Ever Gave A Thought On How Old Homeless People Die? Our New Documentary Uncovers The Untold Story!

మనిషి జీవితం లో ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని యుద్ధాలు చేసినా చిటికెడు అన్నం, చనిపోయే క్షణాల్లో తోడుండే సాయం కోసమే. కష్టాల్లో కన్నీళ్లు తుడిచేవారు, కడ దాకా మనకి తోడుగా ఉండేవారు మనతో ఉంటే, చావును కూడా చిరునవ్వు తో స్వాగతించొచ్చు. అలా ఏ దిక్కు లేకుండా అనాథలా ప్రాణాలు విడిచేవారికీ తామే దిక్కు అవ్వాలి అనే ఆలోచన తో స్థాపించబడిన సంస్థే “గుడ్ సమారిటన్స్ India” N.G.O

జార్జ్ రాకేష్ కుమార్, తన నిజ జీవితం లో జరిగిన సంఘటనల నుండి పుట్టిన ఆలోచనే ఈ “గుడ్ సమారిటన్స్” . ఈ టెక్నాలజీ హంగుల్లో మానవత్వం కనుమరుగైపోతున్న ఈ కాలంలో, మనిషికి మనిషే సాయం అని మరోసారి నిరూపించారు వీరు. చనిపోయే ముందు చిరునవ్వు తో చావాలి కానీ, నేను బ్రతకలేను దేవుడా అని నిరాశ తో కాదు. ఇప్పటిదాకా దాదాపు 170 మంది వృద్ధులను, రోగులను, అనాథలను కడదాకా తామే దిక్కై సేవ చేస్తున్నారు. ఇలాంటి గొప్ప మనుషుల గురించి, వారి గొప్ప ఆలోచనల గురించి మీ ముందుకు తీసుకురావటం కోసం ChaiBisket చేసినా ఒక చిరు ప్రయత్నం “దైవం మానుష రూపేనా” – Die In Peace
If you wish to contribute, mail us at admin@chaibisket.com