Meet The Young Team Who Made An App That Delivers Items To Small Villages

 

“నగరాలకు ధీటుగా పల్లెటూరికి కూడా అన్ని రకాల సర్వీస్ లను తీసుకురావడం నా లక్ష్యం” -రాజశేఖర్

మన భారతదేశంలో సుమారు 6,50,000 గ్రామాలున్నాయి. టౌన్ లు, సిటీలు మాత్రం 4,000 వరకూ ఉండొచ్చు. భారతదేశంలోని ఎక్కువ జనాభా పల్లెలు, ఓ మోస్తరు మండలాల్లో నివసిస్తున్నారనేది వాస్తవం.. మరి ఇంత జనాభా, ఇంత మార్కెట్ ఉన్న చోట ఈనాటికి కూడా హోమ్ డెలివరీ సర్వీస్ లేకపోవడం రాజశేఖర్ కు ఆశ్చర్యం కలిగించేది. ఎప్పటినుండో ఒక స్టార్టప్ మొదలుపెట్టాలనే ఆలోచన కూడా ఈ ఆశ్చర్యానికి జత కలిసింది.. ఫలితంగానే మీబడ్డి కొన్ని నెలల క్రితం హోమ్ డెలివరీ సర్వీస్ ను ప్రారంభించింది.

 

“మంచి నిర్ణయాలు తీసుకుని, ఆలోచనలని త్వరగా అమలు చేయడమే విజయానికి గల రహస్యం”

మారుమూల గ్రామం నుండి..
రాజశేఖర్ నూజివీడు ట్రిపుల్ నుండి చదువుకున్న వ్యక్తి. ఉద్యోగం కోసం ఎదురుచూడడం కన్నా ఉద్యోగం ఇచ్చే పొజిషన్ లో ఎక్కువ మంది ఉంటే కనుక ఎక్కువ కంపెనీలు వస్తాయి, తద్వారా ఎక్కువమందికి ఉపాధి అవకాశాలు వస్తాయని రాజశేఖర్ నమ్మకం. నెల్లూరు జిల్లా సున్నంవారిచింతల అనే మారుమూల గ్రామం తనది. అమ్మానాన్నలు వ్యవసాయం చేస్తుంటారు, చిన్నప్పటి నుండి చదువు పట్ల గౌరవం ఉండడం వల్ల రాజశేఖర్ జీవితంలోనూ ఒక్కో మెట్టు అనతికాలంలోనే ఎదిగాడు. నూజివీడు ట్రిపుల్ ఐటి చదువు పూర్తి చేసిన తర్వాత మీబడ్డి రూపకల్పన జరిగింది.


 

అన్ని రకాల సర్వీసులు:
మన సిటీలలో చూసుకుంటే ఫుడ్ డెలివరీ కోసం కొన్ని కంపెనీలున్నాయి, కూరగాయలు కిరాణా కోసం కొన్ని కంపెనీలున్నాయి, మొబైల్ మిగిలిన వస్తువుల కోసం కొన్ని కంపెనీలున్నాయి.. మీబడ్డి మాత్రం పై వాటన్నింటినీ అలాగే ఓలా ఉబర్ లాంటి సర్వీసులన్నింటిని అందిస్తుంది అది కూడా ఆర్డర్ పెట్టిన 30నిమిషాల లోపే.. వస్తువులు ఎలా ఐతే నగరం నుండి పల్లెలకు తీసుకువస్తున్నారో అలాగే భవిషత్తులో గ్రామాల్లో పండించిన వ్యవసాయ ఉత్పత్తులు నేరుగా కస్టమర్స్ కు పంపించేందుకు కూడా ఈ డెలివరీ సర్వీస్ వారధిగా ఉండబోతుంది. 

కేవలం రూ.10 డెలివరీ ఛార్జ్:
ఆర్జియూకేటి ఛాన్సలర్ కేసి రెడ్డి గారి సహాయంతో మీబడ్డి ప్రధాన కార్యాలయం నూజివీడు ట్రిపుల్ ఐటీ లోనే ఏర్పాటుచేశారు. కొన్ని నెలల క్రితమే ప్రారంభమైన ఈ సర్వీసులు ప్రస్తుతం నూజివీడు, గన్నవరం, తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు, మల్కిపురంలో నడుస్తున్నాయి. ప్రాంఛైజీల ద్వారా డిసెంబర్ లోగా పూర్తి తెలుగు రాష్టాలలోని అన్ని ప్రాంతాలకు విస్తరించబోతున్నారు. కొన్ని గ్రామాలకు ఒక మండల, జిల్లా కేంద్రం ఉంటుంది అక్కడి నుండి నేరుగా హోమ్ డెలివరి చేస్తారు వస్తువుల బరువుల బట్టి దీని ఛార్జ్ నిర్ణయించారు.


 

ఇదొక అద్భుతమైన స్టార్టప్. ఏదో డెలివరీ సర్వీసులు గ్రామాలకు కూడా విస్తరించాయనేది పైకి కనిపించేవి అయినా, కాస్త లోతుగా పరిశీలిస్తే “ప్రతి వస్తువు కోసం ఇక నుండి పట్టణాలకు వెళ్లే బాధ తప్పడమే కాదు, పల్లెలో నివసించే ప్రజలలో మేము రెండవ తరగతి మనుషులమనే భావన పూర్తిగా తగ్గిపోతుంది, అభివృద్ధి గ్రామాల్లో కూడా జరుగుతుంది, అన్నిటికి మించి సిటీకి వలస వెళ్లే ఖర్మ కూడా తగ్గిపోతుంది.


 

యాప్ కోసం: https://play.google.com/store/apps/details?id=com.meebuddy.android
ఫోన్ నెంబర్: 6304917180

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , ,