Here Is The Honest Farewell Letter To 2020 – A Year Which Taught Us Many Lessons

ఎన్నో ఆశలు ఇంకెన్నో కలలు , చాలా సంతోషంగా అడుగు పెట్టాం 2020  లోకి , ఫాన్సీ నెంబర్ ల అనిపించించడం వాళ్లేమో  అందరికి తెగ నచ్చేసావు.అప్పటి దాకా జీవితం మీద చిరాకు ఉన్న వాళ్ళు కూడా కొత్త ఉత్సాహం తో నీ వైపు చూసారు.స్టూడెంట్ నుండి ఎంప్లాయ్ దాకా , చిన్న వ్యాపారి నుండి పెద్ద కంపెనీ C.E.O  దాకా అందరు నువ్వు వాళ్ళకి ఏదో ఇస్తావనే ఆశతోనే నీలోకి దిగారు.

బానే ఉన్నావు కానీ బాధ పెట్టావు

ఎప్పుడు ఎదురుపడని సంఘటనలు , ఊహకు అందని  వింతలు అన్ని చూపించావు.మొదట తెలియని ఆనందం నుండి వెళ్తుండగా చెప్పుకోలేని బాధ వరకు చాలా చుక్కలు కనిపించేలా చేసావు . ఆకలి రుచి చుపించావ్ , ఎంతో మంది ఆశయాలకు నిట్టూర్పుకి దరి చేసావ్.

మరిపించే సంవత్సరం అవుతావు అనుకున్నారందరు , మరిచిపోవాలనే సంవత్సరంగా మారావు.నీ చెలి భూమి కోసం చేసావనుకుందాం అనుకున్న , భూమాత బిడ్డలు ఏడుస్తుంటే తల్లి సుఖంగా ఉండగలిగిందంటావా?

చాలా మందికి కావాల్సిన భయం నేర్పావని ఆనంద పడాలో , ఇంకెంతో మంది జీవితాలను  దూరం చేసావని బాధ పడాలో అర్ధంకాట్లేదు. తెలిసి చేసిన , తెలియక చేసిన రాల్చిన కన్నీరు ఉసురు నీకు తగలకుండా పోతుందా?

నువ్వు నేర్పిన నడవడిక , చేదుగా చెప్పిన చాలా నిజాలు , కఠినంగా అలవాటు చేసిన క్రమశిక్షణ అన్ని జీవితం లో ఉపయోగపడేవే, కానీ ఇంత క్రూరంగా నేర్పాలంటావా?

ఆరోగ్యం బాగోకపోతే కలిసి వద్దాము అనే వరస నుండి ఆరోగ్యం బాలేదంటా అటువైపు వెళ్ళదు అనే ఆలోచన రావడానికి కారణం నువ్వు కాదా?

నిప్పు నీరు గాలి భూమి ఆకాశం దేన్నీ వదలలలేదు అన్నిటి ద్వారా నువ్వు  చెప్పాలనుకున్నది చాల స్పష్టంగా తెలియజేసావు.

ఆకలి బాధ చూపించావు , జీవితం ఖరీదు కనపరిచావు , ఆశల్ని అణిచేసావ్ , ప్రకృతి కోపాన్ని తెలిజేసావ్ , ఒక 6  నెలలు ప్రపంచాన్నే ఆపేసావు. చెప్పుకోడానికి ఒక కథ ఇచ్చావు , బాధ పడడానికి చాల సమస్యలు కూడా ఇచ్చావు , అన్ని తట్టుకున్నాం భరించాం , మాకు అర్థమైందని తెలియపరుస్తూ దయచేసి ఇంకా ఆపమని మా విన్నపం , దీనికి ఇంకా స్వస్తి

చెప్పి వచ్చే విప్పత్తులేమన్న ఉంటె ఆపేసి 2021  అద్భుతంగా కాకపోయినా మంచిగా ఎక్కువ బాధ పెట్టకుండా ఉంటదని నమ్ముతున్నాము.దయ చేసి వెళ్ళి ఇంకెప్పుడు రావద్దు అని మా కోరిక , నీ మీద కోపం తో కాదు , ఇంకా భరించే ఓపిక మాకు లేక , అలానే I LOVE YOU చాలా విషయాలు నేర్పించినందుకు అలానే I HATE YOU చాలా మంది గుండెలు పగలకొట్టినందుకు, వెళ్లి మళ్ళి తిరిగి రావని ఆశిస్తూ

అన్నిటిని భరించి బయట పడ్డ సగటు మనిషిని …..

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , ,