన్న నువ్వే
నా ఆలోచన
నా అడుగు
నా ఆశయం
నా అనంతం
నా స్ఫూర్తి..
నాన్నకు ప్రేమతో
నీ చిట్టి తల్లి..

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , ,