This Intense Conversation Between A Farmer & Landlord Is Something You Must Read!

 

Contributed by Siddhartha Chokkakula

“ధాన్యం సిమెంటు లొ పండదు సారు ” జవాబిచ్చాడు రాముడు .

విషయం అర్ధమయ్యినా రాముడి మాటల్లో ఉన్న బాధని , అయన బాధ వెనక ఉన్న అసలు కారణాన్ని గ్రహించి వింటూనే ఉన్నాడు భూస్వామి

ఆ చుట్తుపక్కల ఉన్న పొలాలన్నింటినీ కొనెసాడు భూస్వామి. తరతరాలు కుర్చొని తిన్నా తరగని సంపద అతనిది. లేచిందే ప్రయాణం అన్నట్టుగా సాగుద్ది భూస్వామి తీరు. ఏదైనా మనసున పడటమే ఆలస్యం , తన పాదాలముందు ప్రత్యక్షం అవుతోంది… ఎంత పెద్ద ఓడైనా, ఎంత గొప్ప ప్రస్థానమైనా, ఏదో ఒక రోజు ఒడ్డుకి చేరాల్సిందే. బహుసా భూస్వామి ప్రస్థానానికి, అతనికున్న భూకమానికి ముగింపు పలికింది మన రాముడేనేమో!! ఈ చుట్టుపక్కల భూములు అన్ని సొంతం చేసుకొని ఆ పంటనేలలలో ఒక townshippu కట్టాలని అతని కోరిక. కాకపోతే అన్ని పొలాలు కొనగాలిగాడు కానీ, ఆ 200 ఎకరాలు మధ్యలో ఉన్న రాముడి పోలం మాత్రం అడ్డుగా నిలిచింది. పొలం పెద్దది ఏమి కాదు, సుమారు ఓ రెండు ఎకరాలు ఉంటుంది. అలాగే వదిలేస్తే ఆ రెండు ఎకరాలకోసం మరో రోడ్డు వెయ్యాలి ప్రత్యేకంగా. అది భూస్వామి కి మరింత తలనొప్పిని తెచ్చిపెట్టింది.

ఆ రెండు ఎకరాలకి బదులుగా మరో పదెకరాల భూమి ఇస్తాను అన్నాడు భూస్వామి. ఒప్పలేదు రాముడు, వచ్చేది 100 ఎకరాలు అయిన ఎం లాభం ఆ రైతుకి, ఆ భూమి బంజరభూమి అయినప్పుడు. ఇద్దరికి కావల్సింది ఒకటే నేల , ఆ నేల ఒకరికి కోట్లు ఇస్తే మరొకడికి కూడు పెడుతుంది. ధనానికి ధాన్యానికి బేరం తెలట్లేదు అక్కడ.

పంట కోసం ఒకడి పోరాటం, పైసలకోసం మరొకడి ఆరాటం. ఎం చెయ్యగలరు ఎవ్వరైనా ? తన అనుచరలను ఎంత మందిని పంపినా రాముడు మాత్రం మౌనంగానే నిరాకరించాడు. ఆఖరికి భూస్వామే దిగొచ్చి మాట్లాడాల్సి వచ్చింది.

“ ఏంటయ్యా రాముడు , ఏంటి ఇది ? చిన్న పిల్లాడిలా ఈ పంతం దేనికి ? నేనేమన్నా దౌర్జన్యం చేస్తున్నానా ? ఒక్క మాట అడుగుతాను జవాబు ఇయ్యు , నీ దగ్గర భూమి తీసుకొవడం ఎంత సేపు పని నాకు ! తీసుకోలేను అనుకుంటున్నావా ?? పోనిలే పేదవాడివి అని జాలితో భూమికున్న రేటు కంటి ఎక్కువే ఇస్తాను అంటే మారం చేస్తున్నావ్ , అంత పొగరు దేనికి ? ఎంతకాలం కుర్చున్తావ్ పట్టుదలతో ? ఇస్తున్న డబ్బులు సరిపోలేదు అంతే చెప్పు నీ పేరుమీద. ఒక ఫ్లాట్ కూడా రాస్తాను. అలొచించుకొ ఇంతకు మించిన బేరం ఎవరు ఇవ్వగలరు నీకు !! చాదస్తం తో కోరివచ్చిన అవకాశాన్ని వాడులోకోవద్దు “, చిరాకు పడుతూ బేరం మాట్లాడటానికి చూసాడు భూస్వామి.

దానికి రాముడు చిన్నగా నవ్వుతూ

“ అయ్యా ఈ పొలం పై నాది పంతం కాదు. ఈ నెల ఇచ్చే పంటే నాకు ప్రాణాధారం ! , చదువు రాని వాడిని, ఈ డబ్బులు ఈ ఫ్లాటులు నాకు అంతుపట్టవు ఊహ ఎరిగినప్పటినుంచీ హలం పట్టి పొలం దున్నటమే నాకు ఎరుక . ధనం గురించి గానీ కలం గురించి కానీ ఎమాత్రం అవగహన లెదు సారు. నాకు ఒచ్చిందీ , నాకు తెలిసిందీ వ్యవసాయమే, వ్యాపారం కాదు. మీరు ఇస్తానన్నారే ఏదో భూమి, దానితో నేనేం చేసుకోగలను ? ఆఅ భూమి లో పంట పండిద్దా ? మొక్క మోలిసిద్దా ? మీరు ఇస్తానన్న నోట్లు తడిస్తే నాని చిరిగిపోతాయి. అదే నా నెల లో నాటిన విత్తనాలు తడిస్తే మురిసిపోయి మొక్కలవుతాయి !! మీరు కట్టే మేడలు ఎంత ఎత్తు ఉండీ ఎం లాభం , ఎంత విశాలంగా ఉంది ఎం ప్రయోజనం? అందులో ఉండీ మనిషికి తిన్దినివ్వనప్పుడు. ”

ప్రశ్న కి ప్రశ్న తోనే సెలవిచ్చాడు రాముడు ..

“నేలను ఇవ్వను అంటావ్ మొత్తానికి ?” విషయాన్ని పూర్తిగా అర్ధం చేసుకోకుండా అసహనంగా అడిగాడు భూస్వామి .

“ ధాన్యం సిమెంట్ లో పండదు సారూ”, జవాబిచ్చాడు రాముడు.

లెగిసి తలపాగా తీసుకొని పశువులకి మేత వెయ్యటానికి పోయాడు రాముడు, ఎం జరగనట్టూ ..

ఆ మాటతో భూస్వామికి అసలు విషయం అర్ధమయ్యింది. తనలొ తాను నవ్వుకుంటూ కారెక్కి వెళ్ళిపోయాడు అక్కడనుంచి ..
ఇంటికి పోయినా కూడా భూస్వామికి రాముడి మాటలే వినిపిస్తున్నాయి

“ధాన్యం సిమెంటులో పండదు సారూ”

నిజమే కదా !!!!!!! మనం ఎంత ఆధునిక యుగం లో ఉన్న , మనకి తిండి పండేది నెల మీదే కదా !!!!!!..

భవిష్యత్తు లొ ఎదైనా కొత్త పద్దతులు వస్తే , అదీ గోడలమీద లేక మనం వాడి పడేసిన ప్లాస్టిక్కు మీద పంటలు పండితే, ఆ తిండి తిని మనం అవలక్షనాలు లెకుండా బతికితే. అప్పడు కడదామా పంట భూముల్లో పట్టణాలు? డబ్బుతో ఏదైనా వస్తుంది అన్నట్టు వ్యవహారిస్తే అతి త్వరలో మన ఆస్తి మొత్తం పోగేసినా మెతుకు అన్నం కూడా దక్కని పరిస్థితి ఒస్తుంది.. కొనసాగిద్దామా ఇలాగే రైతన్న వ్యవసాయం మరిచిపోయేలా చేయొద్దు, మన తరువాత తరాల వారి ఆకలి కేకల కారణంగ మారొద్దు ..

రైతు బిడ్డ ఆవేదన!!

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , ,