ఒక కళాకారుడి జీవన పోరాటం – An Emotional Short Note Of Aspiring Actor

 

Contributed by Sumanth Anubolu

 

ఏమి సేతు రా, బిడ్డ
ఏమి సేతు…

 

గర్భ చీకటిలో తొమ్మిది నెలలు రగిలే
వయసు పెరిగి, కండ పెంచి, బుద్ది చచ్చి కృష్ణనగర్ కి పోయే…
తొమ్మిది, అరేయ్! తొమ్మిది ఏళ్ళు గడిసే, దున్నలాంటి మనిషి మళ్ళీ అండమై మిగిలే…
దున్నలాంటి మనిషి మళ్ళీ అండమై మిగిలే…

 

ఏమి సేతు రా, బిడ్డ
ఏమి సేతు…

 

లోపల, అదే లోపల…
పెద్ద పేగు చిన్న పేగుతో గొడవకు దిగే
చిన్న పేగు ఆహారం కొరకు నా ఆత్మభిమానాన్ని బజార్లో బేరం పెట్టకని తిట్టే…
పాపమని నా రక్తం ప్రవహిస్తుండే, కానీ ఆ రక్తం ఏమో రంగు వేసుకొని తెర పైనే చూసుకోవాలి అని కలగంటుండే

 

ఏమి సేతు రా, బిడ్డ
ఏమి సేతు…

 

అమ్మ ఏమో, పరాయి పిల్లకాయాల విజయగాధలు చెప్తూండే
నాన్న ఏమో, మౌనంగా నసుగుతుండే
ఆత్మహత్యే మార్గమని నేను చూస్తుండే…
ఈ మధ్యలో నా గరీబు స్నేహితుడు ఒకడు
నేను మెగాస్టార్ వలే, నేను మెగాస్టార్ వలే అని మాయ మాటలు చెప్పి నన్ను బతకనిస్తుండే

 

ఏమి సేతు రా, బిడ్డ
ఏమి సేతు…

 

ఇవన్నీ గమనిస్తున్న…
ఇవన్నీ గమనిస్తున్న…
అహే, లేదు…లేదు…
ఇవన్నీ గమనించి కరుణించాల్సిన దైవం…
కరుణించాల్సిన దైవం…
నాలో కళాకారుడికి నిత్యం కొరువిపెడుతుండే…
నాలో కళాకారుడికి నిత్యం కొరువిపెడుతుండే

 

ఏమి సేతు రా, బిడ్డ
ఏమి సేతు…

 

బూడిదై మిగిలిన నేను
బూడిదై మిగిలిన నేను
మళ్ళీ సినిమా కొరకు ప్రాణం పోసుకొనే
సినిమా కొరకు ప్రాణం పోసుకొనే
ప్రాణం పోసుకొనే
ప్రాణం పోసుకొనే
పోసుకొనే
పోసుకొనే

 

సినిమా కొరకు ప్రాణం పోసుకొనే…

 

ఏమి సేతు రా, బిడ్డ
ఏమి సేతు…

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , ,