This Meaningful Write Up Explains Why No Job Is A Small Job

 

Contributed By Hari Atthaluri

 

తనకి తాను గా నడవని ఈ ప్రపంచం…
తలా ఒక పని చేస్తేనే ముందుకు కదులుతుంది…

 

ఇక్కడ ప్రతి ఒక్కరి contribution ఒకేలా ఉండాల్సిన పని లేదు..
అందరూ ఒకేలా చేయాలి అని కూడా లేదు…..

 

లంక ని చేరటానికి ఉడత చేసింది చిన్న పనే ఐనా…
రాముడు ఆ ఉడత కష్టం ని కూడా గుర్తించాడు…

 

అలాగే ఇక్కడ

Software పని చేసే ఉద్యోగి ఎంత అవసరమో….
Sewage పని చేసే ఉద్యోగి కూడా అంతే అవసరం…

 

ఆటగాడు ఎంత అవసరమో…
కళాకారుడు కూడా అంతే అవసరం…

 

గరిటె పట్టుకుని వంద మందికి వంట చేసే వాళ్ళు ఎంత అవసరమో…
గన్ను పట్టుకుని వంద మంది ని కాపాడే సైనికులు అంతే అవసరం…

 

వృత్తి ని బట్టి “స్థాయి” ని ఈ సమాజం సృష్టించలేదు…
మన లోని స్వార్థం మాత్రమే పుట్టించింది పై స్థాయి కింద స్థాయి అని..

 

ఇక్కడ జీతం తో కన్నా,
జీవితం తో ముడిపడిన పనులు ఎక్కువ…

 

ఉద్యోగాన్ని బట్టి..
వచ్చే రూపాయి ని బట్టి
ఆ రూపాయి కోసం చేసే పని ని బట్టి..
వ్యక్తి విలువ మారకూడదు….

 

“సిగ్గు పడే పనులు అంటూ సెపరేట్ గా ఏం లేవు.”

అన్ని పనులు…
అన్ని ఉద్యోగాలు…
ఈ సొసైటి తన అవసరం కోసం..
మన మనుగడ కోసం సృష్టించుకున్న వే..

 

ఇందులో ఒకరు ఎక్కువ..
ఇంకొకరు తక్కువ అనుకుంటే మనం అజ్ఞానం తో ఉన్నట్టే …

డాక్టర్ కి ఇచ్చిన విలువ,
ఆ ప్రాణం కాపుడుకుంటూ తెచ్చిన ఆంబులన్స్ డ్రైవర్ కి ఇవ్వం…

 

సరేలే ఆ డ్రైవర్స్ అందరూ ఒకటే .. మరి అందరినీ ఒకేలా treat ఒకేలా respect, చేస్తున్నామా అంటే, No అది కూడా లేదు…

పైలట్ కి ఇచ్చే విలువ బస్ డ్రైవర్ కి ఇవ్వం…

ఆ బస్ డ్రైవర్ కి ఇచ్చే విలువ
ఒక్కోసారి ఆటో డ్రైవర్ కి ఇవ్వం

 

వెళ్ళేది కార్ ఐనా…
ఫ్లైట్ ఐనా…
ఆటో ఐనా…
బస్ ఐనా….
అందులో కూర్చున్న మన ప్రాణం విలువ మారుతుందా ??? లేదు కదా…

 

అదే ప్రాణం .అంతే విలువ…
ఇలా మన ప్రాణం కి విలువ మారనప్పుడు….

 

మనం వాళ్లకి ఇచ్చే విలువ లో మార్పు ఎందుకు ???

బాస్ తిట్టినా బయటకి respect ఇస్తాం…

బాగానే చేస్తున్నా, మన ఇంట్లో పని చేసే వాళ్ళని మాత్రం ఊరికే తిడతాం…

ఎందుకు ??

 

వాళ్ళు చేసే పని మన కన్నా తక్కువ ది అనుకుని
మన ఈగో satisfy చేసుకుంటున్నాం కాని నిజాన్ని accept చేయలేక పోతున్నాం… ఎందుకు ??

పేపర్ వేసే person పావు గంట లేట్ గా వస్తె ప్రతాపం చూపిస్తాం,
ఆర్డర్ పెట్టిన ఫుడ్ అరగంట లేట్ గా వస్తె అరుస్తాం…
అంతే కానీ ఆలోచించం…

 

ఇలా చిన్న చిన్న పని చేసే వాళ్ళు..ఎవ్వరికీ భారం కాకూడదు అని…
వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నిలబడటానికి పని చేస్తున్నారు…

కొందరు పాకెట్ మనీ కోసం…
కొందరు కాలేజ్ ఫీజుల కోసం…
కొందరు బ్రతుకు తెరువు కోసం..

ఖాళీ గా ఐతే ఉండటం లేదు గా…
తప్పు ఐతే చేయటం లేదు గా….

మరి అలాంటి వాళ్ళ దగ్గర,
మనకి ఈ చిన్న చూపు ఎందుకు !!!

 

అందుకే వేరే country లో లాగా ఇక్కడ చిన్నప్పటి నుంచే ఏదో ఒక పార్ట్ టైమ్ జాబ్ ఎవరూ చేయటం లేదు…
జాబ్ వచ్చే వరకు ఏం చేయకుండా అలాగే ఉంటున్నారు….

ఏదైనా చిన్న పని పార్ట్ టైమ్ గా చేస్తే..
ఎక్కడైనా చిన్న ఉద్యోగం చేస్తే…
ఎవరు ఏం అనుకుంటారో అనే ఆలోచిస్తున్నారు….

చిన్న ఉద్యోగం దొరికినా…చేయకుండా.. వద్దు అని ఖాళీ గానే ఉంటున్నారు..

 

Diginty of Labour…

ప్రతి పనిని ఒకేలా చూడండి.
గౌరవం ఇవ్వకపోయినా పర్లేదు,
but గుర్తించండి…

 

ఇది ముందు మీరు అర్థం చేసుకోండి…
తర్వాత అర్థం కాని వాళ్లకి అర్ధం అయ్యేలా చెప్పండి….

 

Feature Image Credits: Prathyaksh Raju

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , , ,